19, నవంబర్ 2011, శనివారం

ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు;

ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు;
 
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులున్నాయి? ఎప్పుడు వాటిని పూర్తి చేశారు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత సాగవుతోంది? పై ప్రశ్నలకు సమాధానమిచ్చి కృష్ణా, గోదావరి నదుల వినియోగంలో సీమాంవూధులు తెలంగాణ వారిని ఏ విధంగా దోపిడీకి గురిచేస్తున్నారో సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తారని కోరుతున్నాను.
-దుగ్యాల భూమారావు, గోదావరిఖని


neelu-lijalu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకృష్ణా, గోదావరి నదుల వినియోగంలో తెలంగాణ వారిని ఏ విధంగా వలసవాదులు దోపిడీకి గురిచేస్తున్నారన్న విషయం దాదాపు ప్రతి వ్యాసంలో తెలియజేస్తూనే ఉన్నాను. ఇక ప్రాజెక్టుల వివరాలు, కొంత మేరకు ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో 12-9-11, 26-09, 3-10 నాటి వ్యాసాల్లో తెలియజేయడం జరిగింది. క్లుప్తంగా మీరడిగిన సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాను.ఏ ఏ ప్రాజెక్టుల కింద ఎంతెంత ఆయకట్టు సాగవుతోందన్న విషయం మనకు తెలియజేయడానికి ఉన్నది ఒకే ఒక్క ఆధారం. అది ‘సాగునీరు-ఆయకట్టు అభివృద్ధి శాఖ’ వారు ఇచ్చే సమాచారం. అది లోపభూయిష్టంగా ఉందని, రైతులకు నీళ్లవ్వకుండానే ఆయకట్టు అభివృద్ధి చెందిందని తమ ఖాతాలో చూపించుకుంటారని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. ‘కాగ్’ కూడా ఎన్నోసార్లు అక్షింతలు వేసింది.

ప్రభుత్వం వారి ఆర్థిక గణాంక శాఖ (Director, economics and stastics) వారు ప్రతిసంవత్సరం విడుదల చేసే రిపోర్టులుంటాయి. అందులో కాలువలకింద, చెరువుల కింద, బావుల కింద, ఇంకా ఇతర మార్గాల ద్వారా ఎంత భూమి సాగవుతున్నది అన్న విషయం ఉంటుంది. అది జిల్లాల వారీగా కూడా ఉంటుంది. అందులో ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలు ఉండవు. కాబట్టి మనకు ఇష్టమున్నా లేకపోయినా, సమాచారం తప్పు అని తెలిసినా మనం సాగునీటిశాఖ డేటాపై ఆధారపడాలి.
‘సాగునీటి శాఖ’ వారు జూన్ 2010లో ఒక పుస్తకాన్ని వెలువరించారు. అది ‘ప్రజల’ కోసం కాదు. ఆంతరంగిక సమాచారం లాంటిది. ‘శ్రీకృష్ణ కమిటీ’ కోసం తయారు చేశారు. అందులో పొందుపరిచిన విషయాలు అసంబద్ధంగా, అవాస్తవంగా ఉన్నాయని విమర్శకులు చెప్పారు. కాని ‘నిజంగా’ ఉపసంహరించుకున్నారా అన్నది అనుమానమే.

2525-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘శ్రీకృష్ణ కమిటీ’ వారు ప్రచురించిన డేటా చూస్తే ఆ విషయం బహిర్గతమవుతుంది. ‘కమిటీ’ ఉపయోగించుకున్నది ‘సాగునీటి’ శాఖ వారు పంపిన సమాచారమే. ‘సాగునీటి శాఖ’ వారి డేటా అనుసరించి ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం అవతరించక పూర్వం ప్రాంతాల వారీగా భారీ ప్రాజెక్టుల వివరాలు పట్టికలో చూడవచ్చు.

ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం మొత్తంలో 33,25,000 ఎకరాలు సాగవుతుంటే అందులో తెలంగాణ వాటా కేవలం 3,53,000 ఎకరాలు మాత్రమే. అంటే పది శాతం మాత్రమే. ఈ అంకెలు చిన్న తరహా ప్రాజెక్టులు, చిన్న చెరువులు, బావుల కింద వ్యవసాయం, ఇంకా ఇతర భూగర్భ జలాల వినియోగం కాకుండానే. ఇకపోతే రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిద్దాం. (2009-2010 దాకా) ప్రభుత్వం ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది.1956 నుంచి 2004 వరకు (వైఎస్సార్)పగ్గాలు చేపట్టే వరకు, మొదటి పీరియడైతే 2004 నుంచి తర్వాత కార్యక్షికమాలను ‘జల యజ్ఞం’గా పేరు పెట్టి రెండవ పీరియడ్‌గా చూపెడుతోంది.

మొదటి పీరియడ్‌లో ప్రభుత్వం నాగార్జునాసాగర్, కడెం, శ్రీరాంసాగర్ ప్రథమదశ, వంశధార ప్రథమ దశ, సోమశిల, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువ లాంటి భారీ ప్రాజెక్టులు, రాజోలిబండ మళ్లింపు పథకాలను పూర్తి చేయడమే కాక, గోదావరి, ప్రకాశం ఆనకట్టల స్థానంలో బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసింది. మొదటి పీరియడ్‌లో అసంపూర్ణంగా మిగిలిన ప్రాజెక్టులతో పాటు అనేక కొత్త ప్రాజెక్టులను జలయజ్ఞం కార్యక్షికమంలో భాగంగా చేపట్టింది. ‘జల యజ్ఞం’ గురించి మాట్లాడుకోవాలంటే ఒక మహా గ్రంథమే అవుతుంది. దాని గురించి వివరంగా రానున్న వ్యాసాల్లో వివరిస్తాను.

మొదటి పీరియడ్‌లో ప్రారంభించి ‘జలయజ్ఞం’లో కొనసాగుతున్న భారీ ప్రాజెక్టుల్లో తెలంగాణలో జూరాల, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బి, శ్రీరాంసాగర్ ద్వితీయదశ, వరదకాలువ, దేవాదుల వంటివి ఉన్నాయి. ఇక సీమాంధ్ర విషయానికివస్తే పులిచింతల వంశధార రెండవ దశ, తాండవ, ఏలేరు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి వంటివి ఉన్నాయి. మధ్యతరహా ప్రాజెక్టుల గురించి చెప్పాల్సివస్తే చాంతాడంత అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్తు ప్రాజెక్టు కాబట్టి దాన్ని లిస్ట్‌లో చేర్చలేదు.
ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 2010 దాకా భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు స్థిరీకరించిన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ లెక్కలనే శ్రీకృష్ణకమిటీకి పంపి ఓహో-ఇంకేముంది తెలంగాణలో అద్భుతంగా అభివృద్ధి జరిగింది అని రాయించ గలిగింది ఈ ప్రభుత్వం. ఈ లెక్కలు ఎంత దొంగవో ఎంత అబద్దాల పుట్టో ఒక్కో ప్రాజెక్టు వివరాలను విశ్లేషిస్తే గాని అర్థం కాదు. ఉదాహరణకు తెలంగాణ ప్రాజెక్టుల విషయమే తీసుకుందాం. జూరాల ప్రాజెక్టు నిర్ధారిత ఆయకట్టు లక్షా 2వేల ఎకరాలను, రాజోలిబండలో నిర్ధారిత ఆయకట్టు 87 వేల ఎకరాలను లెక్కల్లో చూపెట్టారు.ఇంకా దుర్మార్గమైన విషయమేమంటే శ్రీరాం సాగర్ ద్వితీయ దశ కాలువలే పూర్తి కాలేదు. 2010 నాటికే 1లక్ష 20వేల ఆయకట్టును అభివృద్ధి చేసినట్టుగా రాసేసుకుందీ ప్రభుత్వం. అదేవిధంగా ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టుద్వారా 1లక్ష97 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేసినట్టుగా చూపెట్టింది. ఒక్క ఎకరా నీరు రైతులకందివ్వకుండానే పూర్తి ప్రాజెక్టు అభివృద్ధి(అంటే irrigation potential created)అని రాసుకున్నారు. ఈ విధంగా అంకెల గారడీతో శ్రీకృష్ణకమిటీని బురిడీ కొట్టించి రోజూ మీడియాలో లగడపాటి లాంటి నాయకుల చేత తెలంగాణ అభివృద్ధి మామూలుగానే జరిగిందని కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపడానికి సాయపడిన ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకునేదెట్లా?

15555-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసాగునీటి శాఖవారి అంకెల మాజిక్(majic )గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగని ఆర్థిక గణాంక శాఖ కూడా తక్కువేం తినలేదు. 2007-2008లో ప్రచురించిన డేటాలో తెలంగాణాలో1956-1957 తో పోలిస్తే 23లక్షల 40 వేల ఎకరాలకు కొత్తగా సేద్యం వసతి కల్పించామని చెప్పడం జరిగింది. నిజానికి తెలంగాణలో ప్రభుత్వ నిర్వాకం వల్ల చెరువులు పూడిపోయి కబ్జాలకు గురయి, కాలువల అభివృద్ధి కొంత జరిగినా నికరంగా 6 లక్షల16 వేల ఎకరాల ఆయకట్టును కోల్పోవడం జరిగింది. రైతులు తమ సొంత ఖర్చుతో, శ్రమతో కొత్తగా 29 లక్షల 56 వేల ఎకరాలను సాగులోకి తెచ్చుకున్నారు. చెరువుల మూలంగా జరిగిన నష్టాన్ని కూడా పూడ్చుకొని రైతుల కష్టం మూలంగా తెలంగాణలో 23 లక్షల 40 వేల ఎకరాలు అభివృద్ధి జరిగితే అదంతా తమ ప్రయోజకత్వమే అని టాం టాం చేసుకుంది. తమ ఖాతాలో జమచేసుకుని కేంద్ర ప్రభుత్వానికి దొంగపూక్కలు సమర్పించే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఆ లెక్కల్ని నమ్మి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వాళ్లకే నష్టం అని ఇంకా ఈ విషయంపై నిర్ణయాన్ని సాగదీస్తున్న కేంద్రాన్ని ఏమనాలి? ఈ నీళ్ల దోపిడీని ఆపాలన్నా, వలస వాదుల కుట్రలకు, గారడీలకు బలవుతున్న తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవాలన్నా ప్రత్యేక రాష్ట్రమొక్కటే మార్గం.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి