6, ఫిబ్రవరి 2011, ఆదివారం

హలో అందరు ఒక్కసారి ఇక్కడ చుడండి...... .

తెలంగాణ యోధులకు శనర్తులు  ...మాయల మరతిలను మరిపిస్తుండ్రు మన నేతలు ...తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఏర్పాటును తాస్చారం చేస్తుండ్రు .మాయ మాటలతో మాత్పరిస్తుండ్రు.ఉసరవేల్లులు సైతం తలదించుకునేల పూటకో మాట చెబుతూ తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకుంటున్నారు .వందలాది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలను తరుణ ప్రాయంగా వదులుతుంటే గడ్డి పోచతో సరితూగని పదవులను పట్టుకుని మన చట్ట సబల పెద్దలు వేలాడుతున్నారు.నవ్వి పోడూరు గాని నాకేంటి సిగ్గు అనే విదంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.పైకి తెలంగాణా మంత్రం జపిస్తున్నారు .మరో వైపు మన నేతలు ప్రత్యెకరాష్ట్రాన్ని అడ్డుకునే ఆంధ్ర  ఆధిపత్య శక్తుల చేతిలో కీలు బొమ్మల్ల మెదులుతున్నారు.తెలంగాణా తెలుగు దేశం తమ్ముళ్ళు మరో అడుగు ముందుకు వేసి ఆంధ్ర బాబు అడుగులకు మడుగులోత్తుతున్నారు.బారి తెగించి బజారుకేక్కుతున్నారు.జై తెలంగాణా అంటూనే ఆంధ్ర ఆధిపత్య శక్తుల చేరాల్లో బందీలు అయ్యారు.తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అంటూ బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకుల అడుగులు తడబడుతున్నాయి.హైదరాబాద్ లో అడ్డగోలుగా మాట్లాడి హస్తినలో మాత్రం ఇటలీ అమ్మవారి తలుపులు తట్టేందుకు తటపట ఇస్తున్నారు.ఇక్కడ సి ఎం కిరణ్ కుమర రెడ్డి,అక్కడ ప్రణబ్,చిదంబరం ,అహమద్ పటేల్ ల ద్రుష్ట త్రయం ముందు చేతులు కట్టుకున ప్రబు బక్తిని చాటుతున్నారు .శ్రామిక జన పక్షపాతిగా తెగ ఫోజులు కొడుతున్న సి పి యం పరి తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక ఆంక్షలను అపహాస్యం చేస్తుంది.బుజు పట్టిన బాష ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంతాన్ని పట్టుకొని ఆంధ్ర ఆధిపత్య అనుకూల వైకరినే అనుకరిస్తుంది.తెలంగాణా ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లేదంటూ తప్పించుకునే అవకాశ వాడ ఎత్తు గడలతో తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్న సి పి ఎం ను తెలంగాణా సమాజపు బోనులో నిలబెడుతం.పేద ముస్లిం ప్రజలకు ఏనాడూ అండగా నిలబడని ఎం ఐ ఎం పార్టీ అధిక శాతం తెలంగాణా ముస్లిం ల ఆంక్షలకు విరుద్దంగా వివరిస్తూ తానే మొత్తం ముస్లిం సామాజానికి పెద్దన్నల ఫోజులు కొడుతుంది.హైదరాబాద్ లో తన ఆకృత్యాలను ఆగడాలకు అంతులేకుండా చూసుకుంటూ అధికార దర్పంతో ఆంధ్రోల్లకు ఊడిగం చేస్తూ తెలంగాణా ఆకాంక్షను చిన్నదిగా చూపే కుట్ర చేస్తుంది.


          ఇటువంటి రాజకీయ అవకాశవాద గాలి వాటపు గుంత నక్కలను ఎందగాడధం.నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను అడ్డం పడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యక్ష బాగాస్వములవుదం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి