13, ఫిబ్రవరి 2011, ఆదివారం

సహాయనిరాక'రణమే'

వచ్చేపార్లమెంటు సమావేశాల్లోతెలంగాణబిల్లు ప్రవేశ పెట్టే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శుక్రవారం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సహాయ నిరాకరణ, ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈనెల 13 నుండి 22 వరకు ఈ సందర్భంగా ఆందోళన కార్యక్రమాల వివరాలును  ఆయన చెప్పారు. ఈనెల 13వ తారీఖున అన్ని గ్రామాల్లో చాటింపులు వేయిస్తామని చెప్పారు.

           తర్వాత 15న జైల్ భరో నిర్వహిస్తామన్నారు. 16న ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. 19న రాస్తారోకోలు, 20న ఎన్‌హెచ్-9 రహదారీని దిగ్బంధం చేస్తామని చెప్పారు. 22 నుండి జెఏసి బంద్ ఉంటుందని చెప్పారు. సహాయ నిరాకరణలో కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వాటర్ బిల్లులు సహా ఎటువంటి పన్నులూ చెల్లించకుండా నిరసన తెలపాలన్నారు. జనాభా లెక్కల కార్యక్రమాన్నీ బహిష్కరించాలని JAC తీర్మానించింది. సహాయ నిరాకరణలో భాగంగా బస్సులో టిక్కెట్లు తీసుకోక పోవడం, టోల్ గేట్లు, ఇంటి పన్నులు చెల్లించక పోవడం తదితర కార్యక్రమాలుచేపడతామని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి