ఇంతకీ తెలుగు ఎవరిది?
 
 ‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది 
తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాషను 
తెలుగు భాషే కాదంటున్నారు కోస్తాంధ్ర వాళ్లు. వాళ్లదే దండి భాష అంటూ, 
తెలంగాణ మాండలికాన్ని అవహేళన చేస్త్తున్నా రు. నిజానికి తెలుగు ఎక్కడ 
పుట్టిందో తేలాలంటే మొట్టమొదట రాజ్యస్థాపన ఎక్కడ జరిగిందో తేలాలి. 
భారతదేశంలోకి ఆర్యుల రాక తర్వాత క్రీ.పూ.6 వ శతాబ్దం నాటికి ఏర్పడ్డ షోడష 
మహా జనపదాల్లో ‘అశ్మక’ ఒకటి. ఇది నేటి నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ 
జిల్లాల ప్రాంతం. దీని రాజధాని పోతలి(నేటి బోధన్). క్రీ.పూ.5వ శతాబ్దం 
నాటికి ఆంధ్ర గోపులు, కరీంనగర్ జిల్లా కోటిలింగాల రాజధానిగా రాజ్య స్థాపన 
చేశారనీ, క్రీ.పూ.2వ శతాబ్దం నాటికి ఇది శాతవాహనుల వశమైందని శాస్త్రీయంగా 
రుజువైంది. దీంతో ఆయా కా లాల్లో ఆంధ్రావూపాంతం కంటే ముందే తెలంగాణలో 
భాషావికాసం జరిగి ఉం డాలి. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో
 లభ్యమైన శాతవాహనుల పూర్వీకుల నాణేలపై ప్రాకృత బ్రాహ్మీలిపిలో ‘రాణో గోభద’,
 ‘రాణో నారన’.. అంటూ చెక్కిన పేర్లు నేటి తెలుగుకు దగ్గరగా ఉన్నాయి. ఇదే 
జిల్లాలోని పెద్దబొంకూర్(శాతవాహనుల పట్టణం) తవ్వకాల్లో లభ్యమైన టెర్రకొట్ట 
ముద్రికపై క్రీ.పూ.2వ శతాబ్ది నాటి బ్రాహ్మీలిపి లక్షణాలతో ‘విజయ పురహర కస 
రథస’ అని చెక్కి ఉంది. ధూళికట్ట తవ్వకాల్లో లభించిన ఓ ముద్రికపై ‘అజని 
సిరియ గామె కుమరియ’నకీ.పూ.2వ శతాబ్దం), ఇక్కడి బౌద్ధ స్తూపానికి అతికిన 
‘నాగముచిలింద’ పలకంపై ‘గహపతినో పఠాలస మతూయదానమ్’ అని చెక్కి ఉంది. ఓ గహపతి 
దీనిని స్తూప నిర్మాణానికి దానం ఇచ్చాడని అర్థమవుతోంది. ఇవన్నీ మన ఇప్పటి 
తెలుగుకు చాలా దగ్గరగా ఉన్నాయి. క్రీ.శ. 930-955 మధ్య కాలంలో వేములవాడ 
రాజధానిగా ‘సపాదలక్ష’ నేలిన రెండవ అరికేసరి ఆస్థాన కవి, పంపడి తమ్ముడు 
జినవల్లభుడు, కరీంనగర్ జిల్లా గంగాధర, కురిక్యాల గ్రామాల మధ్య ఉన్న 
బొమ్మలగుట్టపై వేయించిన శాసనంలో తొలి తెలుగు కంద పద్యాలున్నాయి. ఇక్కడ 
పుట్టి, పెరిగిన వందలాది కవులు, రచయితలు సుమారు వెయ్యేళ్లుగా సాహిత్య సృజన 
చేస్తున్నా రు.
 
 ఇలా తొలి రాజ్యాల నిర్మాణం, తెలుగు భాష, సాహిత్య 
వికాసం గోదావరి, కృష్ణా నదుల మధ్య(నేటి తెలంగాణలో)జరిగింది. అలాంటప్పుడు 
తెలంగాణ భాష అసలైన తెలుగు కాకుండా ఎలా ఉంటుంది? ఇదిలా ఉంటే.. సీమాంవూధులకు 
తెలంగాణ ‘క్రియా పదాలను’ వెక్కిరించడం పరిపాటిగా మా రింది. వాక్యాల చివర 
‘వచ్చిండు’, ‘వచ్చిన్రు’ అనే పదాలు రాగానే కిసుక్కున నవ్వుతున్నారు. వాళ్లు
 ‘వచ్చాడు’, ‘వచ్చారు’ అని వాడుతున్నారు. నిజానికి ఈ పదాలకు మాతృక 
‘వచ్చి+ఉన్న+వాడు’ అనే పదం. ఇది క్రమంగా వచ్చిఉన్నడు.. ‘వచ్చి ఉన్నవాడు’.. 
‘వచ్చిఉండు’(మహబూబ్‌నగర్ జిల్లా వాళ్లు ఇప్పటికీ ఈ పదమే వాడుతున్నారు.).. 
‘వచ్చిండు’గా పరిణామం చెందింది. అంటే సంక్లిష్టం నుంచి సరళంగా మారింది. ఇది
 ఇంకా మారి ‘అచ్చిండు’ అ య్యింది. నిజానికి పరిణామ క్రమంలో ఇది సహజం. 
బహువచనానికి వచ్చే సరికి, వచ్చి ఉన్న వారు.. వచ్చిఉన్నరు.. 
వచ్చివూను(వచ్చిండ్రు) అయ్యింది. ఇలాగే చేసిండు, చూసిండు, తిన్నరు, 
పోయిన్రు..ఇలా. కానీ కోస్తా భాషకు వచ్చే సరికి ‘చ్చి’ ‘చ్చా’ అయ్యి, 
‘వచ్చాడు’ వచ్చింది, ఇది ఏ సంధి సూత్రం ప్రకారం, ఎలా వచ్చిందో అర్థం కాదు. 
కానీ ఆడవారి విషయంలో మాత్రం, తెలంగాణలో వాడే ‘వచ్చింది’నే వాళ్లూ 
వాడుతున్నారు. ‘వచ్చీంది’ అని అనా లి కదా! అనడం లేదు. అలాగే ఆంధ్రుల 
‘చూచుట‘, ‘చేయుట’ల ను ఇక్కడ ‘చూసుడు‘, ‘చేసుడు’ అంటారు. ఇది సంక్లిష్టం 
నుంచి సరళమే!
 
 ఈ పదాలను చూడండి..!
 రోడ్లు+ వెంట= రోడ్లెంట(తెలంగాణ), రోడ్లమ్మట(కోస్తా)
 ఇటు+ఇల= ఇటుల = ఇట్ల(తెలంగాణ), ఇట్టా(కోస్తా), ఇలాగే ‘అట్టా’, ‘ఎట్టా’ వగైరా.. వీటిలో ఏ పదాల ఉత్పత్తి సరైందో వేరే చెప్పాలా!
 దున్న+పోతు=దున్నపోతు.
 
 ఇక్కడ ‘పోతు’ అన్నది ‘మొగ’ను సూచిస్తున్నది. దీనిని కోస్తాలో యథావిథిగా 
వాడుతున్నారు. ఇందులో సమస్య లేదు. కానీ కోల్లాగె(కోడె+లాగె) (తెలంగాణ)ను 
ఆంబోతు(ఆవు+పోతు) అంటున్నారు. ఇక్కడ ఆవు, పోతు(మొగది) ఎట్లా అవుతుంది? అంటే
 సమాధానం లేదు. ‘పిట్ట’ అంటే తెలంగాణలో పక్షి. కానీ కోస్తా వారికి కాదు. 
కానీ ‘పాలపిట్ట’ అంటున్నారు. ‘గేదె’ను ‘బర్రె’ కాదంటూనే ఆంగ్ల ‘యార్క్’ను 
‘జడల బర్రె’ అంటున్నారు. తెలంగాణ ‘చుక్క’ను నక్షవూతంగా ఒప్పుకోరు. కానీ 
‘వేగుచుక్క’ అంటారు. ‘రైక’ను ‘రవిక’ అంటూనే ‘కోకారైకా తాకేచోట’ అంటూ సరస 
సల్లాపాల్లో మునిగి తేలుతున్నారు.(నిజానికి రవిక అభివృద్ధి చెందితే 
వచ్చిందే రైక. ఇలాగే ధోవతి నుంచి ధోతి, కొడవలి నుంచి కొడలి.. తెలంగాణలో 
ఇలాంటి పదాలు ఎన్నో..! తెలంగాణ పదాలు, తెలుగులో మొట్టమొదటి పదాలు. అందుకే 
ఎంత వద్దనుకున్నా ఇలాంటి వేలాది పదాలు కోస్తా, రాయలసీమల్లోని ప్రాంతాల్లోనూ
 సజీవంగా ఉన్నాయి. ఈ విషయం సీమాంధ్ర మేధావులకు తెలుసు. కానీ నేరుగా వాడరు. 
ప్రాస కావాల్సి వచ్చినప్పుడో, ఇతరత్రా తప్పనిసరి పరిస్థితుల్లోనో పక్కన 
పెట్టేసిన తెలంగాణ పదాలనే వాడేస్తుంటారు. పైన చెప్పిన ‘పాలపిట్ట..’ లాంటి 
ఉదాహరణల్లో జరిగిందదే!
 
 ఏ భాష అయినా మొదట కొద్ది పదాలతోనే 
పుడుతుంది. ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా కొత్త పదాలను కలుపుకుంటూ 
విస్తరిస్తుంది.వికాసం పొందుతుంది. సహజంగా గ్రామీణుల భాష వారు చేసే పనులు, 
ఉపయోగించే పరికరాలు, వస్తువులకే పరిమితమవుతుంది. చుట్టు పక్కల ప్రాంతాల 
వారి సంపర్కం వల్ల దినదినాభివృద్ధి చెందుతుంది. ముస్లింలు, ఆంగ్లేయుల 
పరిపాలన కాలంలో తెలుగునాట చోటుచేసుకున్న (భాషాకాలుష్యం) భాషా వికాసం సంగతి 
తెలిసిందే! ముస్లింల పాలనలో ఉన్న తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు, ఆంగ్లేయుల 
పాలనలోని కోస్తా, రాయలసీమ వాసులు మాట్లా డే తెలుగులో ‘ఆంగ’్ల పదాలు దొర్లడం
 సహజం. ఈ విషయాన్ని అర్థం చేసుకునే పెద్ద మనసు కోస్తావాసులకు లేకే 
పరిస్థితి ఇంత దూరం వచ్చిం ది.ఆధిపత్యం నుంచి అవహేలన పుట్టింది. ఎవరేమన్నా 
ఇది చారివూతక సత్యం.
 
 -చిల్ల మల్లేశం
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి