30, మార్చి 2012, శుక్రవారం

తెలంగాణ వ్యవసాయానికి కరెంట్ షాక్!


- అస్తవ్యస్త సరఫరాలు... పెను సమస్యగా లో ఓల్టేజ్- కాలిపోతున్న మోటర్ల్లు.. పెరుగుతున్న రిపేరు ఖర్చు- పట్టించుకోని అధికారులు... లంచాలు లేనిదే పనికాదు..- అక్రమ కనెక్షన్లంటూ రైతులపై నెపం నెట్టేయత్నం

తెలంగాణ వ్యవసాయం అప్రకటిత క్రాప్‌హాలిడే ప్రకటించుకోడానికి దారి తీస్తున్న వాటిలో విద్యుత్ కూడా ఒకటి! తెలంగాణలో 15.67 లక్షల పంపు సెట్లు ఉన్నాయంటే ఇక్కడ బోర్ల ఆధారిత వ్యవసాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు ధ్వంసమైన సంప్రదాయ సాగునీటి వ్యవస్థ.. మరోవైపు వెక్కిరిస్తున్న సీమాంధ్ర పాలకుల జలయజ్ఞం.. వెరసి.. బోర్ల నుంచి నీరు తోడి సాగు చేయాలని, ఎండిపోతున్న పంటలు కాపాడుకోవాలని తెలంగాణ రైతు చేస్తున్న ప్రయత్నాలకు కరెంటు షాక్ కొడుతున్నది. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని విద్యుత్ మాయా సరఫరాల మధ్య పరుగులు తీస్తున్న తెలంగాణ రైతు.. కరెంటు వచ్చే కొద్దిపాటి సమయంలోనే చెలక తడిపేందుకు తపన పడుతున్నాడు! ఏ అర్ధరాత్రో అపరాత్రో పొలం దగ్గర మోటర్ షాక్ కొట్టి దిక్కులేని చావు చస్తున్నాడు. కాళ్లు చచ్చుబడిపోయి.. జీవచ్ఛవంలా మారుతున్నాడు.. అచ్చం పడావు పడిన తెలంగాణ వ్యవసాయమల్లే!!

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాలు..పెను సమస్యగా లో ఓల్టేజ్ బతుకు పడావు-5 హైదరాబాద్, ఆగస్టు 17 (టీ న్యూస్): అధికారుల నిర్లక్ష్యం, అవినీతి.. వెరసి రైతులు కరెంటు తీగలకు మాడి మసైపోతున్నారు. స్వాతంత్య దినోత్సవానికి ముందు రోజే ఇద్దరు రైతులు కరెంటు షాక్‌కు గురై మరణించారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్న రామన్‌చర్ల గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి 12 రోజులైనా, అధికారులు రిపేరు చేయకపోవడంతో రైతులే స్వయంగా రిపేరు చేయించుకున్నారు. బాగు అయింది కదా అని మోటరు వేసిన ఓర్ల రామయ్య అనే 32 ఏళ్ల రైతు కరెంటుషాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఖమ్మం జిల్లా మండలంలో పాపయ్య అనే రైతు పొలంలో కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు.

అక్కడ విద్యుత్ తీగలు తెగి పొలంలో పడ్డాయి. మరో రైతు సమయ స్ఫూర్తితో దాదాపు 8 మంది రైతులు బతికి బయట పడ్డారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని కోనాయగూడెం గ్రామం మొత్తానికి ఆగస్టు 12న కరెంటు షాక్ తగిలింది. వైర్లు కిందకు వెలాడుతున్నాయని అధికారులకు గ్రామస్థులు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో త్రీఫేస్ కరెంటు వెళ్లే వైర్లు టీవీ కేబుల్ వైర్లకు జాయింట్ అయ్యాయి. కేబుల్ వైర్ల ద్వారా అన్ని టీవీలకు విద్యుత్ సరఫరా అయింది. ఆ రాత్రి సకినాల రోశయ్య అనే 35 ఏళ్ల రైతు కరెంటుషాక్‌కు గురై చనిపోయాడు. ఇలా సాగునీరు అందించే విద్యుత్.. రైతుల పాలిట మృత్యుదేవత అవుతున్నది. ఈ రెండేళ్లలోనే వేయి మంది వరకు రైతులు చనిపోయి ఉంటారని రైతు నాయకులు అంటున్నారు.

లోవో ్టజ్‌తో కాలిపోతున్న మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో లో ఓల్టేజ్ కారణంగా ప్రతి సీజన్‌లో దాదాపు 40 శాతం మోటార్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కూడా బారీ సంఖ్యలో రిపేర్లకు వస్తున్నాయి. తెలంగాణలో 3,16,522 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా సీజన్ ముగిసే నాటికి కనీసం 70 నుంచి 80 వేల వరకు రిపేర్లకు రావడమో, కాలిపోవడమో జరుగుతున్నదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. వచ్చే కరెంటు సమయానికి రాదు. వచ్చినా ఎంత సేపు ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఏరియాకు చెందిన సుబ్బాడ్డి గూడెం రైతు చెప్పిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అసలు ఊర్లో విద్యుత్ సరఫరా ఉండదు.

కనీసం ఇళ్లకు కూడా సరఫరా ఉండదు. సాయంత్రం ఆరు గంటలకు సింగల్‌ఫేస్ కరెంటు వస్తుంది. తెల్లవారుజామున మూడు గంటలకు వ్యవసాయ మోటర్లకు ఉపయోగపడే విధంగా త్రీఫెస్ కరెంటు వస్తుంది. అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చే కరెంటు కోసం రైతులు తెల్లవార్లూ నిద్ర లేకుండా పొలాల వద్దనే గడపాలి. ఊరికి కాస్త దగ్గరలో ఉంటే ఆ రాత్రి పూటనే పొలం వద్ద వెళతారు. ఆ సమయాల్లో పొరపాటున మోటార్లు నడవకపోయినా, ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏమైనా సాంకేతిక అవాంతరాలు తలెత్తినా రైతు ప్రాణానికి గండం ఏర్పడినట్లే. సుబ్బాడ్డిగూడెంలోని ఒక రైతుకు వరి నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే సరికి 5 సార్లు మోటరు కాలిపోయింది. ఒక సారి పొలం నాటు వేయగానే ట్రాన్స్‌ఫ్మార్మర్ కాలిపోయింది. దాదాపు మూడు నాలుగు సార్లు ట్రాన్స్‌ఫ్మారర్ మార్చినా నిలువ లేదు. దీంతో ఆ ట్రాన్స్‌పార్మర్ కింద సాగు చేసిన భూమిలో పంట అంతా ఎండిపోయింది.

మెదక్ జిల్లాలోని పలు గ్రామాలను పరిశీలిస్తే వ్యవసాయ పంపు సెట్లకు త్రీఫేస్ కరెంటు వచ్చే వేళలు కూడా నిర్దిష్ట్టంగా ఉండటం లేదు. దీంతో ఒకసారి బోరు నీటితో కాస్త పొలం తడవగానే కరెంటు పోతుంది. ఆ తరువాత తిరిగి కరెంటు వచ్చేసరికి తడిసిన పొలంలో నీరు భూమిలోకి ఇంకి పోతుంది. మళ్లీ కరెంటు రాగానే మోటర్ వేస్తే తడిన నేల వరకే తిరిగి తడుస్తున్నది. బోరు నీరు మడి దాటి కిందకు పారని దైన్య స్థితి.

భారంగా మారిన అస్తవ్యస్త విద్యుత్ సరఫరా తెలంగాణ జిల్లాలకు 10,100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు శ్రీకృష్ణ కమిటికీ రిపోర్టు ఇచ్చారు. కానీ అస్తవ్యస్తంగా ఉన్న లైన్ల కారణంగా దాదాపు 33 శాతం లైన్ లాస్ జరుగుతుంది. దీన్ని నియంవూతించడంలో విఫలమైన అధికారులు నెపం రైతులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అక్రమ కనెక్షన్లే కారణంగా అధికారులు చూపుతున్నారు. దాదాపుగా బోర్ల కింద వ్యవసాయం చేసే ప్రతి రైతుకు సీజన్ ముగిసేలోగా మోటరు ఒక్కసారైనా కాలిపోతుంది. దాన్ని బాగు చేయించాలంటే కనీసం వారం పడుతుంది. ఈలోగా పొలం వాడు పడుతుంది. ఒక్క సారి మోటరు కాలిపోతే దాదాపు రూ.6వేల వరకు ఖర్చు అవుతున్నది. సబ్‌మెర్సిబుల్ మోటరు కాలిపోతే దానిని బయటకు తీయడానికి, రిపేరు అయ్యాక బిగించడానికి రూ.2500 అవుతాయి.

రిపేరు ఖర్చు దాని పరిస్థితిని బట్టి రూ.2,500 నుంచి 3 వేల దాకా అదనంగా అవుతున్నది. ఒక మోటర్ రిపేర్ చేయడానికి కనీసం నాలుగు రోజులు పడుతుంది. కానీ.. సీజన్‌లో మెకానిక్‌ల వద్దకు పదుల సంఖ్యలో మోటర్‌లు వస్తుంటాయి. దీంతో ఇది రైతుకు పెను సమస్యగా పరిణమిస్తున్నది. అదే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే రైతులంతా అగచాట్లు పడాల్సిందే. కొన్నిసార్లు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రైతులే తలాకొంత వేసుకొని బాగుచేయించుకుంటున్నారు. అది పనికి రాదంటే వారే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేసుకుంటున్న ఉదంతాలూ ఉన్నాయి. రూ.70 వేల విలువ చేసే 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చును సగటున 20 మంది రైతులు భరిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్, పరిగి, జనగాం తదితర ప్రాంతాలలో రైతుల ఖర్చుతోనే విద్యుత్ లైన్లు ఏర్పాటు అవుతున్నాయి.

తెలంగాణ రైతు పరిస్థితి ‘‘ఎనుగుల పైసలు పారబోసి ముళ్లుగుచ్చుకోంగ ఏరుకున్నట్లుగా’’ ఉంది. సీమాంవూధలోనూ కొన్ని సమస్యలున్నప్పటికీ.. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కువగా వ్యవసాయం సాగునీటి కాల్వల ద్వారానే సాగుతున్నది. ఫలితంగా విద్యుత్ వినియోగం తక్కువ. కాలువల ద్వారానే అక్కడ 43 లక్షల ఎకరాల భూమిలో సేద్యం జరుగుతున్నది. దీనికి ఎలాంటి విద్యుత్ ఖర్చూ లేదు. ఇవి కాక మరో 22 లక్షల ఎకరాల భూమిని విద్యుత్ మోటర్ల సాయంతో సాగు చేస్తున్నారు. దీనికి 7,100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతున్నారు. అదే తెలంగాణలో 31 లక్షల ఎకరాల భూమికి 10,100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతున్నారు.

ఇందులోనే లిఫ్ట్ ఇరిగేషన్‌లు కూడా ఉన్నాయి. తెలంగాణలో కాలువల ద్వారా కేవలం 12 లక్షల ఎకరాల భూమికి మాత్రమే నీరు అందుతున్నది. ఈ విషయాన్ని గుర్తించ నిరాకరించిన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నట్లుగా నివేదికలో పేర్కొంది. కానీ.. బోర్లరామిడ్డి.. రాజేశం వంటి వారి పరిస్థితిని గమనిస్తే తెలంగాణలో అప్రకటిత క్రాప్‌హాలిడే కారణాలు అర్థమవుతాయి. కానీ.. ఇక్కడి పరిస్థితిని పట్టించుకోడానికి ప్రభుత్వం నిరాకరిస్తుండటమే విషాదం.

ఉచితం పేరుతో రైతు నెత్తిన భారం విద్యుత్ సంస్కరణలు తెలంగాణ రైతుకు శాపంగా మారాయి. నిర్వహణ నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చు అంతా రైతుపైనే వేస్తున్నారు. నేరుగా రైతే ట్రాన్స్‌ఫార్మర్లు, పత్తీలు, వైర్లు ఇలా సమస్తం కొనుగోలు చేసి, ఆ తరువాత అధికారులకు అంతో ఇంతో ముట్టజెపితేనే వాటిని బిగిస్తున్నారు. ఒక్కో రైతు కొత్త కరెంటు కనెక్షన్లు తీసుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సాగునీటి వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో జరిగితే రైతుకు ఈ అవస్థ ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మించాలి. విద్యుత్ వ్యవస్థ నిర్వహణ అంతా సర్కారే చూడాలి. రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేసే దుస్థితి నుంచి బయట పడేయాలి. వ్యవసాయానికి నికరంగా 16 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి.

లిఫ్ట్ ఇరిగేషన్‌కు 16 గంటలు విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇది అంతటికీ వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ ఈ రూపంలో దోచుకుంటున్నారు. సర్వీసు చార్జీ వసూళ్లకు వచ్చే వచ్చే సిబ్బంది వందల రూపాయలు రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కరెంటు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. పంట వచ్చే సమయంలో తాలు ఎక్కువ వచ్చి దిగుబడి తగ్గుతున్నది. ఈ మేరకు జరిగే నష్టాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించాలి.
- వీ కోటేశ్వరరావు, అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి

ఇది అక్కన్నపేట గొస !హుస్నాబాద్, ఆగస్టు 17 (టీ న్యూస్) :హుస్నాబాద్ మండలం అక్కన్నపేట గ్రామంలో సుమారు 700 రైతు కుటుంబాలు ఉంటాయి. 5400 ఎకరాల విస్తీర్ణంలో సాగుభూమి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో 3వేల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. వర్షాలు లేక, ఇప్పటికే గ్రామంలో సగం మంది రైతుల బావులు ఎండిపోయాయి. గ్రామపంచాయితీ పరిధిలోని 11తండాలు, రెండు శివారు పల్లెల్లో 128 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ నిత్యం లోఓల్టేజ్ ప్రధాన సమస్య. ఫీజు మార్చుకోవడం నుంచి ఏ సమస్య వచ్చినా ైె తులే చూసుకోవాలి. గతంలో ఇలా ఫీజులు మారుస్తూ, రైతులు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇటీవలే ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన కర్ర మల్లాడ్డి అనే రైతుకు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ బావి ఎండిపోయింది. 400ల ఫీట్ల చొప్పున రెండు బోర్లు వేసినా అనుకునన్ని నీళ్లు రాలేదు.

రెండేళ్ల క్రితం మూడెకరాల్లో పునాస పంట వేశాడు. సుమారు ₹30 పెట్టుబడి పెడితే, ఆ మేరకు కూడా దిగుబడి రాలేదు. గత రబీలో(వేసంగిలో) రెండెకరాలు సాగు చేస్తే మళ్లీ పొలం ఎండిపోయింది. పసలుకు 50 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రెండేళ్లలో రెండుసార్లు మోటర్ కాలిపోయింది. విసుగు చెందిన మల్లాడ్డి పొలం చెడగొట్టి మూడెకరాల్లో బత్తాయి తోట పెట్టాడు. తాజాగా ఖరీఫ్‌లో కేవలం 30 గుంటల పొలం నాటేశాడు. అది కూడా పంట చేతికొచ్చేవరకు నమ్మకం లేదని చెప్పాడు. మంద కొమురయ్య అనే ైె తుకు మూడెకరాల భూమి ఉంది. బావి పూర్తిగా ఎండిపోయింది. వర్షాలు కురిస్తే ఆముదాలు వేస్తానని దుక్కి దున్నాడు. వరణుడు కరుణించలేదు. విత్తనాలు వేయలేదు. ప్రస్తుతం గ్రామంలో పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఇే విధంగా ఉంది.

రోజు పది మోటర్లు కాలిపోతై: మర్యాల సంజీవడ్డి, మెకానిక్మా ఉర్లో ఓల్టేజ్ వల్ల రోజూ సుమారు 10 మోటర్లు కాలిపోతుంటాయి. గ్రామంలో ముగ్గురం మెకానిక్‌లం ఉన్నం. మాకు పని భారం ఉండడంతో సగం మంది రైతులు మోటర్లు రిపేరు చేయించుకునేందుకు హుస్నాబాద్‌కు వెళ్తారు. నాకున్న 30 గుంట భూమిలో వ్యవసాయం చేసేందుకు 6బోర్లు వేసిన. చుక్క నీరు రాకపోవడంతో వ్యవసాయం వదిలి రిపేరు నేర్చుకున్నా.

ఇది శానాడ్డి విషాదం!హైదరాబాద్: ఆయన పేరు కందుకూరు శానాడ్డి! ఉండేది నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం సుబ్బాడ్డిగూడెం. సరిగ్గా ఏడాది క్రి తం స్వాతంవూత్యదినోత్సవం నాడు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి.. అర్ధరావూతిపూట కరెంటు షాక్‌కు గురై జీవచ్ఛవంలా మారాడు. పంట తడిపే ప్ర యత్నంలో తాను ఎలా బలైందీ ఆయన నమస్తే తెలంగాణకు వివరించారు. ఆయన మాటల్లోనే.... తెల్లారితే పంద్రాగస్టు. దేశానికి పండగే కానీ మాకు ప్రత్యేకం ఏమీ లేదు. రోజులానే ఆ రాత్రి కూడా వరి పొలానికి నీరు పెట్టడం కోసం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో బ్యాటరీ తీసుకొని మూసీ ఒడ్డున ఉన్న బోరుబావి వద్దకు వెళ్లా ను.

ఇలా మా ఊళ్లో దాదాపు 100 మంది రైతులు అర్ధరాత్రి పూటే పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళతారు. పొలం దగ్గర మోటర్ వేయడానికి స్టార్టర్ బటన్ వత్తినా మోటరు నడవడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌పైన ఫీజు పోయిందేమోనని అక్కడికి వెళ్లా ను. తెల్లవారే వరకు ఆగితే కరెంటు పోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం జరిగిందో చూద్దామని చీకట్లోనే బ్యాటరీలైట్‌ను ట్రాన్స్‌ఫార్మర్‌పైకి వేసి చూశాను. పైన ఎడ్జిఫీజ్ కొట్టేసింది. ఇది విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తే ఎగిరిపో యే ఫీజు. ఫీజు ఒక్కటే వేద్దామనుకుని ట్రాన్స్‌ఫార్మర్ బంద్ చేసిన. పక్కన ఉన్న మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా బంద్ చేసిన. బ్యాటరీలైట్ వేసి చూస్తే పత్తీలు ఊడినట్లు కనిపించింది. ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఫీజు వేద్దామని ఊడపీకితే కదలలేదు. ఒక్కదానికి రెండు ఫీజులు ఉంటాయి.

మరొకటి ఊడపీకి ఫీజు వేద్దామనుకుంటే ముట్టుకున్న పత్తి ఊడకపోగా కరెంటు సరఫరా అయి విసిరేసింది. అంతే పక్కనే మరో ట్రాన్స్‌పార్మర్‌కు తగిలి కింద పడ్డా. మాడిపోయిన అనుకున్న. తరువాత ఏమీ గుర్తులేదు. గంట తర్వాత సోయి వచ్చింది. బోర్లా పడి ఉన్న. లేద్దామని చూస్తే కదల్లేపోయిన. జేబులో సెల్‌ఫోన్ ఉంది. ముందుగా మా బామ్మర్దికి ఫోన్ చేసి విషయం చెప్పిన. మిర్యాలగూడ ఆసుపవూతికి తీసుకు డాక్టర్లు చేర్చుకోలేదు. హైదరాబాద్‌లో ఏడాది కాలంగా చికిత్స చేయించుకున్నా. ఇప్పటి వరకు రూ.11 లక్షలు ఖర్చు అయింది. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేస్తే లక్షన్నర వచ్చింది. పొలం పోయిన ఏడాది అంతా ఆగమైంది. లాభం లేదని కౌలుకు ఇచ్చాను. నా భర్యకు పూర్తిగా నాకు పని చేసి పెట్టడానికే సమయం సరిపోవడం లేదు. లేచి నిలబడలేను, కూర్చోలేను.. 48 ఏళ్లకే చక్రాల కుర్చీలో పడ్డాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి