12, జనవరి 2012, గురువారం

సీమ జగన్‌కు మెరుపు నిరసన

సీమ జగన్‌కు మెరుపు నిరసన - - చితకబాదిన పోలీసులు, సీమరౌడీలు
- మఫ్టీలో జగన్ సేవాదళం దాడి
- సుమన్, రవి, అరవింద్‌లకు గాయాలు
- ప్రభాకర్ కడుపులో పిడిగుద్దులు
- ఊపిరి ఆడక సతమతమైన పీడీఎస్‌యూ నేత
- దీక్షాస్థలిలోకి చొచ్చుకెళ్లిన మల్లేష్, గంగన్‌రాములు
- ప్లకార్డుతో షాకిచ్చిన ఏబీవీపీ కార్యకర్త
- దీక్ష ప్రాంగణంలో ఉద్రిక్తత
- పోలీసుల ఓవరాక్షన్‌పై తెలంగాణ నేతల ఆగ్రహం
- దీక్షను ముట్టడించిన తెలంగాణవాదులు
- దాడికి దిగిన పోలీసులు, సీమరౌడీలు
- సుమన్, రవి, అరవింద్‌లకు గాయాలు

22arm11-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema                      
                                                                                      తెలంగాణవాదుల తెగువ సీమ నేత జగన్‌కు సెగ పుట్టించింది. రైతుల కోసం చేపట్టిన దీక్షకు రెండవ రోజు తెలంగా వేడి మంట రేపింది. పోలీసుల కళ్ళుగప్పి తెలంగాణవాదులు దీక్షాస్థలాన్ని చుట్టుముట్టారు. ఒక్క రోజే మూడుసార్లు నిరసన తీవ్రతను జగన్ రుచిచూడక తప్పలేదు. మొదటిరోజు నిరసనల హోరుతో ఉక్కిరిబిక్కిరి అయిన రాయలసీమ నేతకు రెండవ రోజు బుధవారం కూడా తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దీక్ష సాఫీగా సాగుతుందని మధ్యాహ్నం వరకు భావించిన వైఎస్సార్‌సిపి నేతలకు ఒక్కసారిగా న్యూడెమోక్షికసీ నేతలు ఝలక్ ఇచ్చారు. పథకం ప్రకారం ఒక్కొక్కరుగా దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసులు అనుమానించడంతో ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ దీక్షస్థలి వైపు న్యూడెమోక్షికసీ నాయకుడు వి. ప్రభాకర్ నేతృత్వంలో పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తీవ్రంగా తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు ముచ్చెమటలు పట్టించడంతో లాఠీలతో తీవ్రంగా కొట్టారు. కడుపులో ప్రభాకర్‌ను గట్టిగా తన్నుతూ పిడిగుద్దులు గుద్దారు. వీరికి సీమగుండాలు సేవాదళం ముసుగులు వీడి తోడయ్యారు.

విపరీతంగా కొడుతూ ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేయడానికి ప్రయత్నించారు. పోలీసులను ప్రతిఘటిస్తూ ముందుకు సాగిన నేతలపై ఖాకీలు కాఠిన్యం ప్రదర్శించారు. పోలీసుల దాడిలో పీడీఎస్‌యూ నేతలు సుమన్, రవి, అరవింద్‌లకు గాయాలయ్యాయి. అరవింద్ చేతి విరగగా, రవి చేతికి, చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. సుమన్‌కు కడుపులో దెబ్బలు తీవ్రంగా తగిలాయి. పోలీసులు కిందపడేసి తొక్కడంతో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య ఊపిరాడక సతమతమయ్యారు. వీరితో పాటు జక్రాన్‌పల్లి జేఏసీ చైర్మన్ ఢీకొండ శ్రీనివాస్‌ను సైతం పోలీసులు తీవ్రంగా కొట్టారు. దాదాపు అరగంటకు పైగా పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. సీమరౌడీలు తెలంగాణవాదుల నినాదాలను వ్యతిరేకిస్తూ జైజగన్ అంటూ నినాదాలు చేయడంతో ఘర్షణ ఏర్పడింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
31arm11-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణవాదుల నినాదాలు
న్యూడెమోక్షికసీ నేతలను అరెస్ట్ చేయడంతో ఆగ్రహం పట్టలేని బోధన్ ఏరియా న్యూడెమోక్షికసీ నాయకులు బీ మల్లేష్, బాలరాజ్, గంగన్‌రాములు, బాలాజీలు జగన్ దీక్షాస్థలికి సామాన్య ప్రజలు వెళ్ళినట్లుగా వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే సీమాంవూధవాది గోబ్యాక్... గోబ్యాక్, జగన్ తెలంగాణపై వైఖరిని వ్యక్తం చేయాలని, జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలకు జగన్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. పోలీసులు రంగంలోకి దిగేలోపే సేవాదళం రూపంలో ఉన్న సీమాంవూధగుండాలు వీరిపై దాడికి దిగారు. పోలీసులు కల్పించుకోవడంతో గుండాలు పక్కకు జరిగారు. వీరిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు ఘటనల నుంచి జగన్ తేరుకోకముందే మరో తెలంగాణవాది, ఏబీవీపీ నాయకుడు జై తెలంగాణ ప్లకార్డుతో ఏకంగా జగన్ దీక్షాస్థలికి పోలీసుల కళ్ళుగప్పి చేరుకున్నాడు. జైతెలంగాణ అంటూ నినాదాలు చేసి ప్లకార్డును ప్రదర్శించడంతో అక్కడున్న వారంతా జై తెలంగాణ అంటూ గొంతుకలిపారు. దీంతో ఒక్కసారిగా దీక్షా ప్రాంగణం జై తెలంగాణతో మారువూమోగింది. పోలీసులు రంగవూపవేశం చేసి అదుపులోకి తీసుకున్నారు.

జగన్ ముమ్మాటికీ సమైక్యవాదే

సమైక్యాంధ్ర ప్లకార్డును పార్లమెంట్‌లో ప్రదర్శించిన జగన్ ముమ్మాటికి సమైక్యాంవూధవాదేనని న్యూడెమోక్రసీ నేత విపభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను లెక్కచేయకుండా సమైక్యవాదులను నిలదీస్తూనే ఉంటామని పీడీఎస్‌యూ నేత సుమన్ చెప్పారు. సమైక్యవాదుల భరతం పడతామని జేఏసీ నేత ఢీకొండ శ్రీనివాస్ హెచ్చరించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి