రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ మొండిచెయ్యే! :( మరోసారి అన్యాయమే జరిగింది.      రైల్వే   
                  బడ్జెట్‌లో మొండి చేయి మిగిలింది
    
 =పేరుకు 15 కొత్త రైళ్లు..
 - అధిక శాతం వారానికి ఒకసారే
 - రాష్ట్రం మీదుగా వెళ్లే రైళ్లల్లో మనకు సీట్లు కష్టమే
 - భద్రాచలం- కొవ్వూరు ప్రాజెక్టు ఏళ్ల నాటిది
 - నెరవేరని ఇందిరా గాంధీ హామీ
 - అక్కన్నపేట-మెదక్ వరకే కొత్త లైన్ పరిమితం
 - కరీంనగర్ వరకు వేయిస్తానన్న ఇందిరమ్మ
 - ఆరు రైళ్ల పొడిగింపు కోరితే మూడింటికే అనుమతి
 - రాష్ట్రంలో మొదలై రాష్ట్రంలోనే తిరిగే రైళ్లు కేవలం మూడే
 - ఆరు ఆదర్శ స్టేషన్లు ప్రకటిస్తే.. నాలుగు గుంటూరు జిల్లాకే
 - తెలంగాణకు ఒక్క ఆదర్శ స్టేషన్ లేదు
 - ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదుతెలంగాణకు
 కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. సర్వే పూర్తి చేసుకుని దశాబ్దాలుగా 
ఎదురు చూస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు ఇచ్చిన వాటికి 
నిధుల మంజూరు లేదు. 2012-13 రైల్వే బడ్జెట్‌లో వెచ్చించిన నిధులు కూడా 
అరకొరే. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన 
లేనేలేదు. కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ను ప్రతిపాదించారు. అయితే అది 
ఎప్పుడు పూర్తి అవుతుందో స్పష్టత లేదు. కొత్తగా ఆరు రైళ్లను 
పొడిగించాలంటే.. మూడింటితోనే సరిపెట్టారు. తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఒక్క 
ఆదర్శ స్టేషన్‌ను కేటాయించలేదు. మెదక్ జిల్లా నుంచి ఇందిరాగాంధీ 
ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇచ్చిన హామీకి ఇప్పటివరకు దిక్కు లేదు. 225 
కిలో మీటర్ల లైన్‌ను అక్కన్నపేట-మెదక్ వరకు అనుమతించి చేతులు దులుపుకుంది. 
భద్రాచలం-కొవ్వూరు ప్రాజెక్టును బడ్జెట్‌లో కొత్తగా చూపింది. 
సికింవూదాబాద్-మహబూబ్‌నగర్, కొత్తగూడెం-కొండపల్లి, మనోహరాబాద్-కొత్తపల్లి, 
భద్రాచలం-సత్తుపల్లి లైన్లు సర్వే పూర్తి చేసుకుని మంజూరు కోసం 
చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాయి.
 
 హైదరాబాద్, ): ఊహించిందే 
నిజమైంది. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ అన్యాయమే జరిగింది. నిజాం 
కాలం నాటి స్టేషన్లు, లైన్లు తప్ప కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. 
ప్రతి పనికి ఇందిరాగాంధీ పేరు చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 
చివరికి ఆమె ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేకపోయాయి. మెదక్ జిల్లాలోని 
తెల్లాపూర్ నుంచి పటాన్‌చెరు, సంగాడ్డి, జోగిపేట, మెదక్, అక్కన్నపేట, 
రామాయంపేట, సిద్దిపేట నుంచి కరీంనగర్ వరకు (225 కిమీ) రైల్వే లైను 
వేయిస్తానని 190లో ఇందిర గాంధీ హామీ ఇచ్చారు. అయితే ఈ లైన్‌ను 
అక్కన్నపేట-మెదక్ వరకు మాత్రమే పరిమితం చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. 
కొత్త బడ్జెట్‌లో (2012-13) భద్రాచలం-కొవ్వూరు, అక్కన్నపేట-మెదక్‌లను కొత్త
 ప్రాజెక్టులుగా చూపించింది.
 
 వాస్తవానికి ఈ రెండూ పాత డిమాండ్లే. 
భద్రాచలం-కొవ్వూరు ప్రాజెక్టు కొన్ని దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమై.. 
ఇప్పుడు మంజూరుకు నోచుకుంది. కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశామని రైల్వే శాఖ
 చెబుతుంది.. కానీ నిధుల మంజూరు విషయం తెలియదని రైల్వేవర్గాలు 
సమాధానమిచ్చాయి. రాష్ట్రంలో సికింవూదాబాద్-మహబూబ్‌నగర్, 
కొత్తగూడెం-కొండపల్లి, మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం-సత్తుపల్లి లైన్లు 
సర్వేలు ఎప్పుడో పూర్తి చేసుకుని ప్రాజెక్టు మంజూరు కోసం ఎదురు 
చూస్తున్నాయి. ఆదిలాబాద్-ఆర్మూర్, సికింవూదాబాద్-మంచిర్యాల మార్గాల్లో 
ప్రాజెక్టు మంజూరై నిధులు లేక పనులు మొదలుకాలేదు. వీటి ప్రస్తావన కొత్త 
బడ్జెట్‌లో లేదు. అలాగే నిజామాబాద్-బోధన్ వరకు ఉన్న మీటర్ గేజ్‌ను బ్రాడ్ 
గేజ్ చేసే విషయాన్ని విస్మరించారు. బడ్జెట్‌లో నల్గొండ జిల్లాకు సంబంధించిన
 ఊసే కనిపించలేదు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న పెద్దపల్లి-నిజామాబాద్, 
గద్వాల-రాయచూర్ గురించి పట్టించుకోలేదు. రాష్ట్రం పంపించిన ప్రతిపాదనల్లో 
కేవలం రెండు, మూడింటికే అనుమతులు వచ్చాయి.
 
 అధిక శాతం వారానికి ఒక్కసారే..
 దక్షిణ మధ్య రైల్వే చరివూతలో ఇన్ని కొత్త రైళ్లు ఎప్పుడూ రాష్ట్రానికి 
రాలేదని రైల్వేవర్గాలు సంతోషపడుతున్నాయి. అయితే కొత్తగా ప్రకటించిన 15 
రైళ్లలో రైళ్లు వారానికి ఒక్క రోజే తిరుగుతాయి. మరో మూడు రైళ్లు వారానికి 
మూడు రోజులు, ఒక రైలు రెండు రోజులు మాత్రమే తిరుగుతుంది. వీటివల్ల రాష్ట్ర 
ప్రజలకు కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే. వారానికి ఒక్కసారి తిరిగే రైళ్లలో 
రాష్ట్రంలో ఎక్కువ పట్టణాలు కలిసే వాటికన్నా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ 
శాతం తిరిగే రైళ్లు ఉన్నాయి. షాలిమార్, నాందేడ్, అమృత్‌సర్, దర్బంగా, 
పోరుబందర్ వంటి కొత్త రైళ్లతో రాష్ట్ర ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమిటో 
రైల్వేవర్గాలే చెప్పాలి. మరో 10 కొత్త రైళ్లు రాష్ట్రం మీదుగా వెళతాయని 
ప్రకటించారు. ఎక్కడో బయలుదేరి మరెక్కడికో వెళ్లే రైళ్లలో రాష్ట్ర వాటా చాలా
 తక్కువగా ఉంటుంది. మొత్తం 10 రైళ్లలో విశాఖపట్నం-చెన్నై, విశాఖపట్నం- 
షిర్డీ రైళ్లే కొంతవరకు ఉపయోగం. మిగిలిన రైళ్లలో మనకు లభించే రిజర్వేషన్ 
సీట్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. అలాగే రాష్ట్రం మొత్తం ఆరు రూట్లలో 
రైళ్ల పొడిగింపు కోరగా కేంద్రం మూడింటికి మాత్రమే అనుమతిచ్చింది. అందులో 
రెండు అడిగినవి కాగా, మూడోది మనకు ఉపయోగం లేనిది.
 
 ఒకే ఒక్క ప్యాసింజర్...
 గత ఏడాది బడ్జెట్‌లో రాష్ట్రానికి తొమ్మిది ప్యాసింజర్ రైళ్లు రాగా.. ఈ 
బడ్జెట్‌లో కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ప్రకటించారు. ఆ ఒక్కటి కూడా 
ఎర్రగుంట్ల-నోసమ్ ప్రాంతానికి కేటాయించారు. ఇక ఆదర్శ స్టేషన్ల విషయానికి 
వస్తే.. ప్రకటించిన ఆరు స్టేషన్లలో నాలుగు గుంటూరు జిల్లాకు చెందినవే కావడం
 గమనార్హం. మాచర్చ, పిడుగురాళ్లు, సత్తెనపల్లి, వినుకొండ స్టేషన్లు గుంటూరు
 జిల్లావి. మరో రెండింటిలో జల్నా స్టేషన్ రాష్ట్రానికి చెందినది కాకపోవడం 
విశేషం. ఈసారి బడ్జెట్‌లో వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి న్యాయం 
జరుగుతుందని ఆశించారు. కానీ ప్రజావూపతినిధుల ఒత్తిడి లేని కారణంగా మొండి 
చేయి మాత్రమే మిగిలింది. రైళ్ల రద్దీ అధికంగా ఉండే మౌలాలి నుంచి భువనగిరి 
మార్గాన్ని మూడు లేన్లుగా మార్చాలని అడుగుతున్నా పట్టించుకోలేదు. ఈ 
బడ్జెట్‌లో ఖాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ను ప్రతిపాదించారు. అయితే 
భూసేకరణ సమస్య అధికంగా ఉండే ఈ మార్గంలో మూడో లైన్ ఎప్పుడు పూర్తి అవుతుందో 
రైల్వేవర్గాలకే తెలియదు. ఇక ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్‌లో 
ప్రస్తావనే లేదు. పనులు ఎప్పుడు మొదలుపెడతారు? బడ్జెట్ ఎంత? ఎన్ని నిధులు 
కేటాయించారు అన్న అంశాల ప్రస్తావనే లేదు.

 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి