20, ఫిబ్రవరి 2012, సోమవారం

యోధులు వీరే

-ఉప పోరులో టీఆర్‌ఎస్ శంఖారావం
- తెలంగాణ కోసం రాజీనామా చేసినవారే అభ్యర్థులు
- కాంగ్రెస్, టీడీపీలను పాతరేయాలి
- త్యాగధనులను భారీ మెజారిటీతో గెలిపించాలి
- కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కనీయొద్దు
- ఆ రెండు పార్టీలకు కనువిప్పు కలగాలి
- టీఆర్‌ఎస్ నేతలు నాయిని, ఈటెల, జగదీష్‌డ్డి, జితేందర్‌డ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (టీ న్యూస్): ఉప ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్ర సమితి సమర శంఖం పూరించింది. ముందుగా మాటిచ్చినట్టుగానే తెలంగాణ సాధన కోసం పదవులకు రాజీనామా చేసినవారినే టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు తెలిపింది. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఉప ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ నాయిని నర్సింహాడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా, ఉప ఎన్నికల్లో త్యాగధనులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయినితోపాటు, కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్, గుంతకండ్ల జగదీష్‌డ్డి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌డ్డి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్, టీడీపీలను ఉప ఎన్నికల్లో పాతరేయాలని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కనీయొద్దని వారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు కనువిప్పు కావాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీ, కాంగ్రెస్‌లకు గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి తమ పార్టీలో చేరిన జోగు రామన్న, గంప గోవర్ధన్, జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టీ రాజయ్యలను టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నట్లుగా వారు తెలిపారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన సయ్యద్ ఇబ్రహీంనే మళ్లీ అభ్యర్థిగా ప్రకటించామన్నారు. తెలంగాణ కోసం టీడీపీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా నాగర్‌కర్నూల్ స్థానంలో పోటీకి దిగిన నాగం జనార్దన్‌డ్డికి టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతును ఇస్తుందని వారు ప్రకటించారు.

తెలంగాణ బిడ్డలైన టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఈ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం కళ్లు బైర్లు కమ్మాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టకుంటే తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతుందని వారు హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెంపపెట్టులా తీర్పునివ్వాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ టీ ఫోరం నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి సీమాంధ్ర నాయకుడు చంద్రబాబుకు జపం చేయడం మానుకొని తెలంగాణ కోసం పోరాడాలని వారు సూచించారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నదన్న విషయం తమకు తెలియదని వారు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్‌లో అనేక పదవులు వచ్చే అవకాశం ఉన్నా, మంత్రి పదవి ఉన్నా వాటిని త్యజించి కాంగ్రెస్ ప్రజావూపతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్, టీడీపీలకు ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్లు దక్కనీయొద్దని వారు కోరారు.

ఇటీవల ఏర్పడిన టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ శాశ్వతంగా ఉంటుందన్నారు. ఈ కమిటీలో అన్ని కోణాల్లో సమీక్ష జరిపి తయారుచేసిన నివేదికను తమ అధినేత కేసీఆర్‌కు సమర్పించామని, ఆయన ఆమోదం తరువాతనే అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటిస్తున్నట్లుగా నాయిని, ఈటెల, జగదీష్‌డ్డి, జితేందర్‌డ్డిలు పేర్కొన్నారు. ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయాన్ని పాటించామని వారు తెలిపారు.

1 కామెంట్‌:

  1. ఎన్నికలు అనేవి రాజ్యాంగవిధానాలుగా కాక చివరికి రాజకీయతమాషాలుగా మారిపోవటం శోచనీయం.

    మన ఎన్నికల విధానాన్ని సంస్కరించవలసి అవసరం చాలా ఉందనిపిస్తోంది.

    ఒకసారి ఎన్నికలలో పోటీచేసి చిత్తుగా ఓడిపోయిన(ధరావత్తుకోల్పోయిన) వారికి తరువాత 8 యేళ్జో 10యేళ్ళో యేవిధమైన యెన్నికలలోనూ పోటీ చేయనివ్వరాదు.

    ఒకపార్టీ టిక్కట్టుపై గెలిచినవారు ఆ పార్టీనుండి యేకారణం వల్లనైనా తప్పుకున్నా, తప్పించబడినా తరువాత 3సంవత్సరముల వరకు యేవిధమైన యెన్నికలలోనూ పోటీ చేయనివ్వరాదు.

    చట్టసభనుండి తప్పుకున్న, తప్పించబడిన వ్యక్తులను కూడా తరువాత 3సంవత్సరముల వరకు యేవిధమైన యెన్నికలలోనూ పోటీ చేయనివ్వరాదు.

    ఇలాంటి నిబంధనలు లేకపోవటం వలనే రాజీనామా డ్రామాలు, యెలక్షన్ ప్రహసనాలూనూ.

    రిప్లయితొలగించండి