18, జనవరి 2012, బుధవారం

ప్రత్యేక రాష్ట్రమే ‘పోరు యాత్ర’ నినాదం

- ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకం కాదు
- నాడు చంద్రబాబు అడ్డంకిగా మారారు
- అందుకే తెలంగాణను ఇవ్వలేకపోయాం
- సోనియా, ఒవైసీ అడ్డుపడ్డా పోరు ఆగదు
- కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి
- బాబు ‘కరువు యాత్రే’ నిదర్శనం
- జై ఆంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
- మీట్ ది ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి

DSC_4778-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 17 (టీ న్యూస్): పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తోనే ఈ నెల 19 నుంచి ‘తెలంగాణ పోరుయావూత’కు శ్రీకారం చుడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి స్పష్టం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ‘పోరుయాత్ర’ మరో ఉద్యమమని అభివర్ణించారు. మంగళవారం ఆయన ‘తెలంగాణ ఎలక్షిక్టానిక్ జర్నలిస్టుల అసోసియేషన్’ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. సకల జనుల సమ్మె ముగిసిన తర్వాత ఇక తెలంగాణ రాదేమోనన్న అనుమానంతో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడానికే ఈ యాత్ర చేపడుతున్నామని తెలిపారు. ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్ర’ అంటూ తాము ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న ఈ ఉద్యమం ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రవూపదేశ్‌ను భౌగోళికంగా.. రెండుగా విభజించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

సకల జనుల సమ్మె విరమణ సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కి, వారిని వేధిస్తోందని ఆయన ఆరోపించారు. టీడీపీ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని పోలీసు దిగ్బంధంలో పెట్టిందని మండిపడ్డారు. దానికి నిదర్శనమే చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో చేసిన ‘కరువు యాత్ర’ అని పేర్కొన్నారు. ఏ విషయంలోనూ కలవని పార్టీలు పోలీసు బలగాలతో, రాజకీయ కుట్రతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు మాత్రం కలిసిపోయాయని కిషన్‌డ్డి ఆరోపించారు. కక్షగట్టి చరివూతాత్మకమైన ‘సకల జనుల సమ్మె’ను తక్కువగా చేసి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ, అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ సహా ఎవరడ్డుకున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేవరకూ ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికైనా.. టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రాంతాల వారీగా పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం ఆ రెండు పార్టీల నాయకులకు తగదన్నారు. ఎన్డీయే హయాంలో పార్టీ కోరిక మేరకు తెలంగాణ ఇస్తామని అనుకున్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డంకిగా మారారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న ప్లోరైడ్, సాగునీరు, తాగునీరు, చేనేత, బీడీ, మత్స, సింగరేణి కార్మికుల సమస్యలు, రైతు ఆత్మహత్యలు సహా అన్ని సమస్యలపై స్పందిస్తూనే ‘తెలంగాణ పోరుయాత్ర’ చేస్తామని కిషన్‌డ్డి తెలిపారు. సైద్ధాంతిక విభేదాలు, వైషమ్యాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ పార్టీలు, సంఘాలతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సీమాంవూధలో జై ఆంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ పోరుయావూతను మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ గ్రామంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని తెలిపారు.

యాత్రకు జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు వస్తున్నారని చెప్పారు. యాత్ర సాగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులు వస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కిషన్‌డ్డి సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

- పార్టీలో ఆదిపత్యపోరాటం లేదు. తెలంగాణ ప్రజల ఆదిపత్యం కోసమే ఈ పోరుయాత్ర.
- ఈ యాత్రకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే అవకాశం లేదు. తెలంగాణ కోసం జేఏసీతో కలిసి పనిచేస్తూనే ప్రత్యేకంగా కార్యక్షికమాలు నిర్వహించాం. కరీంనగర్, నల్లగొండలో బహిరంగ సభలు జరిపాం. జాతీయ నేత ఎల్‌కే అద్వానీ పర్యటించారు. ఢిల్లీలో తెలంగాణ కోసం ఆందోళనలు నిర్వహించాం.. వీటిల్లో ఏ ఒక్కదానికీ కేసీఆర్ రాలేదు. ఈ యాత్రకు కూడా రారు.
- కాకినాడలో చేసిన ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానాన్ని జాతీయ పార్టీ అంగీకరించలేదు. పైగా అప్పుడు తెలంగాణ ఏర్పాటు ఎన్డీఏ ఎజెండాలోనే లేదు. నాడు మా కోరిక మేరకు తెలంగాణ ఇస్తామనుకున్నా చంద్రబాబు అడ్డంకిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ, ఎన్డీఏ ఎజెండాలో తెలంగాణ ఉంది.
- పార్టీ బలపడాలన్న రాజకీయ దృక్పథంతో కాకుండా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమాన్ని చేస్తున్నాం. పార్టీ బలోపేతానికి మరో కార్యక్షికమం చేపడుతాం.
- టీఆర్‌ఎస్ విశ్వసనీయత కోల్పోలేదు. కేసీఆర్ కూడా తెలంగాణ కోసమే ఉద్యమం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇవ్వకుంటే.. బీజేపీ తెలంగాణ ఇస్తుంది కాబట్టే ప్రజలు మా వైపు చూస్తున్నారు.
- జాతీయ పార్టీ అనుమతితోనే యెండెల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అది ఆమోదం పొందింది. ఆ సమయంలో నేను శాసనసభా పక్షనేతగా ఉన్నందున జాతీయ నేతల సూచన మేరకు రాజీనామా చేయలేదు.
- 2014లో తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిన పక్షాల మద్దతే తీసుకుంటాం. తెలంగాణకు టీడీపీ అంగీకరిస్తే ఆ పార్టీ మద్దతు కూడా తీసుకుంటాం. సీమాంధ్ర ప్రజలను కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఇస్తాం. l షెడ్యూల్ వెలువడిన తరువాతే ఉప ఎన్నికల్లో పోటీ విషయం ఆలోచిస్తాం.
- రెండు శాతం ఓట్లు ఉన్నందున తెలంగాణ గురించి బీజేపీ మాట్లాడొద్దని కాంగ్రెస్ అనడం సరికాదు. అదే ప్రాతిపదిక అనుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి సగం రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేదు. ఆ రాష్ట్రాల గురించి మాట్లాడవద్దు.
- తెలంగాణ కోసం బీజేపీ చేస్తున్న ఉద్యమంలో లోపం లేదు. అయితే నకిలీ గాంధీలు ఏలుతున్న ఇక్కడ అహింసా పద్ధతుల్లో జరుగుతున్న ఉద్యమాలకు స్థానం లేకుండా పోయింది. తెలంగాణ విషయంలో బీజేపీ రెండుసార్లు ప్రైవేటు బిల్లు పెట్టినా.. చర్చకు రాకుండా కాంగ్రెస్‌వాళ్లు అడ్డుకున్నారు.
- బీజేపీ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ తెలంగాణ ఆడపడుచు. ఆమె ఇక్కడ పోటీ చేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీ తరుపున తెలుపుతాం.
- తెలంగాణ కోసం గొప్ప ఉద్యమంలో అనేక మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలు ఏ ఉద్యమంలోనూ కన్పించవు. ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వమే కారణం. వారు తెలంగాణ విషయంలో మాట ఇచ్చి తప్పినందునే.. నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- వంద రోజులు, రెండొందల రోజులు, ఏడాది పాలన సంబరాలను ముఖ్యమంత్రి జరుపుకుంటారు. కానీ, రజాకారుల పాలన నుంచి విముక్తి పొందినందుకు తెలంగాణ ప్రజలు స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకునేందుకు మాత్రం అంగీకరించక పోవడం సరికాదు.
మీట్ ది ప్రెస్ కార్యక్షికమానికి తెలంగాణ ఎలక్షిక్టానిక్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధి కప్పల ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. రాణీరువూదమ తదితరులు పాల్గొన్నారు.

2 కామెంట్‌లు:

  1. good brother as a son of telangana i am proud of u
    s.kummar chary warrangal http://namassthatelangana.blogspot.com/

    రిప్లయితొలగించండి
  2. చంద్రబాబు అడ్డంకి ఐతే ఆపేశారా? హోం మినిస్టర్ అద్వాని భద్రతాకారణాల దృష్ట్యా ఇవ్వలేమని చెప్పారే. చంద్రబాబు వూసే ఎత్తలేదు. ఇపుడు రెడు నావల మీద పంగ చాచి ప్రయాణం మొదలెట్టారా? కిషన్ రెడ్డి, అతితెలివి ప్రదర్శిస్తున్నావేమో, రెంటికీ కాక మధ్యకు చీలుతుంది. కర్నాటక, మహరాష్ట్ర, గుజరాత్, యుపిలలో డిమాండ్లకు తగ్గట్టు ముక్కలు చేసి మీ నిబద్ధత నిరూపించుకుని రండి.

    రిప్లయితొలగించండి