20, సెప్టెంబర్ 2012, గురువారం

తెలంగాణా తల్లి విగ్రహ రూపకర్త బి.వి.ఆర్ చారి ఇన్నెర్ వ్యూ


శనగపిండి స్పెలిస్ట్...
tamlnadupanthulహైదరాబాద్‌లో సాదాసీదాగా జీవితం గడుపుతున్న చారీ కూడా బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు గరిటె తిప్పాడు. ఆయన హైదరాబాద్‌లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (శిల్పకల) చదివే రోజుల్లో తన స్నేహితుడు రమణతో కలిసి హాస్టల్‌రూమ్‌లో ఉండేవాడు. ఏవైనా పండగపబ్బాలు వచ్చాయంటే హాస్టల్‌లో మెస్ ఉండేది కాదట. అప్పుడు రూమ్‌లో స్వయం పాకమే శరణ్యమయ్యేది వాళ్లకు. తన రూమ్మేట్‌కేమో వంట చేయడంరాదు. పాకశాస్త్రంలో కొద్దోగొప్పో ప్రవేశం ఉన్న చారే తప్పనిసరి పరిస్థితుల్లో వంట చేయాల్సి వచ్చేది. పస్తులు పడుకునేకంటే కష్టపడ్డమే నయమనుకుని తనకు తెలిసిన శనగపిండి వంటలు చేసేవాడు. టమాట శనగపిండి కూర, బరడా, పిట్ల లాంటి ఆదిలాబాద్ స్పెషల్స్‌తో స్నేహితుడికి కొత్త రుచులు చూపించేవాడు.

అవి ఆయనకు ఎంతగానో నచ్చేవి. ఇంకేముందీ చారీ వంటలు చేస్తే, ఆయన స్నేహితుడు రమణ బ్రేవ్ మనేవాడు! వంటల వరకే కానీ అంట్లు తోముడు జోలికి మాత్రం చారీ వెళ్లేవాడు కాదు. అది మాత్రం రమణే చూసుకునేవాడు. అలా..చారీ బ్యాచిలర్ లైఫ్‌లో షెఫ్ పాత్ర జీవం పోసుకుంది. ఇప్పటికీ ఇంట్లో తన భార్య సాయిసుధకు వంటల్లో సహాయపడతాడు చారీ. అవసరమయితే తానే వండిపెడతాడు కూడా.

tamlnadupanthulఇంగ్లీష్ అంటే చచ్చేంత భయం
చిన్నప్పటి నుంచి బలవంతపు చదువులు చదివిన చారీకి ఇంగ్లీష్ అంటే చచ్చేంత భయం. విద్యాభ్యాసంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆయనను చాలా ఇబ్బంది పెట్టింది. ఇంటర్మీడియట్‌లో అన్ని సబ్జెక్టుల్లో గట్టెక్కినా ఇంగ్లీష్ మాత్రం అక్కడే ఉండిపోయింది. సప్లిమెంటరీలో సైతం ఇంగ్లీష్‌తో పోరుకు ధైర్యం చేయలేకపోయిన చారీ దూరవిద్యలో ప్రత్యామ్నాయ కోర్సు చేశాడు. ఇప్పటికీ ఇంగ్లీష్ అంటే ఆమడదూరంలో ఉంటాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో శిల్పకళలో పై చదువు ఆరంభించాడు. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ)లో గౌరవక్షిశేణి సంపాదించాడు. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లోకూడా అదే ప్రతిభ కనబరిచాడు. ఇప్పుడు శిల్పాలు తయారుచేయడమే జీవనోపాధిగా మార్చుకున్నాడు. ఆర్డర్‌లపై వివిధరకాల విగ్రహాలు తయారుచేస్తున్నాడు.

tamlnadupanthulచిన్నప్పటినుంచి శిల్పకళపై ఆసక్తి..
‘నా చిన్నప్పుడు ఎప్పుడూ విగ్రహాలను చేస్తుండేవాడిని. మేము ఏడుగురం అన్నదమ్ములం, ఒక అక్క. వారందరూ చదువుకుంటే నేను మాత్రం మట్టితో వివిధ రకాల విగ్రహాలు తయారుచేస్తుండేవాణ్ణి. అమ్మానాన్న ఎంత చెప్పినా నాకు చదువుపై పెద్దగా ఆసక్తి కలగలేదు. వారికి భయపడి మాత్రమే బడికి వెళ్లేవాడిని. మా మేనమామ పెద్ద,పెద్ద వినాయక విగ్రహాలు చేస్తుండేవాడు. ఆయనకు సహాయకుడిగా ఉంటూనే శిల్పకళలో మెళకువలు నేర్చుకున్నాను. స్వంతగా మట్టితడిపి తయారుచేసిన మొట్టమొదటి శిల్పం వీరవూబహ్మేంవూదస్వామిది.

ఆ విగ్రహం అనేక ప్రశంసలు తెచ్చిపెట్టింది నాకు. నిర్మల్‌లోని జుమ్మేరాత్‌పేట్ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదివేరోజుల్లో జరిగిన చిత్రకళ పోటీల్లో నేను మట్టితో తయారుచేసిన సరస్వతీ విగ్రహానికి మొదటి బహుమతి వచ్చింది. అదే నాలో ఉత్సాహాన్ని నింపింది. అప్పుడే నిర్మల్‌లోని ఓంకారేశ్వర మందిరానికి కరీంనగర్‌కు చెందిన వడ్లూరి బ్రహ్మయ్య అనే శిల్పిరావడం, ఆలయం కోసం ఆయన కళాఖండాలు చెక్కడం దగ్గరుండి మరీ చూశాను. అలా ఆ కళపై మరింత పట్టుపెరిగింది. నిర్మల్‌కి వెళ్లేటప్పుడు మా అమ్మ తాను బీడీలు చేసి దాచుకున్న వంద రూపాయలను నాకు ఇచ్చింది. వాటిని నేను బొమ్మలకే ఖర్చుచేశాను. ఆ డబ్బులను మా అమ్మ ఆశీర్వాదంలా భావిస్తాను. ప్రథమ బహుమతివచ్చిన సరస్వతీ విగ్రహం ఇప్పటికీ అదేపా ప్రధానోపాధ్యాయుడి గదిలో పదిలంగా పెట్టి ఉంది!’ అని తాను శిల్పకారుడినైన వైనాన్ని వివరించాడు చారీ.

tamlnadupanthulమేధావుల సమక్షంలో తుదిమెరుగులు..
తెలంగాణ తల్లి విగ్రహం తయారుచేసేవారు కావాలంటూ తెలంగాణ భవన్ నుంచి వచ్చిన ప్రకటనకు స్పందించిన చారీ తను అప్పటికే తయారుచేసిన మైనపు విగ్రహాన్ని తీసుకెళ్లాడు. దాదాపు వందమంది తెలంగాణ కళాకారులు వివిధరకాలుగా తాము మలచిన తెలంగాణ తల్లి విగ్రహాలను తీసుకొచ్చారు. అక్కడున్న తెలంగాణ మేధావులు చారీ తయారుచేసిన మైనపు విగ్రహాన్నే ఎంపిక చేశారు. అయితే దానికి కొన్ని తుదిమెరుగులు దిద్దాలని సూచించారు. అప్పటికి చారీ తయారుచేసిన విగ్రహం ఒకచేతిలో జొన్నకంకితో సాధారణ తెలంగాణ ఆడపడుచులా ఉంది. విగ్రహానికి దేవతారూపంవచ్చేలా కాస్త మెరుగులు దిద్దాలన్నారు మేధావులు. చేతిలో ఉన్న జొన్న కంకితోపాటు మక్క కంకి, మరోచేతిలో బతుకమ్మ, తలపై కిరీటం, మెడలో కంటె, నడుముకు వడ్డాణం, కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు, కడియాలు చేర్చి తెలంగాణ తల్లికి తుదిమెరుగులు దిద్దాడు. అదే విగ్రహం ఇప్పుడు తెలంగాణ అంతటా కొలువుదీరి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి