26, సెప్టెంబర్ 2012, బుధవారం

ఇది విహార యాత్ర కాదు ..తెలంగాణ తల్లి విముక్తి యాత్ర


పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ఈ నెల 30న తెలంగాణ మార్చ్ జరిగి తీరుతుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తేల్చిచెప్పారు. మార్చ్ ఎప్పుడు ముగుస్తుందనేది ఆరోజే తేలుస్తామని తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో వేర్వేరు కార్యక్షికమాల్లో పాల్గొని ప్రసంగించారు. మార్చ్ జరిగే విషయంలో ఎలాంటి శషభిషలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణతల్లిని విముక్తి చేసేందుకే మార్చ్ చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతించాలేగానీ.. కోటి మంది వచ్చేందుకూ సిద్ధమని ప్రకటించారు. తాము ఒట్టిగా లేమని, ఉపాయంతో ఉద్యమాన్ని నడుపుతున్నామని చెప్పారు. తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయని, చివరిలో బ్రహ్మాస్త్రాన్ని తీస్తామని కోదండరాం వెల్లడించారు. కలిసిరాని పార్టీలను మట్టికరిపిస్తామని అన్నారు. మంత్రులకు పదవులు, అధికారంమీద యావే తప్ప ప్రజా ఆకాంక్షలపై శ్రద్ధ లేదని కోదండరాం విమర్శించారు.

‘‘మూడు నెలల క్రితం మార్చ్ ప్రకటన చేస్తే ఇప్పుడు వాయిదా వేసుకోమంటున్నారు. మాది విహార యాత్ర కాదు.. ఇది తెలంగాణ కోసం చేసే మార్చ్. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌ను తీర్చితే మార్చ్‌ను ఆపే ఆలోచన చేస్తాం’’ అని విస్పష్టంగా చెప్పారు. అమెరికాలో నల్లజాతీయులు శ్వేతజాతీయులకు ఐడీ కార్డు చూపినట్లుగా ఇక్కడ తెలంగాణ వారి పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యి మంది చనిపోయినా స్పందించని ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నామని చెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇస్తే మీడియా రక్షణ బాధ్యత తామే తీసుకుంటామన్నారు.

లేకుంటే ప్రభుత్వం తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నది వాస్తవమని కోదండరాం చెప్పారు. ‘‘మనం కొట్లాడేది సీమాంధ్ర పాలకులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతోనే.. సీమాంధ్ర ప్రజలతో కాదు’’ అని అన్నారు. హైదరాబాద్‌లోని సెటిలర్లు అభవూదతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ ఉద్యమం 11 ఏళ్లుగా సాగుతున్నప్పటికీ సహనం కోల్పోతే తెలంగాణ ప్రజలే ప్రాణత్యాగాలు చేసుకున్నారేగానీ.. ఏనాడూ ఎవరిపైనా దాడులకు పాల్పడలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రేమ, దయాగుణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తే వచ్చే ఫలితంలో ఇక్కడి సీమాంవూధులకూ భాగస్వామ్యం ఉంటుందని, కనుక అందరం కలిసి తెలంగాణ సాధించుకుందామన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి