ఖనిజంపైనా కన్నేశారు! ఈ అంద్రొల్లు !!!!!!!!!! తెలంగాణ దోపిడీకి మరో కుట్ర తెగించి కొట్లాడుతాం -రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం -నాడు వైఎస్ హయాం లీజు రద్దు.. నేడు పచ్చజెండా -సీమాంవూధకు తరలనున్న రూ.40లక్షల కోట్ల సంపద -ఖనిజం ఉన్న చోట స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేయకుండా కుట్ర -అడ్డుకుని తీరుతాం:ప్రతిపక్షాలు
వలస పాలకులు మరో దోపిడీకి తెర లేపారు. తెలంగాణ నిధులు, నీళ్లు, భూములు
కాజేసిన సీమాంధ్ర సర్కారు.. ఈసారి ఖనిజంపై కన్నేసింది. నేల తల్లి ఒడిలో
నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను తరలించేందుకు కొత్త కుట్ర పన్నింది.
అల్లుడికి అప్పనంగా కట్టబె వైఎస్ చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఈసారి
‘అధికారిక’ దందాకు స్కెచ్ గీశారు. ఖమ్మం జిల్లా బయ్యారం గుట్టల్లోని రూ.40
లక్షల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి కట్టబె
కాంగ్రెస్ సర్కారు ఆమోదముద్ర వేసింది. కళ్లు చెదిరే స్థాయిలో ఖనిజ
నిక్షేపాలున్న చోట ఉక్కు పరిక్షిశమ ఏర్పాటు చేయకుండా.. అల్లంత దూరాన ఉన్న
కంపెనీకి తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ
అభివృద్ధిని బొందపెట్టడానికే కంకణం కట్టుకుని పాలకులు ప్రణాళికలు
రచిస్తున్నారు. రాష్ట్రమంతటా గాలించినా దొరకని వేల కోట్ల విలువైన ఖనిజ
సంపదను ఆంధ్రాకు దోచిపెట్టి తెలంగాణ నోట్లో మట్టికొ ఏనాడో పన్నిన కుట్ర
మళ్లీ కొత్త రూపం దాల్చింది.
ఖమ్మం, టీన్యూస్ ప్రతినిధి: ఖమ్మం
జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల పరిధిలోని 55 గ్రామాల్లో
56,690 హెక్టార్ల భూమిలో ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. ఈ ప్రాంతం తెలంగాణకు
అక్షయ పాత్ర వంటిది. ఇక్కడ నిక్షిప్తమైన ఇనుప ఖనిజం విలువ సుమారు ₹.40
లక్షల కోట్ల పైమాటే. 1956లోనే బొగ్గు నిల్వల అన్వేషణలో భాగంగా ఇక్కడ ఇనుప
ఖనిజం ఉన్నట్లు కనుగొన్నారు. కానీ దట్టమైన అడవులు విస్తరించి ఉండడం, ఐర్‌న్
ఓర్‌కు అంతగా డిమాండ్ లేకపోవడంతో తవ్వకాలపై సర్కారు దృష్టి పెట్టలేదు.
దశాబ్దకాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్యంగా ఐర్‌న్ ఓర్‌కు డిమాండ్
పెరగడంతో ఇనుప గుట్టలను మింగేందుకు సీమాంధ్ర పెద్దలు గద్దల్లా ఎదురు
చూస్తూనే ఉన్నారు.
ఫలించని మహా‘మేత’ ప్రయత్నం వైఎస్
రాజశేఖర్‌డ్డి సీఎం హోదాలో తన అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు బయ్యారం ఇనుప
ఖనిజాన్ని అప్పగించేందుకు అన్నివిధాలా ప్రయత్నించారు. చేతులకు మట్టి
అంటకుండా ఇనుమును దోచి పెట్టేందుకు ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ
(ఆంవూధవూపదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను రంగంలోకి దించారు.
56,690 హెక్టార్ల భూమిలోని ఇనుప ఖనిజాన్ని తవ్వేందుకు 2009 ఫిబ్రవరి 24న
వైఎస్ ప్రభుత్వం ఎడాపెడా అనుమతులు జారీ చేసింది. ఈ సంస్థ వెలికి తీసిన ఇనుప
రాయిని వైఎస్ అల్లుడికి చెందిన రక్షణ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు
తరలించాలనేదే అసలు కుట్ర. దీనిపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఇస్సాత్
ఇండవూస్టీస్‌తో కలిసి ₹.500 కోట్ల వ్యయంతో ఖమ్మం జిల్లాలో స్టీల్
ప్లాంట్‌ను నెలకొల్పుతామని, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు
మెరుగుపరుస్తామని మభ్యపెట్టారు.
కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ మోసంపై
రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. తర్వాత కాలంలో వైవెస్ దుర్మరణం చెందడంతో సీఎం
పగ్గాలు చేపట్టిన రోశయ్య 2010 జులై నెలలో ఈ అనుమతులు రద్దు చేశారు. లీజు
రద్దు ప్రక్రియను ఆపేసిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు తవ్వడం మొదలుపెట్టింది.
1/70 గిరిజన చట్టాన్ని సైతం చుట్టంగా మార్చేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి
ఖనిజాన్ని తరలించేందుకు శనివారం సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
కనుమరుగు కానున్న పచ్చదనం
అటవీ ప్రాంతంలో తవ్వకాలకు లీజు ఎలా ఇవ్వాలనే నిబంధనలను సైతం విస్మరిస్తూ
ఊళ్లకు ఊళ్లే తవ్వేసేందుకు సర్కారు కుట్ర పన్నుతోంది. పచ్చదనం ఉట్టిపడే
పల్లెలను కనుమరుగు చేస్తూ నేలతల్లి గుండెల్లో గునపం దింపేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నాయి. బయ్యారం మండల పరిధిలో 21 రెవెన్యూ గ్రామాలున్నాయి. 25,99
హెక్టార్ల భూమి ఉండగా, ,352 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేస్తున్నారు.
13,143 హెక్టార్ల అటవీ భూమి ఉంది. గార్ల మండలంలో 11 రెవెన్యూ
గ్రామాలున్నాయి. 12,775 హెక్టార్ల భూములుండగా అటవీ భూమి ఒక్క హెక్టారు కూడా
లేదని లెక్కలు చెబుతున్నాయి. 6,075 హెక్టార్లల్లో రైతులు సాగు
చేస్తున్నారు. నేలకొండపల్లి మండలంలో 23 రెవెన్యూ గ్రామాలున్నాయి. 1,403
హెక్టార్ల భూమి ఉండగా 13,236 హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు. ఈ లెక్కలను
బట్టి చూస్తే ఈ ప్రాంతమంతా పచ్చటి పంట పొలాలతో ఉన్న విషయం సుస్పష్టం. ఈ
ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే కనీసం నిర్వాసితులకు ఉద్యోగాలైనా
దొరుకుతాయి. కానీ సర్కారు ఇదేదీ పట్టించుకోకుండా బొందల గడ్డగా మార్చేందుకు
ప్రయత్నిస్తోంది.
పరిక్షిశమ ఏర్పాటుకై సీఎంతో మాట్లాడతా: వనమా వెంక డీసీసీ అధ్యక్షుడు
ఇక్కడి ఖనిజ సంపదతో ఇక్కడే ఉక్కు పరిక్షిశమను ఏర్పాటు చేయాలని
ముఖ్యమంవూతిని కోరతా. పరిక్షిశమ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
మెరుగవుతాయి. ఖనిజాన్ని వైజాగ్‌కు తరలించడం వల్ల జరిగే నష్టాన్ని సీఎంకు
వివరిస్తా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి