10, జనవరి 2012, మంగళవారం

ముగిసిన సైకిల్ చైతన్య యాత్ర


సకల జనుల సమ్మె తర్వాత ఉద్యమం నిరుగారిపోయిందని నిరాశ చెందుతున్న తెలంగాణా ప్రజలను చైతన్యం చేయడానికే ఈ తెలంగాణా విద్యార్ధి చాతనయ సైకిల్ యాత్ర నిర్వహించినట్లు తెలంగాణా విద్యార్ధి సంఘం ఐ.క.స. అద్యక్షుడు రాజారామ్ యాదవ్ అన్నారు.సైకిల్ యాత్రలో బాగంగా పది జిల్లాలలో నిర్వహించిన సైకిల్ యాత్ర సోమవారం భీంగల్ చేరుకుంది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ భీంగల్ లో జరిగే ఈ బహిరంగ సభతో సైకిల్ యాత్ర ముగిసిందన్నారు.డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ఏ రాజకీయ నాయకులూ కారణం కాదని విద్యార్ధి జే.ఏ.సి పిలుపినిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి భయపడి ప్రబుత్వం ప్రకటన చేసింది అన్నారు.తెలంగాణా జెండా,తెలంగాణా ఉద్యమం కింద పడిన ప్రతి సారి విద్యార్థులే ఆ జెండాను తమ బుజాలపై ఎత్తుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నరన్నారు.తమది ఏ పార్టీ ,ఏ జెండా కాదని తమది తెలంగాణా పార్టీ మరియు తెలంగాణా జెండా అయన స్పష్టం చేసారు.తెలంగాణా జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవడానికే తాము తెలంగాణా రాష్ట్రాన్ని అడుగుతున్నాం కాని ఆంధ్రోల్ల ఆస్తులేమి అడగేట్లేదని ఆయన అన్నారు.

                              ఈ బహిరంగ సభలో విద్యార్ధి నేత పిడమర్తి రవి మాట్లాడుతూ  తెలంగాణా వచ్చే వరకు ఉద్యమం ఆగదని తెలంగాణా రాష్ట్ర సాధనే నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు.బాల్కొండ ఎమ్మెల్యే ఈరవాత్రి అనిల్ చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లు ఓటేస్తే  గెలవలేదని తెలంగాణా ప్రజలు ఓటేస్తే గెలిచారని ,పదవుల కోసం ఆశ పడకుండా చిరంజీవి ని విడిచి తెలంగాణా కోసం పోరాడితే మీ వెంట ఉంటామని ఆయన అన్నారు.పార్లమెంట్ లో సమైక్యంద్ర కావాలంటూ ప్లేకార్డ్ పట్టుకొని తిరిగిన జగన్ ఇప్పుడు తెలంగాణా రైతుల సమస్యలు పరిష్కరిస్తనంటు దీక్ష చేయడం విద్దురంగా ఉందని ఆయన ఎద్దేవా చేసారు.ఈ సందర్బంగా సకల జనుల సమ్మె కాలంలో నాయకులు ఆడిన రాజిడ్రామ ల గురించి విద్యార్ధి నేత ప్రసాద్ పాడిన పాత అందరిని ఆకట్టుకుంది .ఈ కార్యక్రమంలో ఓ.యు జే.ఏ.సి , టీ.ఎస్.జే.ఏ.సి నేతలు ,భీంగల్ ,సిరికొండ మండలాల జే.యి.సి నాయకులు ,భారి ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి