28, జనవరి 2011, శుక్రవారం

నిజాన్ని చెప్పే కవిత

ఉల్లంఘనకె చట్టాలు
అటకెక్కుటకె జీఓలు
"ఒప్పందపు" మాటలన్ని ఒట్టి నీటిమూటలు
గుక్క నీరు నోచుకోని నల్లగొండ పిల్లలు
అప్పులయ్యి ఆగమైరి వరంగల్లు రైతులు
వలస పక్షులైపోయిరి పాలమూరు వాసులు
దేశమిడిచి పాట్లు పడిరి కరీంనగరు తమ్ములు
పొట్టకూడు కరువైన బట్ట నేయు జీవులు
కేసేయారు దీక్ష మొదలు అడుగడుగున టెంటులు
గల్లి గల్లి లొల్లి చెస్తె ఓయూ విద్యార్థులు
అర్ధ రాత్రి ప్రకటనలు
తెల్లవారె (రాజి) నామాలు
"ముద్దు" పెట్టు వుద్యమాలు
"పరుగు లెట్టు" దీక్షలు
"రెండు కళ్ళ" వాదాలు
కంటి తుడుపు 'కమిటీ'లు
కలిసి ఉంతె మీలంటు కల్ల బొల్లి మాటలు
విడిపొతం మేమంటె  దెశద్రొహ ముద్రలు
హైద్రాబాదు అందరికని అడ్డగోలు చర్చలు(సీమంద్ర చానేళ్ళూ)
చిన్న రాష్త్రమైతెనె పెరుగుతరట నక్సలైట్లు
పాత బస్తి వాసులంత ఐతరంట టెర్రరిస్ట్లు
రియల్ ఎస్టేటు పడిపొద్దని "అన్ రియల్" అపోహలు
విమోచన కాదని విలీనమేనని చరిత్రకె భాష్యాలు
వెనకకెల్ల మనసు రాక పడుతున్నారీ పాట్లు

అభిమానం హద్దు మీరి ఐతె ఆత్మహత్యలు
"పెద్ద" లెంత వద్దన్నా మొండి "ఓదార్పు"లు
ఉద్యమాన అమరులైరి ఎందరో విద్యార్థులు
తెలంగాణ ఏర్పాటె వారికి జోహరులు
          !!జై తెలంగాణ!!


వ్రాసిన వారు :రవి కుమార్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి