16, ఫిబ్రవరి 2012, గురువారం

సీమాంధ్ర వైద్యుల దందా

-సీమాంధ్ర వైద్యుల దందా
అంగట్లో శవాలు..!
-రాజధానిలో శవాల మాఫియా
‘ఫలానా చోట గుర్తుతెలియని మృతదేహం..’’, ‘‘రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి శవం..’’... ఇలాంటి వార్తలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. దిక్కూమొక్కూ లేకుండా ఉన్న ఇలాంటి శవాలు ఆస్పవూతుల్లోని మార్చురీల్లో వేలకొద్ది మగ్గుతుంటాయి. ఈ శవాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఉస్మానియా మార్చురీలోని సీమాంధ్ర వైద్యులు..! సాధారణంగా వైద్యులు.. మార్చురీలో ఏడాది, లేదంటే రెండేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కానీ, ఉస్మానియాలో మాత్రం ఏళ్లతరబడిగా కొనసాగుతూనే ఉంటారు. వీరిలో కొందరు మాఫియాగా ఏర్పడి గుట్టుచప్పుడు కాకుండా శవాలను అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైద్య కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిమిత్తం శవాలు అవసరమవుతుంటాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలతో పాటు ఢిల్లీ, చెన్నై, కేరళ నుంచి కూడా ఉస్మానియా మార్చురీకి శవాల కోసం వస్తుంటారు. డిమాండ్‌ను వరంగా మార్చుకున్న కొందరు వైద్యులు ఒక్కో శవాన్ని రూ. 2లక్షల నుంచి 3 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మృతుల తాలూకు బంధువులు వచ్చే వరకు కూడా శవాలను ఉంచడం లేదు. గతంలో ఇక్కడ మున్సిపల్ ఉద్యోగి శవం మాయమైన ఘటన అసెంబ్లీనీ కుదిపేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి