కరీంనగర్ పట్టణానికి ఈశాన్య దిశగా 135 కి.మీ., మంథని పట్టణానికి 65 కి.మీ., వరంగల్లు పట్టణానికి 110 కి.మీ. దూరంలో పవిత్ర గోదావరీ నదీ తీరాన స్థితమై ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ గోదావరి నదిలో ఉపనది యైన ప్రాణహిత సంగమిస్తుంది. అక్కడే అంత ర్వాహినిగా సర్వస్వతీ నది కూడా ఉందని భావిస్తారు. ఈ త్రివేణీ సంగమ ప్రదేశానికి దక్షిణంగా గోదావరీ నది ఆర్ధచంద్రాకారంగా ప్రవహించటం వలన ఏర్పడిన కోణములో ఈ ఆలయం వెలసినది. ఇటువంటి వంక లలో ఆలయం ఉండటం శ్రేష్ఠమని అంటారు. అమ రావతిలోని అమర్వేశ్వరాలయం కూడా ఇలాంటి చోట ఉన్నదే. ఈ కాళేశ్వర, ముక్తేశ్వర క్షేత్ర మహిమ అని ర్వచనీయం. స్కాంధ పురాణంలో దీని ప్రశంస కనిపి స్తుంది. ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకారం గ్రంధంలోనూ, కావ్యాలంకార చూడామణి, దశకు మార చరిత్ర మొదలైన గ్రంధాల్లోనూ ఈ క్షేత్ర ప్రాశ స్త్యాన్ని ఉటంకించటం జరిగింది. త్రిలింగ క్షేత్రములలో ఒకటైన ఈ ఆలయపు ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచం లోనే మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం. ఒకటి కాళేశ్వరుడు, మరొకటి ముక్తే శ్వరుడుగా ప్రసిద్ధి. ఇక్కడ ముక్తేశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాల వంటివి ఉన్నాయి. ఎన్ని బిందెల నీళ్లు అభిషేకం చేసినా జలం బయటికి రాక ఈ రంధ్రాల గుండా భూమిలోకి ఇంకి అంతర్వాహినిగా ప్రవహించి సరస్వతి నదిగా గోదావరిలో కలుస్తున్నది. ఇక్కడి మరొక ప్రత్యేకత ఏమిటంటే కాశీలోని విశ్వేశ్వరాలయం వలె, ఖాట్మండులోని పశుపతినాధ్ ఆలయం వలె గర్భాలయానికి నాలుగు ద్వారాలు ఉండటం ఒకే ప్రాకారంలో అనేక ఉప ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడి ఒక ఆలయంలో మహా సరస్వతి, మరొక ఆలయంలో సూర్యనారాయణమూర్తి వేంచేసి ఉన్నారు.
ఈ క్షేత్రంలో శివుడు గౌతమముని అభ్యర్థన మేరకు వేంచేసినాడట. ఈయన సర్వకామప్రధుడు. కాశీ క్షేత్రంలో మరణిస్తే విశ్వేశ్వరుడు ముక్తినిస్తాడు కానీ కాళేశ్వర క్షేత్రంలో ఉన్నా, స్మరించినా, దర్శనం చేసుకున్నా సర్వపాపాలు నశించి ముక్తీరుని కృపవలన ముక్తి కలుగుతుందిట. అంచేత ఈ క్షేత్రానికి ప్రాశస్థ్యం కాశి క్షేత్రం కన్నా 'వరిముల్లు వాసి ఎక్కువ' అని ఇక్కడివారు చెప్తారు. తెలుగుదేశములోని దర్శనీయ స్థలములలో శిల్పకళా సంపదతోను, తీర్థరాజముతోను అఏకానేక ఆలయములతోను, త్రివేణీ సంగమ స్థానంలో విరాజిల్లే ఈ కాళేశ్వర, ముక్తేశ్వర దేవస్థానం చూచి తరించాలి గానీ మాటలకి అందేదికాదు.
కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం
కాళేశ్వర మహాదేవో భుక్తి ముక్తి ప్రదాన్యతి
అన్నపూర్ణ యదాపూర్ణ సదాపూర్ణ వరాంబిక
భుక్తి ముక్తి ప్రదాయన క్షేత్రస్మిన్సంసితే సదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి