టీవీ 9కు ఈసీ నోటీసులు
- రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలి
- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
హైదరాబాద్, మార్చి 15 (టీ న్యూస్): ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీవీ 9
న్యూస్ చానల్ బుధవారం ప్రజల అభివూపాయాలను ప్రసారం చేసినందుకు రాష్ట్ర
ఎన్నికల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. రెండు రోజులలో ఈ నోటీసులకు
సమాధానం ఇవ్వాలని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ టీ
న్యూస్‌కు చెప్పారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా టీవీ 9 చానల్‌కు ఈ
నోటీసులను పంపించినట్లు ఆయన వివరించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఎవరు
ప్రవర్తించినా చర్యలు తప్పవని భన్వర్‌లాల్ అన్నారు. సాక్షి చానల్ వాహనాల
ద్వారా డబ్బు పంపణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై
విచారణ చేయాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
అదే విధంగా టీ న్యూస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వార్తలు
ప్రసారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై విచారణ
చేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామని భన్వర్‌లాల్
పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి