23, సెప్టెంబర్ 2012, ఆదివారం

కాకలుతీరిన యోధుడికి కన్నీటి వీడ్కోలు

కాకలుతీరిన యోధుడికి కన్నీటి వీడ్కోలు
falg
10.50 : కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానుల కడచూపులు
11.40 : గౌరవ వందనం సమర్పించిన పోలీసు బృందం
12.04 : బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభం
1.32 : గాంధీభవన్‌కు చేరుకున్న అంతిమయాత్ర
2.10 : గన్ పార్క్ వద్ద ఉద్యమనేతకు నివాళి
3.20 : జలదృశ్యానికి చేరుకున్న అంతిమయాత్ర
3.50 : చితి మంటల్లో
బాపూజీ పార్థివ దేహం 


ప్రజలు, ఉద్యమ శ్రేణులు, నేతల ఘన నివాళి
కొండా లక్ష్మణ్ ఆశయ సాధనకు పార్థివ దేహంవద్ద ప్రతిజ్ఞ
జలదృశ్యంలో బాపూజీ అంత్యక్షికియలు

మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన అంతిమయాత్ర సాయంత్రం 3.20కి జలదృశ్యానికి చేరిక
చితికి నిప్పంటించిన బాపూజీ కుమార్తె పవిత్ర హోరెత్తిన తెలంగాణ నినాదాలు
పద్మశాలి భవన్, గాంధీ భవన్, గన్‌పార్క్ వద్ద నేతల నివాళులు సెప్టెంబర్ 30న జలదృశ్యంలో దశదినకర్మ
bapu
ధారాళంగా కారుతున్న కన్నీళ్లు.. గుండెలోతుల్లోంచి పొంగుకొస్తున్న మహా విషాదం! జీవిత చరమాంకం వరకూ తెలంగాణకు కొండంత అండగా నిలిచిన మహా మనీషి.. ఇక కనిపించరన్న ఆవేదన! జోహార్ బాపూజీ.. అమర్‌హై బాపూజీ.. సాధిస్తాం కొండా లక్ష్మణ్ ఆశయాలను.. సాధిస్తాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని... అంటూ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న ఉద్యమక్షిశేణలు.. కడపటి వీడ్కోలు పలకగా.. తెలంగాణ పెద్దదిక్కు అంతర్థానమైపోయింది! భౌతిక దేహాన్ని చుట్టుముట్టిన చితిమంటల నుంచి అనంతలోకాలకు పయనమైపోయింది! తెలంగాణ కల సాకారానికి గుండెల నిండా పోరాట స్ఫూర్తిని నింపి.. ఉద్యమ బావుటాను శ్రేణులకు అందజేసి.. కొండాలక్ష్మణ్ బాపూజీ కనుమరుగైపోయారు! శుక్రవారం ఉదయం అస్తమించిన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ కొండాలక్ష్మణ్ బాపూజీ అంత్యక్షికియలు శనివారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బాపూజీ తన జీవితకాలంలో ఎక్కువ కాలం నివసించిన జలదృశ్యం వద్ద ఏర్పాటు చేసిన చితికి ఆయన కుమార్తె పవివూతవాణి నిప్పంటించారు. అంతకుముందు పద్మశాలి భవన్ నుంచి మొదలైన అంతిమయాత్ర.. పలువురు ప్రముఖులు సహా వేలాది మంది వెంటరాగా.. గాంధీభవన్, గన్‌పార్క్ మీదుగా జలదృశ్యానికి చేరుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (టీ మీడియా) : తెలంగాణ ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ.. కానరాని తీరాలకు వెళ్లిపోయా రు. తెలంగాణ పోరాటాలకు, బడుగు ఉద్యమాలకు మూల స్తంభంగా నిలిచిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి అంత్యక్షికియలు హైదరాబాద్‌లో ఆయన నిర్మించుకున్న జలదృశ్యంలో అధికార లాంఛనాల మధ్య.. కన్నీటిపర్యంతమవుతున్న అశేష జనవాహిని నడుమ పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 3.45 గంటలకు చితికి బాపూజీ కుమార్తె పవివూతవాణి నిప్పటించారు. మంటలు ఎగసిపడుతుండగా.. బాపూజీ అమర్‌హై.. జై తెలంగాణ.. అంటూ తెలంగాణ శ్రేణులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు, తెలంగాణవాదులు ఆయనకు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. లక్ష్మణ్ కలలుగన్న తెలంగాణ సాధిస్తామంటూ అంతకుముందు ఆయన పార్థివ దేహంపై ప్రతిజ్ఞ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దశదిన కర్మ ఈ నెల 30న జలదృశ్యం వద్ద నిర్వహించనున్నారు. తొలుత బాపూజీ అంత్యక్షికియలు ఎక్కడ జరుగుతాయన్న అంశంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. లక్ష్మణ్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి జైపాల్‌డ్డిని ఈ విషయమై పలువురు తెలంగాణవాదులు నిలదీయడంతో ఆయన వెంటనే సీఎం కిరణ్‌కుమార్‌డ్డితో మాట్లాడి.. జలదృశ్యంలోనే అంత్యక్షికియలు జరిపించేందుకు ఒప్పించారు. బాపూజీ భౌతికకాయాన్ని ఉంచిన పద్మశాలి భవన్‌లో ఉదయం 10.50 గంటలకు ఆయనను కుటుంబీకులు, బంధువులు, అభిమానులు, పలువురు నేతలు, తెలంగాణ శ్రేణులు కడసారి చూసుకున్నాక భౌతికకాయాన్ని హాల్ బయటకు తీసుకువచ్చారు. 11.20 గంటలకు ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని కప్పారు.
at-jaladrushyam-(17)
ప్రభుత్వ ఆదేశాల మేరకు సెంట్రల్‌జోన్ డీసీపీ తరుణ్ జోషి , అడిషినల్ డీసీపీ రామచంవూదన్‌ల నేతృత్వంలో 11.40 గంటలకు గాలిలోకి కాల్పులు జరిపి పోలీసు వందనం సమర్పించారు. 12గంటల ప్రాంతంలో వేలాది మందితో బాపూజీ ఆఖరి ప్రస్థానం పద్మశాలి భవన్ నుంచి మొదలైంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గాంధీభవన్‌కు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ప్రజలు, నేతల సందర్శనార్థం ఉంచిన తర్వాత అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం వద్దకు చేరుకుంది. అక్కడ నివాళులర్పించిన తర్వాత జలదృశ్యం దిశగా యాత్ర కదలింది. మధ్యాహ్నం 3.20 గంటలకు కొండా లక్ష్మణ్ దీర్ఘకాలం నివసించిన జలదృశ్యానికి అంతిమయాత్ర చేరుకుంది. అప్పటికే అక్కడికి వేల మంది అభిమానులు, తెలంగాణవాదులు, పలువురు ప్రముఖులు చేరుకున్నారు. అక్కడ పలువురు తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్ర సాధిస్తామని, బాపూజీ ఆశయాన్ని నెరవేరుస్తామని భౌతికకాయంపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం 3.50 గంటలకు లక్ష్మణ్ కుమార్తె చితికి నిప్పంటించారు.

జైపాల్ జోక్యంతో జలదృశ్యంలో అంత్యక్షికియలు
పద్మశాలి భవన్‌కు వచ్చిన జైపాల్‌డ్డిని పలువురు తెలంగాణవాదులు చుట్టుముట్టి నిలదీశారు. బాపూజీ అంత్యక్షికియలు ఆయన నిర్మించుకున్న జలదృశ్యంలోనే జరిగేలా చూడాలని పట్టుబట్టారు. అక్కడే ఆయన స్మారక చిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించేలా చూడాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించి జైపాల్‌డ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. జలదృశ్యంలోనే బాపూజీ అంత్యక్షికియలు జరిపేందుకు సీఎంను ఒప్పించారు. దీంతో జైపాల్‌డ్డి జిందాబాద్, బాపూజీ అమర్ హై, జై తెలంగాణ... జైజై తెలంగాణ అంటూ చేసిన నినాదాలతో భవనంతా దద్దరిల్లిపోయింది.

ప్రజల కోసం, ప్రగతి కోసం పాటుపడ్డ వ్యక్తి : జైపాల్‌రెడ్డి
ప్రజల కోసం, ప్రగతి కోసం అహర్నిశలు పాటుపడ్డ మహా వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, చేతి వృత్తులవారి అభివృద్ధికి పోరాడిన యోధుడంటూ శ్రద్ధాంజలి ఘటించారు.

అంతిమయావూతలో ప్రముఖులు
బాపూజీ అంతిమయావూతలో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌డ్డి, ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్‌డ్డి, దేవేందర్‌గౌడ్, మాజీ ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమణ, ఎమ్మెల్సీలు ఆమోస్, దిలీప్‌కుమార్, ప్రజాగాయకుడు గద్దర్, జనశక్తి కేంద్రకమిటీ కార్యదర్శి కూర రాజన్న, రాష్ట్ర కార్యదర్శి అమర్, విమలక్క, వేదకుమార్, మేచినేని కిషన్‌రావు, టీఎన్జీఓ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, కారం రవీందర్‌డ్డి, ముజీబ్, శ్యామ్, కృష్ణాయాదవ్, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ గాయకుడు గోరటి వెంకన్న, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేతలు పల్లె రవికుమార్, వాసు, తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు కే ప్రసాదరావు, కేసీఆర్ అభిమానసంఘం అధ్యక్షుడు ఎస్ వెంక పాల్గొన్నారు.

వీరితోపాటు అంత్యక్షికియలకు హాజరైనవారిలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, వినయ్‌భాస్కర్, గంప గోవర్ధన్, నాగం జనార్దన్‌డ్డి, భిక్షపతియాదవ్, అనిల్, కిషన్‌డ్డి, జోగిరామన్న, ఏనుగు రవీందర్‌డ్డి, సత్యనారాయణ, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, బీజేపీ నేత బండారు దత్తావూతేయ, టీఎన్జోవో అధ్యక్షుడు దేవీవూపసాద్, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, వేదకుమార్, సంధ్యక్క, మణిమాల, తెలంగాణ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం, ప్రత్యేకాంధ్ర సమితి నాయకులు యు సాంబశివరావు, దళిత నాయకులు బొజ్జా తారకం, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంక తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం నాయకులు కైలాశ్‌నేత, దయాకర్ ఉన్నారు. బాపూజీ దశదినకర్మ ఈనెల 30వ తేదీన జలదృశ్యంలో నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.

గాంధీభవన్ వద్ద
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ వద్ద బాపూజీ భౌతికకాయానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, మాజీ ఎంపీ కె కేశవరావు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ మంత్రి చిన్నాడ్డి నివాళులర్పించారు.

రాత్రంతా భజనలతో స్మరణ
శుక్రవారం ఉదయం కన్నుమూసిన బాపూజీ భౌతికకాయాన్ని అదే రోజు మధ్యా హ్నం 12 గంటల సమయంలో రాంకోఠీలోని పద్మశాలి భవన్‌కు ప్రజల సందర్శనార్థం తరలించారు. శుక్రవారం రాత్రి 7 గంటలనుంచి శనివారం తెల్లవారుజామువరకు భగవద్గీతాపారాయణాలు, భజనలతో బాపూజీని స్మరించారు. పద్మశాలి భవన్‌కు వచ్చిన తెలంగాణ రాజకీయ కురువృద్ధుడు జీ వెంకటస్వామి బాపూజీ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి సబితాఇంవూదాడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ దివంగతనేతకు పుష్పాంజలి ఘటించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎంపీ మంద జగన్నాథం, ఎంపీలు దేవేందర్‌గౌడ్, వివేక్, ఎమ్మెల్యేలు ఉమామాధవడ్డి, జూలకంటి రంగాడ్డి, జగ్గాడ్డి, గుండా మల్లేష్, జైపాల్ యాదవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి వినోద్, జీవన్‌డ్డి, కాసాని జ్ఞానేశ్వర్, నన్నపనేని రాజకుమారి, స్వాతంత్య్ర సమరయోధుడు బోయిని పల్లి వెంకట రామారావు, ఎంఆర్‌పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ, రచయిత గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, కేశవరావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి