5, జులై 2011, మంగళవారం

జై భోలో తెలంగాణా





తెలంగాణలో సంబురం! తెలంగాణ జిల్లాల్లో కోలాహలం! వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి బలిదానం దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భాన.. బోనాల ఉత్సాహాల నడుమ ఆకాంక్షలు నెరవేరిన సందర్భం. అసలు పోరు ఇప్పుడే మొదలైంది! జెండాలు పక్కకెళ్లి తెలంగాణ ఎజెండా ముందుకొచ్చింది. పదవులను తృణవూపాయంగా భావించి వీరులైన సమయాన.. రాష్ట్రం ఇస్తారా.. రాజీనామాలు ఆమోదిస్తారా.. అంటూ ఢిల్లీపై సమరం! నాలుగున్నర కోట్ల ప్రజల తరఫున 107 మంది తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఏకకం చేసిన నినాదం.. జై బోలో తెలంగాణ!! ముందెవరు? వెనుక ఎవరు? శషభిషలు లేవు.

త్యాగానికి ఎవరు ముందు ముందుకొస్తారన్నదే ప్రశ్న. అందుకే ‘తర్వాత’ రాజీనామా చేస్తామన్న టీడీపీ టీ ఫోరం నేతలు.. ముందే రాజీనామాలు ఇచ్చేశారు! సమష్టి నిర్ణయానికి కట్టుబడుతూ, దుష్ర్పచారాలు తిప్పి కొడుతూ కాంగ్రెస్ నేతలు బయపూల్లినారు! పోరాటాల పోతురాజులై శివమెత్తారు! వెరసి.. సీమాంధ్ర అసెంబ్లీకి తెలంగాణ రాజీనామా చేసింది! అటు హస్తినలో ఎంపీలు ఎన్ని ఆటంకాలొచ్చినా.. రాజీనామాలు సమర్పించారు. ఇక్కడ అసెంబ్లీని వదిలిన ఉత్సాహం.. ఘనమైన గన్‌పార్క్‌లో పెల్లుబికింది. పరస్పర అభినందనలతో గన్‌పార్క్ తడిసిపోయింది.. ఆటపాటలతో చిందేసింది! సమస్త తెలంగాణవాదం అపూర్వ సన్నివేశాలను తిలకించింది. సమర భేరి మోగించిన తెలంగాణ ప్రతినిధులను చూసి పులకించిపోయింది!! సీమాంధ్ర కుటిల సమైక్యవాదం కలవరపడింది! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ డస్సిపోయారు! కాంగ్రెస్ హైకమాండ్‌కు దిమ్మతిరిగింది!


-గన్‌పార్క్ గర్జించింది
-అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణవాదుల కోలాహలం
-మహిళలతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే కవిత


హైదరాబాద్, జూలై 4: తెలంగాణ అమరవీరుల స్థూపం గన్‌పార్క్ గర్జించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యంగా కదిలిన తెలంగాణ ప్రజావూపతినిధులను చూసి పులకించిపోయింది. త్వరలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లజూస్తానన్న ఆనందంతో అమరవీరుల స్థూపం సగర్వంగా నిలిచింది. కాంగ్రెస్, టీడీపీ ప్రజావూపతినిధుల రాజీనామాల నేపథ్యంలో గన్‌పార్క్ ప్రాంగణం కోలాహలంగా మా రింది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిపోయింది. రాజీనామా చేస్తోన్న నేతలకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా తెలంగాణవాదులు ఇక్కడికి వచ్చా రు.

పదవీ త్యాగాలు చేసిన నేతలకు పూలమాలలతో ఘన సత్కారాలు చేశా రు. రాజీనామా చేసిన నేతలను భూజాలపై ఎత్తుకొని ఊరేగించారు. డప్పు, బ్యాండ్ దరువుల మధ్య తెలంగాణవాదులు ఆనందంతో నృత్యాలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత తెలంగాణవాదులతో కలిసి చిందేశారు. తెలంగాణ రాబోతుందన్న సంతోషంతో డ్యాన్స్ చేసిన మహిళలతో కలిసి ఆమె నర్తించారు. మరోవైపు ప్రభుత్వం కూడా భారీగా భద్రతా దళాలను దించింది. అడుగడుగునా సాయుధలైన పోలీసులు డేగకళ్లతో నిఘా పెట్టారు. అయినా వారిని లెక్క చేయని తెలంగాణవాదులు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద సోమవారం ఉదయం నుంచే సందడి నెలకొంది.

Dance_t రాజీనామాలు చేస్తున్న నేతలకు మద్దతుగా నిలిచేందుకు ఉదయం నుంచి భారీగా తెలంగాణ వాదులు ఇక్కడికి తరలివచ్చారు. తెలంగాణవాదులు, విద్యార్థులు, లాయర్లు, ప్రజాసంఘాలు, కళాకారులు తెలంగాణ కోసం ఏకతాటిపైకి వచ్చిన నేతలకు సంఘీభావం తెలిపారు. రాజీనామాలు చేసి సగర్వంగా తల ఎత్తుకొని బయటకు వచ్చిన నేతలకు ‘జై తెలంగాణ’ నినాదాలతో మద్దతు పలికారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆకాంక్షించారు. దీం తో గన్‌పార్క్ ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రజావూపతినిధులు మొదట గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిం చి.. అనంతరం రాజీనామాలు సమర్పించారు.


సమావేశాలప్పుడే సందడిగా కనిపించే అసెంబ్లీ కూడా తెలంగాణ నేతల రాజీనామాల పర్వంతో కోలాహలంగా మారింది. అసెంబ్లీ ప్రాంగణంలో కూడా జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. ప్రజావూపతినిధుల వెంటపడి మరీ మీడియా ప్రతినిధులు యక్షవూపశ్నలు అడిగినా.. తెలంగాణ తమ లక్ష్యమని, రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మలిదశ పోరాటంలో మరో మలుపునకు తెరతీసిన ఈ ఘట్టంతో గన్‌పార్క్‌కు కొత్త కళ వచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి