25, మార్చి 2012, ఆదివారం

తెలంగాణ కోసం మరో ..ఆత్మబలిదానం



వరంగల్‌లో ఎంబీఏ విద్యార్థి బోజ్యానయక్ ఆత్మహత్య .ఒంటిపై పెట్రోల్ పోసుకొని ..ఎంజీఎం ఆస్పత్రిలో తనువు చాలించి.. పలు ప్రశ్నలు మిగిల్చి..


 Bhojaya01 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

ఏక శిలగా నగరం
‘అందరూ వత్తాండ్లు. పోతాండ్లు కని తెలంగాణ ఇస్తలేరు. ఇంకెప్పుడిస్తరు? మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అందరు గెలిచారు. అందరూ గెలిచినా కూడా కూడా కాంగ్రెస్ నాయకులు గండ్ర వెంకటమరణారెడ్డి ఇంకొంతమంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. నేను డిగ్రీ చేసిన.. పీజీ చేస్తున్న.. అందరు గిట్లనే అంటరు. నాకు ఉద్యోగం వత్తలేదు. తెలంగాణ వత్తలేదు. అందరు గిట్లనే అంటే తెలంగాణ ఎవ్వలు తెత్తరు. నేను తెలంగాణ కోసమే పెట్రోలు పోసుకున్న. మల్ల సచ్చిపోత’
ఎంజీఎం ఆస్పత్రిలో భోజ్యానాయక్

పెద్దపెట్టున కేకలు వేస్తూ చేప్పిన మాటలు
గండ్ర వ్యాఖ్యలతో మనస్తాపం..

ఇంకెప్పుడిస్తరు తెలంగాణ?
ఆస్పత్రిలో భోజ్యా నాయక్ ప్రశ్న
చికిత్స చేస్తుండగానే కన్నుమూత
ఎంజీఎం వద్ద గండ్రపై నిప్పులు చెరిగిన నేతలు
నేడు వరంగల్ బంద్‌కు జేఏసీ పిలుపు
తెలంగాణ బంద్‌కు కేయూ జాక్..


ఎంజీఎం సెంటర్‌లో విద్యార్థుల ధర్నా
తెలంగాణ ఉద్యమంలో తొలి బలిదానం శ్రీకాంతాచారిని గుర్తు చేస్తూ.. ఉస్మానియా వర్సిటీలో కాలిపోయిన యాదయ్యను యాదికిదెస్తూ.. తెలంగాణ ఉద్యమంలో ఇది మరో మరణవాంగ్మూలం! మండుటెండలో నడిరోడ్డుపై నడిచిన అగ్నిపర్వతం! అగ్నికీలలు ఒంటిని దహించి వేస్తుండగా.. గొంతు చించుకుని చేసిన నినాదం! వియ్ వాంట్ తెలంగాణ! తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడదామని సమస్త ఉద్యమం పోరుబాట చూపుతున్నా.. నిన్నటికి నిన్న ఉప సమరంలో జనాకాంక్ష ఉద్యమానికి కొత్త ఉత్సాహం కల్గించినా.. అసలైన పోరుమార్గం ఏమిటో తేల్చి చెప్పినా.. ఓ నేత కలుషిత వ్యాఖ్య ఆ చిన్నారి మనసును ఛిద్రం చేసింది! తెలంగాణవాదం తగ్గిపోయిందంటూ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్య.. నూనూగు మీసాల వయసులోనే నిండు నూరేళ్లు నింపుకొనే తీవ్ర నిర్ణయానికి పురికొల్పింది! ఓ విద్యార్థి భవిష్యత్తును బుగ్గి చేసింది! మరో అమ్మకు కడుపుశోకం మిగిల్చింది! రాజకీయ నేతల ద్రోహానికి గుండె మండి.. పెట్రోలు పోసుకుని ఒళ్లు కాల్చుకున్న ఆ విద్యార్థి.. మరణశయ్యపై నుంచి వేసిన చివరి ప్రశ్న.. ఇంకెప్పుడిస్తరు తెలంగాణ?

(వరంగల్, టీ న్యూస్ ప్రతినిధి):మండే ఎండ... వరంగల్ కలెక్టర్ బంగ్లా ఎదురుగా.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం పక్కన.. ఓ విద్యార్థి మంటలో కాలుతూ ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ..’ అంటూ దిక్కులుపిక్కటిల్లేలా నినదిస్తూ పరుగుపెట్టాడు! కింద పడిపోయిన ఆ విద్యార్థి దగ్గరకు పోలీసులు వెళ్లి ‘ఎవరు నువ్వు.. ఎందుకిలా చేశావు?’ అంటే ‘వియ్ వాంట్ తెలంగాణ’ అంటూ గర్జించాడా విద్యార్థి. తెలంగాణ కోసమే తాను ఆత్మర్పాణ చేసుకుంటున్నానన్నాడు. పట్టపగలు నగర వీధుల్లో అగ్నిపర్వతం కదలినట్లు ఆ విద్యార్థి ఆర్ట్స్ కాలేజీ ముందు జై తెలంగాణ అంటూ పరుగులు పెట్టడాన్ని చూసిన జనం ఒక్కసారిగా నిచ్చేష్టులయ్యారు. వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

మనుషులంతా శిలలుగా మారిపోయినట్టు నిలుచుండి పోయారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణవాదులు జయకేతనం ఎగరేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణపై స్పందించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ విద్యార్థి తన ప్రాణాలనే వదులుకునేందుకు సిద్ధపడటం చూసి అక్కడున్న వాళ్లంతా బాధాతప్త హృదయంతో చలించిపోయారు. మండుతున్న ఎండల్లో అగ్గిని కౌగిలించుకున్న ఆ విద్యార్థి ఎంజీఎంలో చేరిన మూడు గంటలకే బలయ్యాడు. గండ్ర వెంకట రమణాడ్డి చేసిన వ్యాఖ్యలకు మనస్తాపానికి గురయ్యే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ భోజ్యానాయక్ తల్లిదంవూడులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Jai02 talangana patrika telangana culture telangana politics telangana cinema
గండ్రపై కేసు పెట్టాలని కోరారు. కాగా ఈ ఘటనపై పోలీసులు 174 సెక్షన్‌కింద కేసు నమోదు చేశారు. భోజ్యా మరణంతో ఉద్యమక్షిశేణులు ఆగ్రహోదక్షిగులయ్యాయి. గండ్ర దిష్టబొమ్మను దహనం చేశాయి. ఆదివారం నాడు వరంగల్‌బంద్‌కు రాజకీయ జేఏసీ, తెలంగాణ బంద్‌కు కేయూ జేఏసీ పిలుపునిచ్చాయి. భోజ్యా మరణానికి కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని పలువురు టీఆర్‌ఎస్ నేతలు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు దుర్మార్గంగా చేస్తున్న వ్యాఖ్యల కారణంగా తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో కలిసిరాకపోయినా ఫర్వాలేదు గానీ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని రెండు పార్టీల నేతలకు సూచిస్తున్నారు.

రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామం శివారు వీఆర్(వీర్ల) తండాకు చెందిన లూనావతు భోజ్యానాయక్ (21) 2010-11లో తుషారా కాలేజీలో 63 శాతంతో డిగ్రీ ఉత్తీర్ణుడై, హన్మకొండలోని న్యూసైన్స్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. తండ్రి నామానాయక్, తల్లి మంగ్తి. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి శనివారం మధ్యాహ్నం ఆడిటోరియం వెనుకకు వెళ్లి.. అప్పటికే టిన్నులో తెచ్చుకున్న పెట్రోలును మీద చల్లుకున్నాడు. రోడ్డుమీదికి (202 జాతీయ రహదారి, కలెక్టర్ బంగ్లాకు అతి సమీపంలో (రోడ్డుకు అవతలివైపు)కి వచ్చి అంటుబెట్టుకున్నాడు. జై తెలంగాణ అంటూ రోడ్డు పొడవున పరుగుపెడుతూ నినాదాలు చేశాడు.

మంటలు ఎగసిపడుతున్నా తెలంగాణ నినాదాలు చేస్తుండగా పలువురు రోడ్డుపై నడుస్తున్న వారు అక్కడే స్థాణువులైపోయారు! కొద్ది దూరంలోనే ఫిల్డ్ అసిస్టెంట్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా భోజ్యానాయక్ మంటల్లో కాలిపోతుండటం చూసి పరుగున వచ్చారు. అప్పటికే ఆ విద్యార్థి నేలపై పడిపోయాడు. పోలీసులు వచ్చి ఆ విద్యార్థితో మాట్లాడారు. అన్ని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే 10 వాహనంలో ఎంజీఎం ఆస్పవూతికి తరలించారు. ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఆర్ట్ ఆండ్ సైన్స్ కళాశాలలో ఆడిటోరియం వెనుక కాస్తంత పెట్రోలు మిగిలిన ప్లాస్టిక్ టిన్ను దొరికింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుకు ఆవలివైపున కొందరు ప్రత్యక్ష సాక్షులు చూశారు. పండ్లు తింటుండగా, వాహనాల మీద వెళుతున్న వారు అక్కడే ఆగిపోయారు.

ఇంకెప్పుడిస్తరు?
ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆస్పవూతికి తరలించిన సందర్భంలోనూ భోజ్యానాయక్ తన తెలంగాణ వాంఛను స్పష్టం చేశాడు. అంత కాలిన గాయాలతో ఉండి కూడా ‘‘అందరూ వత్తాండ్లు. పోతాండ్లు.. కానీ తెలంగాణ ఇస్తలేరు. ఇంకెప్పుడిస్తరు? మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అందరూ గెలిచారు. అందరూ గెలిచినా కూడా కాంగ్రెస్ నాయకులు గండ్ర వెంకటమరణాడ్డి ఇంకొంతమంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. నేను డిగ్రీ చేసిన. పీజీ చేస్తున్న. అందరు గిట్లనే అంటరు. నాకు ఉద్యోగం వత్తలేదు. తెలంగాణ వత్తలేదు. అందరు గిట్లనే అంటే తెలంగాణ ఎవ్వలు తెత్తరు? నేను తెలంగాణ కోసమే పెట్రోలు పోసుకున్న. మల్ల సచ్చిపోత’ అంటూ భోజ్యానాయక్ ఎంజీఎం ఆస్పవూతిలో పెద్దపెట్టున కేకలు వేశాడు.
TRS talangana patrika telangana culture telangana politics telangana cinema
తీవ్ర ప్రయత్నం-అయినా దక్కని ప్రాణం
92 శాతం కాలిన గాయాలతో ఉన్న భోజ్యానాయక్‌ను ఎంజీఎంకు తరలిస్తే వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మొదట ఆ విద్యార్థిని హైదరాబాద్ అపోలో ఆస్పవూతికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయభాస్కర్, జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి తదితరులు వైద్యులతో చర్చిస్తే ‘పేషంట్ కండిషన్ చాలా విషమంగా ఉంది. కనీసం 3 నుంచి 4 గంటల దాకా ప్లూయెడ్స్ ఎక్కించాలని వైద్యులు చెప్పారు. చికిత్స చేస్తుండగానే రాత్రి .30 ప్రాంతంలో భోజ్యానాయక్ తుదిశ్వాస విడిచాడు.

ఎంజీఎంకు తరలిన తెలంగాణవాదులు
భోజ్యానాయక్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడనే వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఎంజీఎం ఆస్పవూతికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, దాస్యం వినయభాస్కర్, జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, నాయకులు కన్నెబోయిన రాజయ్యయాదవ్, జిల్లా రాజకీయ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాంనాయక్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టీ రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు దొంతి దేవేందర్‌డ్డి, న్యూడెమోక్షికసీ నాయకుడు నున్న అప్పారావు, కేయూ విద్యార్థి జాక్ చైర్మన్ సాదు రాజేశ్, విద్యార్థి నాయకులు వలీ ఉల్లా ఖాద్రీ, జోరిక రమేష్, టీజీఏ నాయకులు మర్రి యాదవడ్డి తదితరులు హుటాహుటిన ఎంజీఎంకు తరలివచ్చారు.

బట్టలు కొనుక్కుంటనని డబ్బులు తెచ్చుకుండు
‘‘మా అన్న పొద్దున్నే రోజు వచ్చినట్టు ఇయ్యాల సుత కాలేజీకని పది గంటలకు వచ్చిండు. బట్టలు కొనుక్కుంటనని అమ్మ దగ్గర వెయ్యిరూపాయలు తెచ్చుకున్నడు. అవి పెట్రోల్ కోసమే అనుకోలేదు’’ అంటూ భోజ్యానాయక్ తమ్ముడు చాజూనాయక్ కన్నీరుమున్నీరయ్యాడు. తను బాగా చదువుకోవాలని తన అమ్మానాన్న అనుకున్నారని, ఇంతపనిచేస్తడని అనుకోలేదని అతడు భోరున ఏడుస్తూ చెప్పాడు. ‘‘మా అన్న బాగా సదూకుంటడు. ఇద్వరకు హైదరాబాద్‌ల మూడు నెలలు ఎస్‌ఐ ట్రేనింగ్ సుత తీసుకున్నడు. మంచి నౌకరి చేస్తడని అనుకుంటే మమ్ములందరినీ ఇడిసిపెట్టి వెళ్లిపోతాండు’’ అంటూ వెక్కి ఏడుస్తూ చెప్పాడు. అతడిని ఓదార్చడం అక్కడ ఎవరి వల్లా కాలేదు.

నేడు జిల్లా బంద్: వరంగల్ రాజకీయ జేఏసీ పిలుపు
బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసి, భోజ్యానాయక్ ఆత్మహత్యకు కారణమైన గండ్ర వెంకట రమణాడ్డి తీరుకు నిరసనగా ఆదివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు వరంగల్ జిల్లా రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిడ్డి ప్రకటించారు. ఈ బంద్‌కు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వేర్వేరు ప్రకటనల్లో మద్దతు ప్రకటించాయి.

తెలంగాణ బంద్‌కు కేయూ జాక్ పిలుపు
లూనావత్ భోజ్యానాయక్ ఆత్మార్పణకు సంతాపసూచకంగా, గండ్ర వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం తెలంగాణ జిల్లాలు బంద్ పాటించాలని కేయూ జాక్ చైర్మన్ సాదు రాజేష్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎంజీఎం సెంటర్‌లో రాస్తారోకో, గండ్ర దిష్టిబొమ్మ దహనం
భోజ్యానాయక్ ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డిపై కేయూజాక్, టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విప్‌కు నిరసనగా వరంగల్ ఎంజీఎం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించాయి. అనంతరం గండ్ర వెంకటరమణాడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, కేయూ జాక్ చైర్మన్ సాదు రాజేష్, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కన్వీనర్ జోరిక రమేష్, శ్రీరాం శ్యామ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

గండ్రపై హత్యకేసు నమోదు చేయాలి
పోలీసులకు భోజ్యా తల్లిదంవూడుల ఫిర్యాదు

తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణాడ్డి కారణమని భోజ్యానాయక్ తల్లిదంవూడులు ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై హత్య కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి తల్లిదంవూడులు నామానాయక్, మంగ్తీ శనివారం రాత్రి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండ్ర, టీడీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే తమ కుమారుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసి, భోజ్యా మృతికి కారణమైన ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్రపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ట్రైబల్‌జాక్ కన్వీనర్ జైసింగ్ రాథోడ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఖబడ్దార్ సీమాంధ్ర నాయకుల్లారా:
ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నాయకుల్లారా ఖబడ్దార్ అంటూ టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న భోజ్యానాయక్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. సమైక్యవాదుల అనుచిత వ్యాఖ్యలతో ఇప్పటికే 700మంది బిడ్డలు తమవూపాణాలను ఆత్మార్పణం చేశారన్నారు.‘‘తెలంగాణ ఉద్యమం పట్ల అవగాహనలేని మూర్ఖుల కారణంగానే యువత ఆత్మాహుతికి పాల్పడుతున్నది. సీమాంధ్ర నేతల ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న ఆ నేతలు తెలంగాణపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలదే బాధ్యత
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేతలు చేసిన అనవసర వ్యాఖ్యల వల్లే భోజ్యానాయక్ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగే నాయక్ అంత్యక్షికియల్లో పాల్గొంటా.
-టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు

గండ్ర వైఖరి కారణంగానే..
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణడ్డి వ్యాఖ్యలు, వైఖరి కారణంగానే భోజ్యానాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. గండ్రను గ్రామాల్లోకి రానీయొద్దు.
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, జూపల్లి కృష్ణారావు


courtesy:namsthetelangana daily

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి