23, సెప్టెంబర్ 2012, ఆదివారం

TG STAR-SAMPATH NANDI

ఇటీవల విడుదలైన రామ్ చరణ్‌తేజ చిత్రం ‘రచ్చ’ ద్వారా గుర్తింపు పొందిన దర్శకుడు సంపత్ నంది. ‘ఏమైంది ఈ వేళ’ చిత్రం ద్వారా దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన సంపత్ సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో తెలుగుచలన చిత్ర రంగ ప్రవేశం చేశారు. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్‌గా పలువురు దర్శకుల దగ్గర పనిచేశారు. ‘ఆయుధం’ సినిమాకు రచనా సహకారం, ‘ధమ్’, ‘టాస్’ సినిమాలకు మాటలు అందించారు. బి.ఫార్మసీ చదివిన నంది అనేక యాడ్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించిన అనుభవం కూడా ఉంది.

మీ పేరు? 
సంపత్
ఇంటి పేరు?
నంది
ఏ ఊరు?sampath-nandi_portrait

కరీంనగర్ జిల్లా ఓదెల.
పెళ్లయిందా?
భార్య భవాని నంది, కొడుకు యువ నంది.
చదువు అబ్బిందా?
పర్లేదు. కర్ణాటకలోని రాయచోటిలో బి.పార్మసీ
మొదటి ఉద్యోగం?
పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ రైటర్
ఫస్ట్ సాలరీ?
మొదట్లో మూడు వేలు, తరువాత 12 వేలు అనుకుంటా....
కట్నం తీసుకున్నారా?
తీసుకోలేదు. పెళ్లి కూడా నా ఖర్చుతోనే చేసుకున్నాను.
ప్రస్తుతం చేతిలో ఉన్న పని?
నిర్మాత శానం నాగ అశోక్ కుమార్‌తో ఒక చిత్రం చేస్తున్నాను.
మీరు సెటిలైన
ఇప్పటికైతే...
మీలో మీకు బాగా నచ్చే విషయం? 
హార్డ్‌వర్క్.
దేవుడ్ని నమ్ముతారా?
తప్పకుండా.

మనిషిని?
మనిషిమీదా మనిషికి తప్పకుండా నమ్మకం ఉంటేనే కదా మనుగడ సాగించేది.
మీకు నచ్చిన డైలాగ్? 
దేవుడు గురించి చెబుతూ భద్రాచలం సినిమాలో అనుకుంటా, రాశాను, ‘ఇది కాశీదారమే కాదు. కాన్ఫిడెన్స్‌కు ఆధారం.’
మీరు దేనికి భయపడతారు? 
ఫెయిల్యూర్‌కు..
బలం?
నా కాన్ఫిడెన్సే నాకు బలం
బలహీనత?
నేను చాలా ఎమోషనల్. ఎవరైనా చీట్ చేస్తే తట్టుకోలేను.
ఇష్టమైన యాక్టర్?
అమీర్‌ఖాన్.
మీ పగటి కల? 
అమీర్‌ఖాన్ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయడం. ఇది నిజంగా నాకు చాలా సార్లు వచ్చే కల.
కోపం వస్తే ఏం చేస్తారు?
సైలెంట్‌గా ఉంటా....
మీ గురించి ఒక అబద్దం చెప్పండి? 
నేను చాలా అందంగా వుంటాను (నవ్వుతూ)

మిమ్మల్ని మీరు తిట్టుకున్న సందర్భం?
అలాంటి సందర్భం రాలేదు. ఎందుకంటే, నేను ఏదైనా ప్లాన్ చేసుకునే పనిచేస్తాను.
మీరు ఎన్ని దేశాలు తిరిగారు?
చాలా తిరిగాను. సినిమా షూటింగ్‌ల కోసం లొకేషన్స్ వెతకడానికి అన్ని దేశాలు తిరగాల్సి వస్తుంది.
మన తెలంగాణలో మీకు నచ్చిన ప్రదేశమేది?
హన్మకొండ. నేను ఎక్కువకాలం గడిపింది అక్కడే. ఇంటర్ నుండి హన్మకొండతో అనుబంధం ఉంది.
మీ దృష్టిలో దోస్త్ అంటే? 
నమ్మకం. స్నేహితుడికి బలాన్ని ఇచ్చేవాడే స్నేహితుడు.
మీరు క్రియెటివా లేక హార్డ్ వర్కరా? 
హార్డ్ వర్కర్‌ను.
మీకు తాబేలు ఇష్టమా, కుందేలా?
ప్రస్తుతమున్న ట్రెండ్‌లో నిదానం పనికిరాదు. మనం వెనుకబడితే మన అవకాశాలు వేరేవారికి దక్కుతాయి. అందుకే పరుగెత్తి పాలు తాగడమే ఇష్టం.
మీ జీవితంలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
నేను చేసే వృత్తినే ఎక్కువగా ప్రేమిస్తాను. కెరీర్ తర్వాతే అమ్మ, నాన్న. భార్య, పిల్లలు.
ఎవరి మీద మీరు ఎక్కువగా ఆధారపడతారు?
నా మీద నేనే ఎక్కువగా ఆధారపడతాను. ఒకరిని నమ్మి ఏ పనీ మొదలు పెట్టను.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వావ్లూవరు?
యాష్ చోప్రా, కరణ్ జోహర్, చిరంజీవి,రాం చరణ్
మీకు పేరు ప్రతిష్టలు ఇష్టమా? డబ్బు ఇష్టమా? ప్రశాంత జీవితమా?
అన్నీ, అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే ప్రశాంత జీవితం గడప గలుగుతాము.
పుస్తకాలు చదువుతారా?
సినిమాలు చూడడం కంటే నాకు పుస్తకాలు చదవడమే ఇష్టం. అన్ని రకాల పుస్తకాలు ఇష్టంగా చదువుతాను. చివరికి షాపుల్లో పొట్లాలు కట్టించే పేపరు ముక్కను కూడా వదలను.
మీకు ఫేస్ బుక్కు ఉందా?
లేదు. ట్విట్టర్ కూడాలేదు. నా పేరు మీదా క్రియెట్ చేసినవన్ని కూడా ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ ఖాతాలు.
మీకు ఎటువంటి సందర్భంలో కన్నీళ్లు వస్తాయి?
నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు.
మీకు అవకాశం వస్తే దేశంలో ఎక్కడ సెటిలవుతారు? 
నాకు హైదరాబాద్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే ఇక్కడే సెటిలవ్వాలనుకుంటాను.
ఒంటరిగా ఉన్నపుడు ఏం చేస్తారు?
ఆలోచిస్తుంటా....
మీ ఇమ్మిడియేట్ టార్గెట్?
సినిమా...సినిమా...సినిమా....
మీకు ఒక్క రోజు ముఖ్యమంవూతిగా ఉండే అవకాశం వస్తే?
వదిలేస్తాను...ఎందుకంటే నాకు రాజకీయాలు అంతగా తెలియవు.
మీలో ఒక ఫిలాసఫర్ ఉన్నాడా?
ప్రతి వ్యక్తిలో తప్పకుండా ఒక ఫిలాసఫర్ ఉంటాడని నా నమ్మకం. నాలోనూ ఉన్నాడు.
ఉంటే ఎటువంటి సందేశం ఇస్తాడు?
బతకండి, బతకనివ్వండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి