14, జనవరి 2012, శనివారం

తెలంగాణకు నిరాశే

ఆర్భాటంగా జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా తెలంగాణ ప్రాంతానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. తెలంగాణ జిల్లాలకు ఈ సదస్సు ద్వారా నామమాత్రం పెట్టుబడులే వచ్చాయి. కేవలం రూ.56 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు మాత్రమే ఈ ప్రాంతానికి దక్కాయి. వీటిద్వారా లక్షన్నర మందికి ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు చెబుతున్నాయి. ఇందుల...ో ప్రధానంగా సిమెంటు, టెక్స్‌టైల్స్, పవర్(గ్యాస్) ప్రాజెక్టులున్నాయి. నల్లగొండ జిల్లాలో రాంకీ గ్రూప్ మెగా మల్టీ ప్రాడక్ట్స్ ఇండవూస్టియల్ పార్కు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ పార్కు ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వంతో రాంకీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో ఏర్పాటుకానున్న మిగతా దాదాపు 42 ప్రాజెక్టుల ద్వారా 52 వేల మందికి మాత్రమే ఉపాధి లభించే అవకాశముంది. భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో సీమాంవూధకు పెద్దగా ప్రయోజనం లేకపోయినా ఊరట కలిగే విధంగా ఉన్నాయనే అభివూపాయం వ్యక్తం అవుతున్నది. ప్రస్తుతం అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపైనే సర్కారు ఎంఓయులు కుదుర్చుకున్న తీరును విద్యుత్‌రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. కాగా, మూడు రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా అనూహ్యమైన రీతిలో పెట్టుబడులు రావడంపై రాష్ట్ర సర్కారు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తోంది. తొమ్మిదేళ్ళ తర్వాత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, సీఐఐ, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు ఇంతగా స్పందన వస్తుందని తామూ ఊహించలేదని స్వయంగా సీఎం కిరణ్ వెల్లడించారు. చివరి రోజున పెద్ద ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు పెట్టుబడులతో ముందుకువచ్చాయి. ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో రూ.6.47 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం కలిగింది.See more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి