30, డిసెంబర్ 2010, గురువారం

తెలంగాణ ఇట్లనే సమైక్య రాష్త్రంలో ఉండాలని సీమాంధ్రులు ఎందుకు అంత తీవ్రంగా కోరుకుంటున్నారు?

తెలంగాణ ఇట్లనే సమైక్య రాష్త్రంలో ఉండాలని సీమాంధ్రులు ఎందుకు అంత తీవ్రంగా కోరుకుంటున్నారు?  
అనేది కొందరు తెలంగానవాదులను వేధిస్తున్న ప్రశ్న.
ఇటీవల తెలంగాణ విధ్యావంతులు వీటికి సమాధానాలు ఇట్ల ఒక కవిత లాగ చెప్పుతున్నారు.తె-నీళ్ళు సాగర్ వంటి మూడు (పో,పో,పో ) ప్రాజెక్టుల ద్వారా ఇలాగే కొనసాగాలంటే ఈసమైక్య రాష్ట్రం కొనసాగాలి.సీమాంధ్రకు సింగరేణినుండి ఇదేరేంజ్‌లో తరలి తమకు కరెంటు ఉత్పత్తికావాలంటే ఆ.ప్ర.ఇలాగే కొనసాగాలి.తెలంగాన భూములు,నిధులు,ఉద్యోగాలు ఇట్లనే వాళ్ళకు రావాలంటే రాష్త్రం ఇట్లనే ఉండాలి.వాళ్ళ ఉత్పత్తులు కొబ్బరిబోండాల కాణ్ణుంచి అమ్ముకోవడానికి , కార్పోరేటు కాలేజీలు నడవడానికి మన విధ్యార్ధులు,ఆసుపత్రులకు మన పేషంట్లు కావాలి.
నీళ్ళను మలిపినోడు కే ఎల్ రావ్
తీగలు (కరెంటు) మలిపినోడు తాతారావ్
మనసులు (ఆలోచనలను) మలిపినోడు రామోజీరావ్
నిధులను మలిపినోడు చంద్రబాబు,
నదులను  మలిపినోడు వయ్యెస్(క్రుష్ణను పోతిరెడ్డినుండి,గోదావరిని పోలవరం ద్వారా)

వాళ్ళ ప్రాంతాలకు ప్రాజెక్టులనుండి నీళ్ళు తోలుక పోవడానికి బైపాసు కాలువలు, వాళ్ళు తోవలో మన పట్టణాల రద్దీ లేకుండబోవాలంటే బైపాసు రోడ్లు కావాలి.అందుకే తెలంగాణ భూములు వాళ్ళకు కావాలి,అంటే వారి కాలువలకు, ఆరోడ్లకు మన భూములు కావాలి.క్లుప్తంగా -
వారి రాకపోకలు సాఫీగా సాగడానికి మన పట్నాలచుట్టు బైపాసురోడ్లు కావాలి
వాళ్ళ భూములకు ప్రాజక్టుల నీళ్ళు పోవడానికి కాలువలు కావాలి,
ఆకాలువల కొరకు మన భూములు కావాలి.
వాళ్ల కాంట్రాక్టర్లు కొనుక్కున్న మెషిన్లకు మన దగ్గర కాంట్రాక్టులు కావాలి.
వాళ్ళ బస్సులకు మన ప్యాసింజర్లు కావాలి.

అందుకొరకే మన తెలంగాణ వాళ్ళకు కావాలి.

వాళ్ళ నిర్మాణాలకు మన కూలోళ్ళు కావాలి.
 



source:ourtelangana.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి