సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాధాకృష్ణణ్ తక్కువ సమయంలోనే అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ‘ఆనంద్’, ‘గోదావరి’ వంటి ఫీల్‌గుడ్ చిత్రాలకు సంగీతం అందించి, ప్రేక్షకులకు సుమధుర సంగీతానుభవాన్ని పంచింది ఆయనే. క్లాసికల్ టచ్ ఉన్న మెలోడీ గీతాలతో అందరినీ ఆకట్టుకుంటున్న యువ సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణణ్‌తో ఈ వారం ‘ఫటాపట్’.
పూర్తి పేరు?
కాట్రంపట్టి మోహన్ రాధాకృష్ణణ్.
పుట్టింది?
గద్వాల.
పెళ్లయిందా?
భార్య రాధిక, పాప అక్షిత.
చదువు?
బి.ఎస్.సి (మ్యూజిక్)
కుటుంబ నేపథ్యం?
నాన్న విలేజ్ ఈవోగా పనిచేశారు. అమ్మ టీచర్. నిజానికి మా నాన్నకు హిందుస్థానీ సంగీతంలో ప్రవేశం వుంది. 500 వరకూ పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చారు.
సంగీతం నేర్చుకున్నారా?
కోయాంబత్తూర్‌లో నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్ రాంకోఠి మ్యూజికల్ కాలేజీలో కర్ణాటక గాత్రంలో డిప్లొమా చేశా.
మొదటి ఉద్యోగం?
షేర్ మార్కెట్.
మొదటి చిత్రం?
‘సైపూన్స్ ఫ్లీజ్’ అనే మూకీ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాను. పాటల విషయానికొస్తే ‘హీరో’ అనే చిల్డ్రన్స్ సినిమా నా మొదటి చిత్రం.
ఫస్ట్ సాలరీ?
ఐదు వేలు (‘హీరో’ చిత్రానికి)
ఇప్పటి వరకూ ఎన్ని చిత్రాలకు సంగీతం అందించారు?
12 సినిమాలకు. అవి: ‘హీరో’, ‘మేఘం’, ‘ఆనంద్’, ‘కాంచనమాల కేబుల్ టీవీ’, ‘మాయాబజార్’, ‘గోదావరి’, ‘మనసు పలికే మౌనరాగం’, ‘చందమామ’, ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’, ‘భలే దొంగలు’, ‘బలాదూర్’, ‘నాకో లవరుంది’, ‘ఎన్ ఇందా మౌనం’. (తమిళ్)
అవార్డులు తీసుకున్నారా?
‘గోదావరి’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నా.
టీవీ కార్యక్షికమాల్లో చేశారా?
సరిగమప, జీటీవీ సూపర్ సింగర్, పాడుతా తీయగా వంటి కార్యక్షికమాలకు న్యాయనిర్ణేతగా చేశా.
సంగీతంలో మీకు ప్రయోగాలు చేయాలనుందా?
ఇప్పటికే చేశా, ముందు ముందు కూడా చేస్తా...
అన్నట్టు, ‘ఆనంద్’ చిత్రానికి అవకాశం ఎలా వచ్చింది?
మిత్రుని ద్వారా శేఖర్ కమ్ముల పరిచయం అయ్యారు. ఒక ట్యూన్ ఇచ్చి మరీ టెస్ట్ పెట్టారు. మరునాడే ఆఫీసుకు పిలిపించుకుని అడ్వాన్స్ ఇచ్చారు.
ఆ చిత్రంలో మీకు నచ్చిన పాట?
అందులోని పాటలన్నీ హిట్టే. అన్నిటినీ పెద్ద గాయకులతో పాడించా. సో అన్నీ ఇష్టమే.
ఎలాంటి పాటల్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు?
మెలోడీ ఇష్టం. క్లాసికల్ టచ్ ఉన్న మెలోడీ అంటే ఇంకా ఇష్టం.
మీకిష్టమైన ఒక పాట?
‘మనసా వాచా నిన్నే కొలిచా!...’ (గోదావరి)
ఇష్టమైన ఫ్లే బ్యాక్ సింగర్స్?
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి వాయిస్ ఉండే గాయకులంటే ఇష్టం. చిత్ర, శ్రేయ గోషల్ ఇలా..
మీరు సంగీతం అందించిన సినిమాలలో ఏ చిత్రం ఇష్టం?
‘గోదావరి’
సంగీత దర్శకులలో ఎవరిష్టం?
ఎస్.డి బర్మన్, ఎం.ఎస్ విశ్వనాథన్, కె.వి మహదేవన్, ఎ.ఆర్. రెహమాన్, ఇళయరాజా.
హీరోల్లో...?
పవన్ కళ్యాణ్
దర్శకులు?
సంజయ్ లీలా బన్సాలీ, మణిరత్నం.
మీ కిష్టమైన పాటల రచయిత?
తెలుగులో వేటూరి, తమిళంలో వైరముత్తు.
మీ కిష్టమైన మ్యూజిక్ చానల్?
సోని మ్యూజిక్, వి1
మీకు మైఖేల్ జాక్సన్ ఇష్టమా? ప్రభుదేవానా?
మైఖేల్ జాక్సన్.
సైలెన్స్ ఇష్టమా? రణగొణ ధ్వనులు ఇష్టమా?
ప్రశాంతత ఇష్టం.
జానపదం ఇష్టమా? క్లాసికల్ ఇష్టమా?
రెండూ. శాస్త్రీయత లేకుండా ఏదీ చేయలేం.
గోరటి వెంకన్న ఇష్టమా? బాలమురళీకృష్ణనా?
సందర్భాన్ని బట్టి.
తరచుగా మీరు ‘హమ్’ చేసే పాట?
మళ్లీ...సందర్బాన్ని బట్టే అంటాను.
మీరు హార్డ్ వర్కరా? క్రియేటివా?
క్రియేటివిటితో కూడిన హార్డ్ వర్కర్ని.
మీరు అందుకున్న మంచి ప్రశంస?
నన్ను చాలామంది ఇళయరాజా, రెహమాన్‌లతో పోల్చడం.
రెహమాన్‌పై మీ కామెంట్?
ఆయన ఇండియన్ కావడం మనకు గర్వకారణం.
జీవితంలో మరిచిపోలేని సంఘటన?
లతా మంగేష్కర్ ముందు కూర్చుని పాడడం.
మీ సక్సెస్ రహస్యం?
అవకాశాలు రావడమే.
ఈ వృత్తిలో ఒత్తిడి ఎలా ఉంటుంది?
ఒత్తిడి కన్నా సంఘర్షణ ఎక్కువ.
మీకు అత్యంత సంతృప్తి నిచ్చిన చిత్రం?
‘చందమామ’
ఉచితంగా ‘సంగీత దర్శకత్వం’ చేయాల్సి వస్తే ఎవరికి? ఎలాంటి సందర్భంలో చేస్తారు?
ఎవరికీ చేయను. నేను ఛారిటీ నడపడం లేదుగా.
ప్రస్తుతం చేస్తున్న చిత్రం?
‘రాధా మనోహరం’ (సిద్ధార్థ బొమ్మగాని డైరెక్టర్)
చివరి ప్రశ్న, కొత్తగా సినిమా రంగంలోకి వస్తే ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
డైరెక్షన్.
- మధుకర్ వైద్యుల
COURTESY
NAMASTHETELANGAANA.COM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి