23, సెప్టెంబర్ 2012, ఆదివారం

కవాతుకు సై..!


మా రాష్ట్రం మాగ్గావాలంటూ ఇందూరు పోరు బిడ్డలు తెలంగాణ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఆంధ్ర ఆధిపత్యాన్ని హైదరాబాద్ అడ్డాలో తునాతునకలు చేసేందుకు మేము సైతం తెలంగాణ మార్చ్‌కు సిద్ధమేనంటూ పోరుజెండా చేతబూని స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి ఆకాశమంతా చాటబోతున్నారు. ఈ మహత్తర ఉద్యమానికి నిజామాబాద్, బోధన్ వేదికగా నిలువబోతున్నాయి. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరగబోయే తెలంగాణ మార్చ్ మహోద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఆయన ఉద్యమ సహచరులంతా ఆదివారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. కోదండరాం మల్లెపల్లి లక్ష్మయ్య, రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్ తదితర తెలంగాణ ఉద్యమ నేతలు స్వయంగా పాల్గొంటున్న సందర్భంగా నిజామాబాద్, బోధన్‌లలో నిర్వహించతలపెట్టిన తెలంగాణ కవాతులను జిల్లా జేఏసీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

దాంట్లో భాగంగానే ఈ రెండు చోట్ల సబ్బండ వర్గాల ప్రజారాసులను కవాతులో మమేకం చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. నిజామాబాద్‌లో జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, ఉద్యోగ జేఏసీ బాధ్యులు గైనిగంగారాం, అలక కిషన్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కమలాకర్, ఎఫ్‌సీఐ భాస్కర్, విఠల్‌రావ్, ఎ.రవీందర్‌తో పాటు ఇతర సంఘాల ముఖ్య నేతలంతా హైదరాబాద్ మార్చ్‌కు సన్నాహ కవాతులను విజయవంతం చేసేందుకు మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందూరు కవాతులో భుజం భుజం కలిపి స్వరాష్ట్ర ఆకాంక్షను వ్యక్తికరించేందుకు కలిసి రావాలని ఇప్పటికే జిల్లా కేంద్రంలోని అన్ని కుల సంఘాలను కలిసారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా పని చేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీ పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో ప్రత్యేక భేటీలు నిర్వహించారు. నిజామాబాద్ కవాతుకు వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు పాల్గొనబోతున్నారు. అడ్వకేట్లు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నిషియన్‌లు, వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, కార్మికులు ఒక రెండేమిటి అన్ని రంగాలకు చెందిన తెలంగాణ వాదులంతా ఇందూరులో తెలంగాణ ఉద్యమ నినాదం చేయబోతున్నారు. సీమాంధ్ర సర్కారు ఎంత అడ్డుకున్నా ఆగేది లేదంటూ రణ నినాదం చేయనున్నారు. ఇంటికొకరిగా హైదరాబాద్ మార్చ్‌కు వస్తామని బాసచేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రభావితం చేయగలిగిన సెప్టెంబర్ 30 కార్యక్షికమానికి కదులుతామని ఉదయం 10.30 నిమిషాలకు నెహ్రూపార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు ప్రతిజ్ఞ చేసి కవాతులో కదలబోతున్నారు. అక్కడి నుండి వేలాది మందితో మొదలయ్యే కవాతు తెలంగాణ చౌక్‌కు చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు జరిగే బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై కోదండరాం మాట్లాడతారు. అనంతరం జేఏసీ అగ్రనేతలంతా బోధన్‌కు చేరుకుంటారు. తెలంగాణ ఆకాంక్షను ఎవస్టు శిఖరమంత ఎత్తిచూపుతూ బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం 1001 మంది దీక్షబూనబోతున్నారు.

ఈ చారివూతాత్మక ఉద్యమ స్వరూపాన్ని కోదండరాం మనసా రా తెలంగాణ సమాజానికి చాటుతారు. ఇదే సందర్భంగా తెలంగాణ మార్చ్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక కవాతులో ఆయన పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమ స్వరూపాల్లో కొత్తపుంతలు తొక్కుతూ వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్న బోధన్ జేఏసీ నాయకత్వం ఏర్పాట్లలోనే అదే స్ఫూర్తితో పని చేస్తోంది. జేఏసీ చైర్మన్ గోపాల్‌డ్డి నాయకత్వంలో మూడు, నాలుగు రోజులుగా ఉద్యమ శక్తులు కవాతు కసరత్తులో తలమునకైఉన్నాయి. ఫలితంగానే ఆదివారం నాడు బోధన్ కవాతు రికార్డుగా నిలువబోతోంది. 

courtesy:
namasthetelangaana.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి