అమరుడి ఫొటో...................
 
 బతుకుదెరువు కోసం అందరి ఫొటోలు తీసే ఈ యువకుడు తెలంగాణ కోసం తన ఫొటో ఉపయోగ పడాలనుకున్నడు. అదే అతని చివరి ఫొటో కావాలనుకున్నడు.
 ‘అన్నా! రేపు ఓ సంచలన వార్త ఇస్తా. మొదటి పేజీలో వేసే ఫొటో ఇస్తా. తెలంగాణ
 కోసం నా ఫొటో ఉపయోగపడ్తుంది...’’అని చెప్పిన మురళీమోహన్ మనల్ని వీడి 
పోయిండు. నిజంగా ఫొటోలోనే ఒదిగిపోయిండు.
 
 మురళీ మోహన్‌ది మెదక్ 
జిల్లా దుబ్బాక మండల కేంద్రం. తల్లిదంవూడులు చింతకింది లక్ష్మి, మల్లయ్యలు.
 వీరికి ఐదుగురు సంతానం. నాల్గవవాడే మన మురళీమోహన్.
 వీరిది పేద కుటుంబం
 కావడంతో బతుకుదెరువు కోసం తలా ఒక పని చేసుకుని జీవిస్తున్నరు. ఇక ఇతడేమో 
దుబ్బాక పట్టణంలోని శ్రీ ఫొటో స్టూడియోలో ఫొటోక్షిగాఫర్‌గా పని చేసేటోడు. 
ఫొటోలు, వీడియోలు తీస్తూ కుటుంబ పోషణకు తన వంతుగా కృషి చేసేటోడు. ఓపెన్ 
యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివి తెలంగాణ వస్తే సర్కార్
 నౌకర్ పొందాలని కలలు కనేటోడు.
 తనకు ఫొటోక్షిగఫి అంటే చాలా ఇష్టం. 
అందుకే దుబ్బాక బస్టాండ్‌కు దగ్గరలో ఉన్న శ్రీ ఫొటో స్టూడియోలో 
కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏరియాలోనే అనేక ఉద్యమ కార్యక్షికమాలు 
జరిగేవి. దాంతో మురళీమెహన్ కూడా అక్కడ జరిగే ప్రతీ కార్యక్షికమంలోనూ 
పాల్గొనేటోడు. దుబ్బాక టీఆర్‌ఎస్8 నాయకుడు రామలింగాడ్డితో పాటు, మిగతా 
తెలంగాణవాదులతో దిగిన ఫొటోలను ఇంట్లో పెట్టుకుని సంతోషించేటోడు. తన ఫొటో 
స్టూడియోకు వచ్చే వారితో మాట్లాడుతూ ‘తెలంగాణ తొందరగా వస్తే బాగుండు’ 
అనేటోడు.
 
 అంతేకాదు, తెలంగాణ కోసం ‘ఎంతటి త్యాగానికైనా సిద్ధం’ అని గూడా చెప్పేటోడు.
 మురళీమోహన్ 2009లో పెళ్లి చేసుకున్నడు. పెళ్లైన కొన్ని రోజులకే మలిదశ 
ఉద్యమం తీవ్రమైంది. తాను ఉద్యమంలో మరింత క్రియాశీలంగా పాల్గొనడం మొదలు 
కేసీఆర్ ఆమరణదీక్ష చేసే సిద్దిపేట దీక్షాస్థలికి సైతం వెళ్లిండు. 
ఫొటోక్షిగాఫర్‌గా, వీడియో గ్రాఫర్‌గా మురళీమోహన్ పత్రికా విలేకర్లకు 
సుపరిచితుడే. కావాల్సిన ఫొటోలు తానే తీసి ఇచ్చేటోడు. తాను కేవలం 
ఫొటోక్షిగాఫర్‌గా మాత్రమే భావించేటోడు కాదు, ఒక చురుకైన కార్యకర్తగానూ తన 
పనిని కూడా మలుచుకున్నడు. ఉద్యమంలో పాల్గొని లాఠీదెబ్బలు తిన్న వారిని 
చిత్రీకరించే క్రమంలో తెలంగాణ భూమి పుత్రుడిగా చలించిపోయేటోడు. ఆయా 
దృశ్యాలను చిత్రించేటప్పుడు ఒక్కసారిగా గుండెల్లో గునపాలు గుచ్చుకున్నట్లు 
అయ్యేదని దోస్తులతో అనేటోడు.
 ‘అసలు ఎందుకిట్లా తెలంగాణ ఇయ్యకుండా 
హింసిస్తున్నరని’ పదే పదే ఆలోచించేటోడు. సీమాంధ్ర పాలకులు చేప్పే మాటలను 
కాంగ్రెస్8 అధిష్టానం వింటూ ఉండటం ఒక ముఖ్య కారణం అని తనకు అర్థమైంది. 
అట్లే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కూడా మరో కారణం అనుకున్నడు.
 
 ఇగ ఇట్లయితే తెలంగాణ రాదని మనస్థాపం చెందిండు. పరిస్థితులన్నీ చూస్తూ 
ఒకింత నిరాశకు లోనైండు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాలనే తలిచిండు. ఆఖరికి
 ఉద్యమానికి ఊపిరి నందించాలంటే ఓ సమిధగా మారిపోవాలన్న కఠిన నిర్ణయానికే 
వచ్చిండు.
 అది 2010 జనవరి 31. రాత్రి 10 గంటలయ్యింది. ఓ కాయిన్ బాక్స్ 
నుంచి విలేకరులకు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే ై‘జె తెలంగాణ’ నినాదం 
వినిపించింది. ‘అన్నా! మీకు రేపు పెద్ద న్యూస్8 ఉంటుంది. నా ఫొటో పెద్దగా 
రావాలి’ అంటూ ఉద్వేగంగా మురళి గొంతు వినిపించింది. ‘అదేమిటి?’ అని 
అంటుండగానే ఫోన్ కట్టయ్యింది. తీరా రాత్రి 12 గంటల ప్రాంతంలో దుబ్బాకలో 
నిర్మాణంలో ఉన్న వెంక ఆలయం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి మురళీ మోహన్ 
ఆత్మహత్య చేసుకున్నడు. ఇతడి అరచేతిలో ఉన్న కాగితంపై ‘తెలంగాణ కోసం’ అని 
రాసి ఉంది.
 
 ఇంకింత బాధపడే విషయం ఏమిటంటే మురళీమోహన్‌కు పెళ్లయి 
అప్పటికి ఆరునెలలే అయింది. బంగారు భవిష్యత్తు ఉన్న ఈ యువకుడు తన బలిదానంతో 
ఇటు భార్యను అటు తల్లిదంవూడులను అనాధలను చేసిండు. ఇంతటి నిరాశామయ 
పరిస్థితులను చూస్తూ ఉండలేక తెలంగాణ తల్లి ఒడిలోకి ఒరిగి శాశ్వతంగా 
విశ్రాంతి తీసుకున్నడు.
 మురళి గురించి అతని తల్లిదంవూడులను అడిగితే 
వారు విచారంతో ఇట్ల చెప్పిండ్రు: ‘మాకు ఆసరాగా ఉంటడనుకున్న చిన్న కొడుకు 
తెలంగాణ కోసం సచ్చిపోయిండు. వాడి త్యాగం వేస్టు కావద్దు. ఎప్పుడు కూడా వాడు
 తెలంగాణ కోసమే ఆలోచించేటోడు. మమ్మల్ని ఇడిసి పోయింది గూడా తెలంగాణ కోసమే. 
గందుకే తెలంగాణ తప్పక రావాలే. మా చిన్నోడి లెక్క ఇంకెవలూ సచ్చిపోవద్దు. 
బతికుండి తెలంగాణ కోసం కొట్లాడాలె’ అని తెలంగాణ బిడ్డలందరికీ వాళ్లు 
విజ్ఞప్తి చేస్తున్నరు.
 మరి వాళ్ల మాటల్ని అందరం విందాం. తెలంగాణను సాధించుకుందాం.
 నమస్తే తెలంగాణ.

 

 
 
బతికే కొట్లాడాలే, మనం బతికి తెలంగాణాను బతికించుకోవాలే. తెలంగాణా కోసం ఇదే ఆఖరి బలిదానం కావాలె.
రిప్లయితొలగించండి