మా బాష గిట్లనే ఉంటది
 మా యాస గిట్లనే ఉంటది
 మా బాషలో నే యాస ఉంటది
 మా యాసలోనే తెలంగాణా బతుకుంటది
 
 మొఖం మిద గొట్టినట్లు మట్లడుడే మకేరుక
 మిలేక్క తింపి తింపి మాట్లాడుడు
 తియ్యంగ మాట్లడుడు మకేరుకలే
 ఏందిరా అని గద్ధరించుడే మాకు తెలుసు
 యా..మండే అని అడుక్కునుడు మాకు తెలువది
 ఏమన్నంటే
 మా రాత లో వ్యావహారికం లేదంటారు
 మీ రాతలో వ్యవహారమే లేదు
 మా యాసలో యాకరణమే లేదంటారు
 మీకు యాకారణం తప్ప యసేలేదు
 మా బాషలో సభ్యత లేదంటారు
 మీ బ్రతుకులోనే సభ్యత లేదు
 మీ బ్రతుకులోన సభ్యతఉంటె
 మా బాషలోని సభ్యత మీకు తెలిసేది
 
 ఇంకేమాన్నంటే అర్థం కాదంటారు
 మీరు రాత్తే అర్ధమైద్ద
 మేము రాత్తే అర్ధంగాధ
 మా మహానుబావుడు కాళోజి గారన్నట్లు
 అర్థం కాకపోతే నువ్వు తెలుగోడివాన్నకాకపోవల్లె
 లేకపోతే బద్మాష్ గాడివన్న గావాల్లె
 గంతేగాని బాష తేలిసినోడివి ఐతే గావు
 మేము లొల్లి పెడుతన్నం అంటే తప్ప
 మీరు గొడవ చేస్తున్నరేటండి అంటే ఒప్ప
 మేము తక్కినోళ్ళు అంటే తప్ప
 మీరు మిగితవారండే అంటే ఒప్ప
 మేమె ఉరుకుడు అంటే తప్ప
 మీరు పరుగు అంటే ఒప్ప
 గిట్ల ఎన్ని ఉదాహరణలు జెప్పిన తక్కువే
 
 మీ రెండు , మూడు జిల్లలా మాండలికాన్ని
 23 జిల్లాల తెలుగు బాష ఫై రుద్దేందుకు
 తపాసి మొఖం రాతలు రాసుకుంట
 తమాషా ముచట్లు అన్ని జెప్పవాడితిరి
 మొన్నటిదాక తెలంగాణాలోన కవులే లేరంటిరి
 గిప్పుడెమో తెలంగానోల్లది బషేగాదనవడితిరి
 మిమ్ముల్ని గిట్లనే ఇడిసిపెడితే
 రేపు తెలంగానోల్లు మనుషులే గదంటారు
 గందుకే జెప్పుతున్నాం జరంత ఇనుండ్రి బిడ్డ
 కవులే లేరన్నప్పుడు మీ కండ్లకు
 కాళోజి , దాశరధి లు కనిపించలేద
 బాషె రాదన్నప్పుడు మీకు
 బహుబశావేతలు(P.V.) జ్ఞానపిట్ గ్రహీతలు(సినారే)లు
 జ్ఞాపకం రాలేదా లేక ఘర్రాలు పెరిగినాయా
 ఇప్పటినుంచి జరంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయిండ్రి
 నాలికే అదుపుల పెట్టుకొని మాట్లాడున్డ్రి
 గంతేగాని
 పాల్తూ ముచ్చట్లు చెప్పుతే
 పంచేలుడే దాక ఉరికిన్చుకుంట కొడుతం
 రేవులేని రాతలు రాస్తే
 రేవుకచ్చే దాక దంచుతం
 
 మల్లిజేప్పుతున్న ఇనుండ్రి
 మా తెలంగానోల్లం
 గిట్లనే రస్థం
 గిట్లనే మాట్లాడుతం
 ఎందుకంటే
 మా బాష వేరే
 మా యాస వేరే
 మా బ్రతుకు వేరే
 గందుకే ఇక గావాల్లె
 మీరు మేమె వేరు .
 
 జై తెలంగాణ జై జై తెలంగాణ
 
excellent this is all telangana people voice
రిప్లయితొలగించండి