జెండాలు మోసెటోళ్ళు...జైజైలు కొట్టెటోళ్ళు అక్కడికి రాలే.
 అంతా తెలంగాణ తెగువను ఒడిసి పట్టినోళ్ళే ...
 ఎవ్వడినైనా ప్రశ్నిస్తాం... ఓన్నీ నమ్మం...
 కేకే కావచ్చు..కేసీఆర్ కావచ్చు...
 అక్కడికి చేరుకున్న గుండేలు లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోలే...
... జై తెలంగాణ అని గోంతెత్తి అరిసినయి...
 గుమిగూడిన లక్షల చేతులు మముల్ని ఎక్కిరించినోడి కుత్తుకలను కోస్తామని బెదిరించినయి...
 సర్కారు ఇనుప బూట్లకు సమాధానం చెప్పిన ఆ కాళ్ళు....
 అధిపత్య అహన్ని ముక్కలు చెక్కలు చేసినాయి...
 ప్రతి తొవ్వలో పోలీసులు...గల్లీ గల్లీలో పికెటింగులు...
 హైదారాబాద్ అంతట అనుమానపు సూపులే...
 హైదారాబాద్‌కో పోలీస్‌నే హమ్‌లా కీయా...
 తో క్యా...
 హమ్‌నే మార్చ్ కర్‌కే రహింగే...
 అని జెండాలను పక్కన బెట్టిన తెలంగాణ...
 మా ఏజెండా తెలంగాణ రాష్ట్రమని కదిలింది...
 పోలీసుల పహారాను, కేంద్ర రాష‌్ట్రాల డేగ కన్నుల్లో కారం జల్లీ...
 మిలియన్ మార్చి చౌరస్తాకు చేరుకుంది...
 నాయకత్వం లేని సమూహం ఎట్లా ఉంటుందో చూపెట్టింది...
 అరువై యెండ్ల తన్లాటకు...
 ట్యాంక్‌బండ్ పైనే సమాదానం దొరుకుతుందని వెతుకులాడింది...
 మా ఆట,పాట, మాటలను ఆగం చేయలన్న కుట్రలను కూలగోట్టింది...
 డప్పు,చిర్రా...చిటిక,గొంగడి,గజ
 బ్యానరు..ఫ్లెక్సి,తాడు గడ్డపార,మట్టిపెల్లా,గడ్డిపోస,.
 పోలీసులా బారికేడ్,నీళ్ళు తోడె పైపులు...
 ఎండిన ఆకులు..రాలిన పూలు,ఆఖరికి...
 కాలికిందా దుమ్ము అన్ని తెలంగాణ కోసమే ...ఈ కొట్లాట...
 మిలియన్ మార్చ్‌లో భాగమే...
 మార్చ్‌కు చేరుకున్నోళ్ళ అనుభవలు వింటుంటే...
 గిట్లా గూడా పట్నం రావచ్చా అనిపించింది...
 రైల్లో పయిఖానాలో పండుకోని వచ్చినోళ్ళు కోందరైతే...
 పిల్లలకు పరిక్షలున్నాని వచ్చినోళ్ళు ఇంకోందరు...
 అంబులెన్సులో పడుకోని వచ్చినోళ్లు మరికోందరు...
 పెళ్ళి డ్రామా ఆడి పోలీసోళ్ళకు జెట్క ఇచ్చినోళ్ళు ...
 ముడురోజుల ముందే సుట్టాల ఇండ్లకు చేరుకున్నోళ్ళు...
 ఇలా చెప్పుకుంటుూ పోతే ఒక్కోక్కరిది ఒక్కో తోవ...
 ఆ రోజు ట్యాంక్‌బండ్‌కు చేరుకునోళ్ళంత ఖలేజా ఉన్నోళ్ళే...
 చరిత్ర నిర్మాతలే...
 మట్టివాసనను మరిచిపోనోళ్ళే...
 తల్లిపాల రుణం తీర్చుకుంటామని ఒట్టు తిన్నోళ్ళే...
 దంచుడే తెలంగాణకు మార్గమని చాటింపేస్తున్నోళ్ళే..
 
చాలా బాగా రాసారు.
రిప్లయితొలగించండిఆధిపత్యపు దిష్టి బొమ్మలు అరచి గోల చేసే వాళ్ళు
నీతి జాతి లేని రాజకీయ గోముఖ వ్యాఘ్రాల
కుతంత్రాలను , కపటత్వాన్ని చూసి తట్టుకోలేక వందలాది తెలంగాణా యువతీ యువకులు
ఆత్మహత్యకు పాల్పడితే నోళ్లకు తాళాలు వేసుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ సిగ్గూ ఎగ్గూ లేకుండా అదే కుట్రలు కుతంత్రాలకు తేరా తీస్తున్నారు.
ఒకడు " నేను తెలంగాణాకు అడ్డమూ కాదు నిలువూ కాదు" అంటూ తేనే పూసిన కత్తిలా మాట్లాడి
పాపం పండి చచ్చాడు.
ఇప్పుడు ఇంకొకడు చావు తప్పి రెండు కళ్ళలో ఒక కన్ను లోట్టపోయి బట్టేబాజి బతుకు బతుకుతున్న నాయకుడు " నేను తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడే లేదు మాట్లాడ బోను." అంతో బట్టేబాజి మాటలు మాట్లాడుతున్నాడు.
తెలంగాణా బిడ్డలారా బహు పరాక్.
బహు పరాక్