పోరుబిడ్డలకే జేజేలు
 - ఉప ఎన్నికల్లో కారు జోరు
 - గులాబీదండుకు జననీరాజనం
 - పరువు కోసం కాంగ్రెస్, టీడీపీ ఆరాటం
 - కామ్రేడ్ల షాక్‌తో బాబు ఏక్‌నిరంజన్
 తెలంగాణ ఉప ఎన్నికల క్షేత్రం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. పల్లెలు, 
పట్నాలు ఉద్యమ కొలిమిగా మండుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎగిసిపడుతున్న 
ఉద్యమ కెరటాలు తెలంగాణవూదోహుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఉప 
ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులను పాతరేసేందుకు ప్రజలందరూ ఏకమవుతున్నారు. 
తెలంగాణ కోసం పదవులను తృణపాయంగా త్యజించిన పోరు బిడ్డలకు భారీ మెజారిటీ 
అందించి గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు మోసం చేస్తున్న 
కాంగ్రెస్, టీడీపీలకు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేసేందుకు గ్రామాలకు 
గ్రామాలు తీర్మానాలు చేస్తున్నాయి. తెలంగాణ ఇస్తామని, తెస్తామని ముఖం 
చూపించడానికి సిగ్గుపడుతున్న కాంగ్రెస్‌కు, రెండుకళ్లు... రెండు 
నాలుకలు...అంటూ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటున్న టీడీపీకి 
కర్రుకాల్చి వాత పెట్టేందుకు ఈ నెల 1 న జరిగే పోలింగ్ కోసం తెలంగాణ ప్రజలు 
వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎప్పట్లాగే త్యాగాల పునాదులపై స్వరాష్ట్ర 
కలను కంటున్న తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్)కు ప్రజల నుంచి ఎనలేని 
ఆదరాభిమానాలు లభిస్తున్నాయి.
 
 ఏడు వందల మంది అమరుల త్యాగాల 
గుర్తులను గుప్పిట్లో పెట్టుకుని గురిచూసి దెబ్బకొ ఓపికతో ప్రజానీకం 
ఎదురుచూస్తోంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా యావత్ టీఆర్‌ఎస్ కేడర్ 
హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. నాగం జనార్దన్ రెడ్డి సహా 
త్యాగధనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ 
అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ దళం 
గెలుపు కోసం తెలంగాణలోని ఆయా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు భారీగా 
నియోజకవర్గాల్లో మకాం వేశారు. పరిస్థితిని ఎప్పకప్పుడు విశ్లేషిస్తూ రాజకీయ
 జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణవాదాన్ని గెలిపించాలని, 
త్యాగధనులకే పట్టం కట్టాలని పిలుపునిస్తున్నారు. బరిలో నిలిచిన పోరు 
బిడ్డలకు యావత్ తెలంగాణ ఉద్యోగ వర్గం అండగా నిలిచి తమ కేడర్‌కు 
దిశానిర్దేశం చేస్తున్నాయి. 
 
 ధూం-ధాంల హోరు
 ధూం-ధాం, 
ఆటా-పాటలతో ఉప ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రత్యేక పంథాతో ముందుకు వెళుతున్నది. 
డిపాజిట్ల కోసమే కాంగ్రెస్, టీడీపీలు పోటీ పోటీపడాల్సి వస్తున్నదని రాజకీయ 
విశ్లేషకులు అంటున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లో 
తెలంగాణవాదం మహోధృతంగా ఉండగా, అడుగడుగునా ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలతో
 కాంగ్రెస్, టీడీపీలు షాక్ తింటున్నాయి. రెండు కళ్ల సిద్ధాంతాన్ని 
పాటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీపీఎం, సీపీఐలు దూరం పెట్టాయి.
 దీంతో బాబు ఒంటరి వాడయ్యారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది మేమే అంటున్న 
కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. గత పదకొండేళ్లుగా తెలంగాణ ఎజెండాను, 
ఉద్యమ బావుటాను ఎత్తుకున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమే ప్రజలు
 నమ్ముతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 
బిడ్డలనే తిరిగి అసెంబ్లీకి పంపేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయాన్ని 
తీసుకున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగ, కార్మిక సంఘాలు, మేధావులు, 
న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా, కుల సంఘాలన్నీ 
ఒక్కటై తెలంగాణవాదులకు అండగా నిలిచారు. 
 
 ఇంటింటి ప్రచారంలో నేతలు.. 
 ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న, కామాడ్డిలో గంప గోవర్ధన్, 
స్టేషన్‌ఘన్‌పూర్‌లో డాక్టర్ తాటికొండ రాజయ్య, కొల్లాపూర్‌లో జూపల్లి 
కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్దన్‌డ్డితోపాటు మహబూబ్‌నగర్‌లో 
సయ్యద్ ఇబ్రహీంలను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా 
ఉన్నారు. సర్వేలు కూడా తెలంగాణవాదానికి, టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ 
దక్కుతుందని తేల్చిచెప్పాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో 
గెలిపించుకోవడమే గాక కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్‌ను గల్లంతు చేసే 
బాధ్యతలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ 
అప్పగించారు. వీరికి ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా,
 యువజన, విద్యార్థి విభాగాలు అండగా నిలిచాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ 
ఎమ్మెల్సీలు కూడా రంగంలో దిగారు. 
 
 మహబూబ్‌నగర్ అసెంబ్లీ 
నియోజకవర్గం ఇన్‌చార్జీలుగా శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే
 సోమారపు సత్యనారాయణ, స్థానిక మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌డ్డి, 
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు 
తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కామాడ్డి 
నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌డ్డి, ఏనుగు 
రవీందర్‌డ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ నారదాసు 
లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కే.విద్యాసాగర్‌రావు, కొల్లాపూర్ నియోజకవర్గానికి
 ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, అధికార ప్రతినిధి గుంతకండ్ల జగదీష్‌డ్డి, 
ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు గడ్డం అరవిందడ్డి, కావేటి సమ్మయ్య, 
నల్లాల ఓదేలు నియమితులైన విషయం తెలిసిందే. వీరు ఆయా నియోజకవర్గాల్లో 
ఇంటింటికి వెళ్లి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, కాంగ్రెస్, టీడీపీల 
మోసాలను వివరిస్తున్నారు. ఈ నెల 5 నుంచి టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి ఉప
 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 
10 నుంచి ఆరు నియోజకవర్గాల్లో సభలను నిర్వహించి ఉప ఎన్నికల ప్రచారాన్ని 
వేడేక్కించనున్నారు.

 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి