17, జనవరి 2012, మంగళవారం

ఫిబ్రవరి3న ‘జై తెలంగాణ’

ఫిబ్రవరి3న ‘జై తెలంగాణ’
 ప్రజా గాయకుడు రసమయి బాలకిషన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జై తెలంగాణ’. ‘వీరులకు మరణం లేదు’ అని ఉపశీర్షిక. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు  పూర్తిచేసుకొని ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా విడుదల కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌గారు కూడా విడుదలైన తొలి రోజు మొదటి ఆటనే కుటుంబ సమేతంగా చూస్తానని ప్రకటించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొనివుంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రచార చిత్రాల్ని కోదండరాం, స్వామిగౌడ్, అల్లం నారాయణ, కవిత, యన్.శంకర్ లాంటి ప్రముఖులు చూసి ప్రశంసించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను జరిపాం. తెలంగాణ సినిమాలను సీమంద్ర లో  విడుదల చేయనివ్వడం లేదు. దీంతో ఉద్యమకారులు ఈ సినిమాను విజయవంతం చేసి తెలంగాణ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు’ అన్నారు. రోషం బాలు, జయరాజు, చంద్రశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రమేష్ ముక్కెర, కెమెరా: తిరుపతి రెడ్డి కోట, కథ-మాటలు-వూస్కీన్‌ప్లే-నిర్మాత​-దర్శకత్వం: రసమయి బాలకిషన్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి