తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు
కామారెడ్డి పర్యటనలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తెలంగాణ,విద్యుత్ అంశాలపై
స్థానికుల నుం చి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో
ఆగ్రహం వ్యక్తం చేయడం, కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడం, వాహనాలపై
చెప్పులు, రాళ్లతో దాడి చేయడం తదితర పరిణామాలతో బాబు పర్యటన ఉద్రిక్తంగా
మారింది. మాచారెడ్డి, ఫరీదుపేట్‌ల లో తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య
తోపులాట లు జరిగాయి. చంద్రబాబు జిల్లాలోకి ప్రవేశించిన వెంట నే
భిక్కనూరులోనే తొలి పరాభవం ఎదురైంది.
తమను గెలిపిస్తే తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి విద్యు త్ ఇస్తామని చంద్రబాబు పేర్కొనడంతో రాంరెడ్డి అనే రై తు నిరసన తెలిపారు. తెలుగుదేశం హయాంలో బిల్లులు కట్టలేదన్న సాకుతో కరెంటు డబ్బాలు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారని, ఇప్పుడు కరెంటు గురించి ఎందుకు మాట్లాడుతారని నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు ఆయనను దూరంగా లాక్కెళ్లారు. రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన పెర్క సాయిలు బాబును ఉద్దేశించి ‘నీవు ఆంధ్రాబాబు వే ఎందుకొచ్చావంటూ’ ప్రశ్నించారు. ఆయన్నీ టీడీపీ కార్యకర్తలు నెట్టేశారు.
చంద్రబాబుకు ఫరీదుపేట, మాచారెడ్డి ప్రజ లు చుక్కలు చూపించారు.
తెలంగాణకు అనుకూలమేనంటూ ప్రసంగిస్తుండగానే మహిళలు ఒక్కసారిగా తిట్ల వర్షం కురిపించారు. యువకులు కొందరు చంద్రబాబు ప్రసంగిస్తు న్న చోటుకు దూసుకువెళ్లడానికి యత్నించగా.. పోలీసులు అడ్డుకొన్నారు. ‘తెలంగాణ కోసం నీవు ఏం చేశావు.. తెలంగాణకు అనుకూలమేన ని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వలేని నీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు’ అంటూ తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న చంద్రబాబు ఇలాగే అడ్డుకుం టే తమ కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీని తొక్కేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘పది మంది వచ్చి గొడవపెడుతుంటే ఆపలేరా? ఆ మాత్రం చేతకాదా? మీ మీద ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో వారు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. పోలీసులను నెట్టుకుంటూ యువకులు రోడ్‌షోవైపు దూసుకురావటంతో ఉద్రిక్తత నెలకొంది. యువకులు మూడు నాలు గు చోట్ల బాబు కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వాహనం ముందుకు వెళ్లి నా వారు శాంతించలేదు. మైక్‌సెట్‌లతో ఉన్న వాహనాన్ని అడ్డుకొన్నారు. వెనుకనున్న వాహనాల మీద చెప్పులు, రాళ్లు విసిరారు. ఆంధ్రాబాబుకు సేవ చేస్తున్న ద్రోహులంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కారు అద్దాలు, మరో వాహనం హెడ్‌లైట్లు ధ్వంసమయ్యాయి. గంట పాటు ఉద్రిక్తత నెలకొంది.
మాచారెడ్డి చౌరస్తాలోనూ చంద్రబాబుకు చేదు అనుభవమే ఎదురైంది. మోత్కుపల్లి మాట్లాడుతుండగా తెలంగాణవాదులు బాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు నెట్టి వేసే ప్రయత్నం చేసినా వినకుండా ముందుకు దూసుకురావడానికి యత్నించారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. కోపోద్రిక్తులైన తెలంగాణవాదులు పోలీసులకు, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కామారెడ్డిలో సీఐగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్న సంక్రాంత్రి రవికుమార్ తెలంగాణవాదులను సముదాయించారు. రోడ్‌షో సందర్భంగా మాచారెడ్డి చౌరస్తాలో పోలీసులు అత్యుత్సాహా న్ని ప్రదర్శించారు. రోడ్‌షోను తిలకిస్తున్న యువకులను చొక్కాపట్టుకొని లాక్కెళ్లారు. దీంతో వారు పోలీసులకు, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి