16, జనవరి 2013, బుధవారం

చింతన్.. మంథన్.. అన్నీ.. తెలంగాణమే

చింతన్.. మంథన్.. అన్నీ.. తెలంగాణమే
pranab-గడువులోగా మూడు సందర్భాలు
-18, 19 తేదీల్లో చింతన్ బైఠక్.. 20న ఏఐసీసీ సమావేశం.. 26న రాష్ట్రపతి ప్రసంగం
-రోడ్‌మ్యాప్ ప్రకటించే అవకాశం?.. 20 - 26 మధ్య కేసీఆర్‌తో సంప్రదింపులు?
-అడ్డుకునేందుకు ఆ మూడుపార్టీల ఆఖరి ప్రయత్నాలు

హైదరాబాద్, జనవరి 15 (టీ మీడియా):తెలంగాణ గురించి తేల్చేందుకు తేదీ ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు గడువు దగ్గరపడుతున్నకొద్దీ ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేస్తోంది. చివరితేదీ జనవరి 28కాగా, ఆలోగా చర్చించేందుకు, నిర్ణయం తీసుకునేందుకు, సంకేతాలో, వివరాలో ప్రకటించేందుకు మూడు సందర్భాలొస్తున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్ ‘చింతన్ బైఠక్’ పేర తీవ్ర సమాలోచనలు జరుపనుంది. ఆ మరుసటిరోజు 20వ తేదీన ఏఐసీసీ సమావేశం కానుంది. ఈ రెండు సందర్భాలను తెలంగాణపై చర్చించేందుకు, నిర్ణయం తీసుకునేందుకు వినియోగించుకుంటే, జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో అందుకు సంబంధించిన సంకేతాలనో, వివరాలనో వెల్లడించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అన్ని వర్గాలతో, అన్ని రకాలుగా చర్చలు సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ అధిష్ఠానం ఇక ఓ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని, ఆ మేరకు సిద్ధమయిందని కూడా కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాజాగా తెలంగాణ ఏర్పాటు దిశగా మరింత సానుకూల సంకేతాలు రావడంతో కాంగ్రెస్ కరాఖండిగా వ్యవహరిస్తుందని అంటున్నాయి. జనవరి 26నాటి రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణకు సంబంధించి రోడ్‌మ్యాప్ ప్రకటించే అవకాశముందని భావిస్తున్నాయి. ఇంతకాలం ఏదోరకంగా అడ్డుకుని తెలంగాణ ప్రకటనలో జాప్యం జరిగేందుకు కారణమైన పార్టీలు, నేతల్లో తాజా పరిణామాలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటును సీమాంవూధకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తెలంగాణ ఖాయమన్న సంకేతాలు వస్తుండటంతో మరోసారి చివరి ప్రయత్నంగా అడ్డుపుల్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి తమ వంతు ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. తెలంగాణపై గత నెల 28న ఢిల్లీలో జరిపిన అఖిలపక్ష భేటీ అనంతరం రాష్ట్ర విభజన విషయంలో తీవ్ర కసరత్తులు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు హస్తిన వర్గాల సమాచారం. అయితే పార్టీ అంతర్గత సమావేశమైన చింతన్ బైఠక్‌లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చింతన్ బైఠక్ పేరిట అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తున్న సదస్సులో రాష్ట్ర విభజన అంశం చర్చకు వచ్చే అవకాశాలుంటాయని, అక్కడే తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుతో ఈ నెల 26లోగా కాంగ్రెస్ అంతర్గత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే తెలంగాణపై ప్రకటన జారీచేసే అవకాశాలుంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 20 నుంచి 26 మధ్య ఈ అంతర్గత చర్చలు ఉండవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పటికే టీ కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా పట్టుబట్టుతున్నారు. ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రాణ త్యాగాల దృష్ట్యా రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని టీ కాంగ్రెస్ ఎంపీలు హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత మంత్రుల నుంచి కూడా డిమాండ్ వస్తున్నది. తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండబోదని వారంటున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పరిస్థితులను వివరిస్తూ, ఇక్కడి వాస్తవాలు, పార్టీ విషయాలు తెలియజేస్తూ హైకమాండ్‌కు వీరు ఒక నివేదిక కూడా అందజేశారు. టీ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు అనేక మార్లు లేఖలు పంపించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా దూతలను కూడా పంపి రాష్ట్ర విషయాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రకటించకుంటే ఆంధ్రవూపదేశ్‌లో కాంగ్రెస్ రెంటికి చెడిన రేవడిగా మారుతుందని ఆయన అభివూపాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో వైఎస్సార్సీపీ ప్రాబల్యం ఉన్నందున రాష్ట్రం సమైక్యంగా ఉన్నా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్‌ఎస్ సహకారంతో కాంగ్రెస్ అధిక సీట్లు గెల్చుకుంటుందని రూఢీ అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే కేసీఆర్‌తో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలో ఆయనను హస్తినకు పిలిపించి సంప్రదిస్తారని అంటున్నారు. చింతన్ బైఠక్, ఏఐసీసీ సమావేశం ఈ నెల 20తో ముగిసిన తరువాత 26 వరకు వివిధ దశల్లో చర్చలు కొనసాగుతాయని, ఒక తుది రూపం వస్తుందని సీనియర్ నేత ఒకరు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2004లో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఏకాభివూపాయం ద్వారా తెలంగాణ సాధ్యమని, త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు చేపడతారనే విధంగా ప్రస్తావన వచ్చిందని ఒక నాయకుడు గుర్తు చేశారు. ఆ రకంగానే ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రక్రియకు తుదిరూపం ఇచ్చి ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం అంశం ప్రస్తావనకు తెచ్చే అవకాశం ఉంటుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

1 కామెంట్‌: