మనుషుల్ని ప్రేమించడం మానవత్వం. మట్టిని
ప్రేమించడం మహోన్నత జీవన తత్వం. తెలంగాణ జీవితాల్ని లోతుగా ఆధ్యయనం
చేస్తే.. మట్టిని ప్రేమిస్తూ, మనుషుల కోసం పరితపిస్తూ, నవీన సమాజ నిర్మాణం
కోసం మానవీయ విలువల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన త్యాగధనుల వారసత్వాన్ని
అందిపుచ్చుకొని ముందుకు సాగే వీరులు ప్రతి తరుణంలోనూ మనకు కనిపిస్తారు.
జీవన సంఘర్షణల్లోంచి మొలకెత్తి, మొగ్గ తొడిగిన భావాలకు కార్యాచరణ నిచ్చి,
ఆయా కాలాల్లో సాగించిన పోరాటాల స్ఫూర్తి, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా
సాగించే ఉద్యమాలకు చోదకశక్తిగా పనిచేస్తున్నది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం
నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు సాగుతున్న పోరుబిడ్డల త్యాగాలకు
కారణం ఒక్కటే! నేల తల్లి విముక్తి కల సాకారం కావాలని. పరపీడన లేని
స్వయంపాలన సాధించాలని ఆత్మగౌరవ పెనుగులాటలో తుది విజయం అందుకోవాలని.
తెలంగాణ ఉద్యమ తీరుతెన్నుల్ని విశ్లేషించినప్పుడల్లా కాళోజీ మాటలను మననం
చేసుకోక తప్పని స్థితి. ప్రాంతేతరుల కంటే ప్రాంతం వారి ద్రోహం వల్లే
తెలంగాణ కల కల్లగా మిగిలిన వాస్తవాన్ని కళ్ళారా చూశాము. ప్రకటించిన తెలంగాణ
వెనక్కు తీసుకోవడంలో సీమాంధ్ర పార్టీలు, నాయకులు అన్ని తగాదాలను పక్కన
పెట్టి ఒక్క తాటిపై నిలిచి, వాళ్ళ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను
కాపాడుకున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలు సీమాంధ్ర నేతలకు
ఊడిగం చేస్తూ, మన యువకులు, విద్యార్థుల బలిదానాలను పరిహాసం చేస్తున్నారు.
దశాబ్దాల పోరాట ఫలితాన్ని నిష్ప్రయోజనం చేశారు. ప్రజల ఆకాంక్షల కంటే పదవులే
ముఖ్యమ య్యాయి. సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిలిచి,
చారివూతక పోరాటాన్ని జరుపితే, రాజకీయ నేతలు నమ్మక ద్రోహం చేశారు. కేంద్రం
మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకోనేదాకా తెలంగాణ నినాదాన్ని
తలకెత్తుకోవాల్సిందిపోయి, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే తెలంగాణ జపం చేసే
ఆత్మాభిమానం లేని రాజకీయనేతలయ్యారు. అందుకే వీరిని ప్రాంతంలోనే
పాతిపెట్టాల్సిన అవసరాన్ని కాళోజీ ఆనాడే చెప్పారు.
పతాక స్థాయికి చేరిన ఉద్యమాన్ని పాతాళానికి నెట్టాలన్న కుట్రకు సూత్రధారులు ఎవరు? మనకంటిని మన వేలితో పొడవాలన్న పథక రచనకు తోడ్పడుతున్న పాత్రధారులు ఎవరు? ఎంగిలి మెతుకులకు ఆశపడుతూ, ఉద్యమ నేతలపై విషం చిమ్ముతూ, ద్రోహానికి పాలుపడుతున్న వారిని ఏం చేయాలి? ఏ రాజకీయ పార్టీల ఎజెండాలను, ఎత్తుగడలను ఏ దృష్టితో చూడాలి? ఎవరి పదవీ త్యాగాల వల్ల ప్రస్తుత ఎన్నికలు వచ్చాయి? ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? ఎలా తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలి? తెరాస అభ్యర్థులు ఓడిపోతే తెలంగాణవాదం వీగిపోయిందని చేసే ప్రచారానికి గెలుపు అస్త్రంతో ఎలా చావుదెబ్బ కొట్టాలి? పదవీ త్యాగాలు చేసిన నేతలకు పట్టం ఎలా కట్టాలి?
‘ఇచ్చేదిమేమే, తెచ్చేది మేమే’ అంటూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణను ఇవ్వలేకపోవడం వల్ల ఎందరో తెలంగాణ ముద్దుబిడ్డలు బలిపీఠం మెక్కారు. ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మూటకట్టుకోక తప్పతుందా? తెలంగాణను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అన్ని రకాల వివక్షలు , దోపిడీలు, ఒప్పందాల ఉల్లంఘనలు అన్నింటికీ కాంగ్రెస్ పార్టీ బాధ్యురాలిగా నిలిచింది. 1969 నుంచి.. నేటి మలిదశ ఉద్యమం దాకా ఒక ప్రాంత ప్రజలు జీవన్మరణ సమస్యగా భావించి ఉద్యమిస్తుంటే, వారి న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చలేని కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఓటు అడిగే నైతిక హక్కు ఉందా?
కాంగ్రెస్ తర్వాత రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ. ఈ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంతాకాదు. చంద్రబాబు హయాంలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడమే నేరం అయింది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు సీట్ల కోసమే అవసరం కానీ, వారికో ఆత్మగౌరవం ఉంటుందని కానీ, వారి ప్రాంతాన్ని అభివృద్ధి పరచాల్చిన బాధ్యత ఉంటుందని కానీ ఏనాడు గుర్తించిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రజల జీవన విధ్వంసానికి ప్రధాన కారకుడు చంద్రబాబు. ఒకనాడు సిరులపంట పండించిన ఇక్కడి పరిక్షిశమలనెన్నింటినో మూసివేసి, ఆ భూములను రియల్టర్స్‌కు అప్పజెప్పి, కార్మికులను రోడ్డుపాలు చేశాడు. వ్యవసాయం దండగంటూ, రైతులను ఏమాత్రం ఆదుకోకుండా, తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. విద్యుత్తు చార్జిలు తగ్గించమంటూ ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపించి, నిండువూపాణాలు బలిగొన్న నరరూప రాక్షసుడు. హైటెక్ పాలనపై ఉన్న మోజుతో తాను ‘సీఎంగాకంటే సీఇవోగా గుర్తించబడాటాన్నే గర్వంగా భావిస్తాన’ని ప్రకటించిన పక్కా వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తి చంద్రబాబు. సమాజ శాస్త్రాల ఆధ్యయనం అవసరమే లేదని, విద్యను ప్రైవేటు పరం చేసి ప్రభుత్వ భారాన్ని దించుకోవాలని ప్రయత్నించిన అమానవీయ లక్షణాలతో పక్కా కార్పొరేట్ భావజాలం కలిగిన వాడు బాబు. బూటకపు ఎన్‌కౌంటర్లతో తెలంగాణలో నెత్తుటి ఏరులు పారించిన పాశవికుడు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డిసెంబర్9, 2009లో కేంద్రం ప్రకటించిన తెలంగాణను తెల్లారేలోగా మాయం చేసిన మాయల మాంత్రికుడు. చంద్రబాబు తెలంగాణ ద్రోహుల్లో అగ్రభాగాన నిలిచి రేపటి తెలంగాణ చరివూత పాఠాల్లో శాశ్వత ద్రోహిగా చిరస్థాయిగా నిలిచిపోతాడు. ‘రెండు కళ్ళ సిద్ధాంతి’ అన్న బిరుదును పొందిన అత్యంత వివాదాస్పద నేత చంద్రబాబు. తన నయవంచక విధానాలతో, యావత్ తెలంగాణ సమాజం ఆయన్ని వెలివేసిన సందర్భంలో, మోత్కుపల్లి లాంటి వారితో ఉద్యమంపై, ఉద్యమ నేతలపై విషాన్ని కక్కిస్తూ, కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లోనే కాదు, ప్రతి ఎన్నికల్లోను టీడీపీని చావుదెబ్బ కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరిదీ.
ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ప్రత్యేక పరిస్థితి. ఇక్కడి శాసన సభ్యుడు రాజేశ్వరరావు మరణించడం వల్ల ఖాళీ ఏర్పడ్డ స్థానంలో తెరాస తన అభ్యర్థిగా సయ్యద్ ఇబ్రహీంను నిలబెట్టగా, బీజేపీ ఇందుకు పోటీగా తెరాస నుంచి బహిష్కరించిన శ్రీనివాసడ్డిని పోటీలో నిలిపింది. వాస్తవానికి గతంలో ఈ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి, గెలవాల్సిన వ్యక్తి అయన. మహాకూటమిలోని టీడీపీ చేసిన మోసానికి, స్వల్పమైన తేడాతో ఓడిపోయారు. న్యాయంగా మళ్ళీ అతనికి అవకాశం కల్పించవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమ నేతలపైన ఉన్నది. ఏ నైతిక హక్కుతో బీజేపీ ఇక్కడ పోటీ అభ్యర్థిని నిలిపిందో తెలపాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులకు ఉన్నది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సాధించిన ఓట్లు కేవలం రెండు వేలు మాత్రమే. ఈ స్థానం నుంచి తెరాస తన అభ్యర్థిగా సయ్యద్ ఇబ్రహీంను నిలబెట్టడంలో సహేతుకతతోపాటు స్పష్టమైన వైఖరిని కూడా కలిగి ఉన్నది.
దశాబ్దాల నుంచి తెలంగాణలో హిందువులు, ముస్లింలు సాంస్కృతిక సహజీవనం జమిలిగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ముస్లిం సమాజం సర్వతోముఖ వికాసం పొందగలదన్న విశ్వాసాన్ని తెలంగాణ వాదులంతా వీరికి కల్పించిన సందర్భం ఇది. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఉప ముఖ్యమం త్రి పదవి, రెండు క్యాబినెట్ మంత్రి పదవులు ఇస్తామని తెరాస విధాన పరంగా కూడా ప్రకటించింది. ఇవి ఏవి కూడా ఎన్నికల సందర్భంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశాలు కావు. తెలంగాణ సమాజంలో రెండవ స్థానంలో ఉన్న ముస్లింల అభివృద్ధిని మరిచి తెలంగాణను అభివృద్ధి పర్చడమనేది సత్య దూరమైన విషయం.
ముస్లింలే కాకుండా ఇతర కులాలు కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రం అవతరించాలన్నది తెరాస లక్ష్యం. అందుకే అవకా శం ఉన్న చోట ముస్లిం అభ్యర్థిని తెరాస నిలబెట్టింది. అక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. బీజేపీని ఈ సందర్భంగా తెలంగాణ సమాజం కొన్ని ప్రశ్నలు అడగవలసిన అవసరం ఉన్నది.
నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్‌ను మాయావతి అయిదు రాష్ట్రాలుగా విభజించే ప్రతిపాదనను బీజేపీ ఎందుకు వ్యతిరేకించింది. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఎండల లక్ష్మీనారాయణ పై తెరాస అభ్యర్థిని నిలబడితే ఏమై ఉండేది. అప్పుడు కూడా తెరాస గెలువగలిగిన స్థితిలోనే ఉన్నది. కానీ నైతికతకు కట్టుబడి ఆయన గెలుపు కోసం సంపూర్ణ సహకారం అందించింది. ముస్లింలు తెరాస అప్పీలును మన్నించి బీజేపీకి ఓటు వేయడమో లేదా ఏ పార్టీకీ వేయకుండా తటస్థంగా ఉండి సహకరించారు. మహబూబ్‌నగర్‌లో తెరాస అభ్యర్థిపై ఎందుకు పోటీ పెట్టారు? ఇది తెరాస సీటు కాదని చెప్పే ప్రయత్నం చేసినా, గత ఎన్నికల విశ్లేషణను, గెలుపు అవకాశాలనూ, పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదా? జేఏసీలో భాగస్వామ్య పార్టీలైన టీఆర్‌ఎస్,బీజేపీ మధ్య పోటీని తెలంగాణ సమాజం ఏ దృష్టితో చూస్తున్నది. ఈ పోటీ శత్రువుకు ఎంతో కొంత అవకాశం ఇచ్చినట్లు కాదా? తెరాస ఎన్నికలను ఉద్యమంలో ఓ ఎత్తుగడలాగానే భావిస్తున్నది తప్ప పదవులను పట్టుకొని పాకులాడడం ఏనాడు చేయలేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తెలంగాణ సిద్ధించదన్న ఆవేదనతో, ఆందోళనతో, తెలంగాణ ప్రజలందరిని ఉద్యమ స్ఫూర్తిని కార్యోణ్ముఖుల్ని చేస్తోంది.అలాగే.. త్యాగాలకు సిద్ధపడ్డ యాదయ్య, వేణుగోపాల్‌డ్డి, ఆదిడ్డిలకు ఏమతం రంగుపులుముదాం! దీనికి బీజేపీ సమాధానం చెప్పాలె.
తెరాస ఆవిర్భావమే త్యాగాల పునాదులపై నిర్మితమైనది. దాని గతి, గమనం కూడా నిప్పుల గుండాలను దాటుతూ, నిత్యపరీక్షలకు నిలబడుతూ, అగ్నిపునీతమై అంతిమ విజయం వైపు అడుగు లేస్తున్న అలుపెరుగని ఆత్మవిశ్వాసపు పయనం. కేసీఆర్ మొదటి నుంచీ చెప్పుత్నుట్లు రాజకీయ ప్రక్రియ ద్వారానే రాష్ట్రం సిద్ధిస్తుందనేది తెరాస విశ్వాసం. తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ ఏకమైన నాడే తెలంగాణ సాధ్యమౌతుంది. కానీ దురదృష్టమేమిటంటే మొదటినుంచి ప్రజలంతా ఏకమవుతుంటే పార్టీలన్నీ స్వప్రయోజనాలే లక్ష్యంగా విభజితమవుతున్నాయి. పార్టీల మెడలు వంచి ఉద్యమంలో భాగస్వాములయ్యేలా వారిపై ఒత్తిడిని పెంచాలి. లేనిచో త్యాగాలు ఒకరివి, భోగాలు ఒకరివిగా మిగిలిపోతాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి సీమాంవూధుల గుండెల్లో గెలుపు నగారా మోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రజల విజ్ఞతకు ఇది పరీక్షా సమయం. తెరాస అభ్యర్థులను గెలిపించుకోవడం ఉద్యమ ఆవశ్యకత. ఎక్కువ కాలం అధికారంలో ఉండి అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయక ఇక్కడి వాళ్ళను వలసకూలీలుగా మిగిల్చి, తెలంగాణకు అడ్డు పడుతున్న ఇంటిదొంగలైన కాంగ్రెస్, టీడీపీతో పాటు కుల,మత సమీకరణలతో ఉద్యమాన్ని అస్థిర పరచే కుట్రతో ఉన్న బీజేపీని కూడా నిర్దంద్వంగా తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కవులు, కళాకారులు, బుద్ధిజీవులు తెలంగాణ వాదానికి బలమైన పునాది వేస్తే, రాష్ట్ర ఏర్పాటు ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ మంది యువకులు విద్యార్థులు ప్రాణ త్యాగాలకు ఒడిగడుతుంటే మనం ఇంకా చూస్తూ ఉందామా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, మట్టిరుణం తీర్చుకోకుండా ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్న నేతలను, పార్టీలను పట్టిఈ మట్టిలో పాతరేయాల్సిన సమయం వచ్చింది . వీరిపై పెరుగుతున్న కసిని కాగడాలుగా మార్చుకొని కదనరంగాన దూకి కర్తవ్యాన్ని భూజాలకెత్తుకొనే సందర్భం ఇది. అంతిమ విజయం అందుకోనే వరకు అందరమొక్కటై అడుగులు కలుపాల్సిన సమ యం. తెలంగాణ తల్లి విముక్తి కోసం నేలకొరిగిన ఎందరో ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డల బలిదానాలకు బదులు తీర్చుకుందాం. రణంలో మరణాన్ని పరిహసించిన పోరాట యోధుల నెత్తుటి త్యాగాల రుణం తీర్చుకుందాం!
courtesy with namasthe telangana

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి