1, జులై 2012, ఆదివారం

హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ

యె షెహర్ హమారా.. సిర్ప్ హమారా

హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ
తెలంగాణ కష్టజీవి చెమట చుక్క
- నిజాం కాలంలోనే ‘భాగ్య’నగరంగా కీర్తి
- కీలక నిర్మాణాలన్నీ ఆనాటి కాలానివే
- ప్రఖ్యాత కంపెనీలకు నెలవుగా హైదరాబాద్
- దేశంలోనే ఐదవ పెద్దనగరంగా ప్రఖ్యాతి
- దోచుకు తిన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు
- ఉన్న పరిక్షిశమలకు మూతపెట్టిన పాలకులు
- సాగుభూముల్లో రియల్ ఎస్టేట్ దందాలు
- అభివృద్ధి మా దయ అంటూ కలరింగ్
- తోడైన సీమాంధ్ర మీడియా విష కథనాలు
మళ్లీ అదే విష ప్రచారం.. హైదరాబాద్‌పై మళ్లీ మళ్లీ అదే కిరికిరి!! తెలంగాణ ప్రాంత దశాబ్దాల స్వపరిపాలన కల నెరవేరబోతున్న ఆఖరు క్షణాల్లో సైతం.. సీమాంధ్ర నేతల దింపుడు కళ్లం ఆశ! తెలంగాణ ఏర్పాటును వీలైతే మరికాస్త జాప్యం చేయాలనే దుష్టతలంపు! హైదరాబాద్ అందరి సొంతమంటూ అడ్డగోలు వాదన! దీన్ని తామే అభివృద్ధి చేశామంటూ కల్లబొల్లి కబుర్లు! కనుక దీనిపై తమకూ హక్కుందంటూ అహేతుకమైన డిమాండ్! ఒకవైపు అధికారం.. మరోవైపు మీడియాను గుప్పిట్లో పెట్టుకున్న సీమాంధ్ర నాయకత్వం వెదజల్లుతున్న దుష్ట ప్రచారం! అవునా.. హైదరాబాద్‌ను సీమాంధ్ర నేతలు.. వారి పెట్టుబడిదారులు, వారి బినామీలు అభివృద్ధి చేశారా? నిజమేనా.. దేశంలో హైదరాబాద్ ఒక విశిష్ఠ స్థానానికి చేరుకోవడం వెనుక సీమాంవూధుల కాయకష్టం ఉందా? నమ్మొచ్చా.. తమ చెమట చిందించి హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని చెబుతున్న సీమాంధ్ర నేతల వాదనలను? చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.. స్థూలంగా గమనించినా గోచరించే వాస్తవం..

సీమాంవూధుల నుంచి హైదరాబాద్ లబ్ధి పొందలేదు.. హైదరాబాద్ నుంచే సీమాంవూధులు లబ్ధి పొందారు! తాము పోగేసుకున్న నోట్ల కట్టలను.. బంగారుపవ్లూంలాంటి హైదరాబాద్ ఆసరాగా గుట్టలుగా పెంచుకున్నారు! నిజానికి విలీనానికి ముందే హైదరాబాద్ అత్యంత సంపన్న రాజ్యాల్లో ఒకటి! సొంతగా బ్యాంకును, బస్సును, కరెన్సీని, విద్యుత్ ప్రాజెక్టును, విశ్వవిద్యాలయాన్ని కలిగి ఉన్న ప్రాంతం! ఇప్పటికీ నగరంలో చిహ్నాలన్నీ నిజాం కాలపు నిర్మాణాలే! ఆ నిర్మాణాల పునాదులను పటిష్టం చేసింది తెలంగాణ కష్టజీవి చెమట చుక్కలే! ఏ షెహర్ హమారా! సిర్ఫ్ హమారా! ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత నిజం! కానీ.. ఈ నిజాన్ని మరుగునపడేసేందుకు ఎన్ని కుట్రలు? వాస్తవాలను సమాధి చేసేందుకు ఎన్ని దుష్ట యత్నాలు? ఇప్పుడు స్థూలంగానైనా పాఠం చెప్పక తప్పదు! హైదరాబాద్ సొంతం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు గుణపాఠం నేర్పక తప్పదు! సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విలీనం కాకముందు హైదరాబాద్ వెలుగులను మరోసారి గుర్తు చేయకతప్పదు! ఈ నగరం తెలంగాణ సొంతమని నినదించక తప్పదు!!
- ఇది తెలంగాణ గుండెకాయ
- తెలంగాణ కష్టజీవి చెమట చుక్క
- సమైక్యానికి ముందే నగరం బంగారుపళ్లెం
- దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా ప్రఖ్యాతి
- దోచుకు తిన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు
- అభివృద్ధి మా దయ అంటూ కలరింగ్
హైదరాబాద్, జూన్ 30 (టీ మీడియా): హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది సీమాంవూధులేనట! అందుకు వేల కోట్లు ధారబోశారట! చెమట చిందించి.. నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారట! నిజమేనా? హైదరాబాద్ అభివృద్ధి సీమాంధ్ర నేతల పుణ్యమా? కాదు.. కానే కాదు.. అంటూ నినదిస్తున్నది సమస్త తెలంగాణం! గుప్పెడు మంది సీమాంధ్ర నేతల దుష్ప్రచారాన్ని తూర్పారబడుతున్నది తెలంగాణ మేధావివర్గం! తాము అభివృద్ధి చేశాం కనుక తమకూ హైదరాబాద్‌పై హక్కు ఉండాలంటూ మంకు పట్టుపడుతున్న పెట్టుబడిదారుల అసలు ప్రయోజనాలను బయటపెడుతున్నది తెలంగాణ విశ్లేషక బృందం!

తెలంగాణ అంశం పరిష్కార కూడలికి చేరుకున్నప్పుడల్లా సీమాంధ్ర పాలకులు చేసే విష ప్రచారాలు అన్నీఇన్నీ కావు. తాము హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాతే నగరం ‘భాగ్య’నగరమైనట్లు గొప్పలు పోతుంటారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన మీడియా కూడా తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌పై ఎవరికి హక్కు ఉంటుంది? అన్న కోణంలో విషంగక్కే బాధ్యతను నెత్తినపెట్టుకుంది. ‘మేము హైదరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు గుమ్మరించాం. హైదరాబాద్‌ను ఎలా వదులు కుంటాం’.. అనేది సీమాంధ్ర నాయకుల నోటి నుంచి వచ్చే మరొక మాట. ఇది పూర్తిగా అసమంజసమైన, సత్యదూరమైన మోసపూరిత మాటలని మేధావులు, విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

బంగారు పళ్లెం హైదరాబాద్
ఆంధ్రవూపదేశ్‌కు రాజధాని కాకమునుపు దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరంగా భాసిల్లింది భాగ్యనగరం. అలాంటి హైదరాబాద్‌ను విలీనం సమయంలో బంగారుపవ్లూంలో పెట్టి అప్పగించారు. రాజధాని కూడా లేని పరిస్థితి ఆంధ్రది. ఆంధ్రవూపదేశ్‌గా అవతరించిన తర్వాత హైదరాబాద్‌లో రాజధానిని ఏర్పాటు చేశారు. అప్పటికే అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్.. అనంతరం కాలంలో దేశంలోని ఇతర నగరాల అభివృద్ధి చెందిన క్రమంలోనే మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది.

భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత ధనిక సంస్థానంగా పేరు గడించింది హైదరాబాద్. 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయినప్పుడు దాని ఆదాయం 900 లక్షల పౌండ్లు. హైదరాబాద్ స్టేట్ బ్యాంకు పేరుతో ప్రత్యేక బ్యాంకు ఉంది. నిజానికి హైదరాబాద్ అభివృద్ధి చెందినది నిజాం పాలనలోనే. హైదరాబాద్ సంస్థానంలో రైల్వే స్టేషన్‌ను నిర్మించింది నిజామే. బడులు, మహిళా కళాశాలలు, మదర్సాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు భవనం, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, జూబ్లీహాల్, ఉస్మానియా ఆస్పత్రి, అసెంబ్లీ భవనం, మోండా మార్కెట్, మోజంజాహి మార్కెట్, ఆబిడ్స్ మార్కెట్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో పాటు.. హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లాంటి భారీ జలాశయాలను నిర్మించింది కూడా నిజామే. జంట నగరాల్లో విశాలమైన రోడ్లను చక్కని ఉద్యానవనాలను నిర్మించింది కూడా ఆ కాలంలోనే. 1955లో హైదరాబాద్‌లోని వసతులను చూసిన అంబేద్కర్ దీనిని భారతదేశానికి రెండో రాజధానిగా చేయాలని భావించారు. ఎన్నో విషయాల్లో ఢిల్లీ కంటే మెరుగైన నగరంలా పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరం 1908 నుంచి క్రమక్షికమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1908లో వచ్చిన మూసీ వరదల్లో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్తుతో నిజాం ప్రభుత్వం కళ్లుతెరిచింది. ఈ వరదలు హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనాన్ని నాశనం చేశాయి. ఈ నేపథ్యంలోనే నగరాన్ని దశలవారీగా అభివృద్ధి చేయడానికి 1912లో నగరాభివృద్ధి సంస్థ ఏర్పడింది. రోడ్లు, షాపింగ్ సెంటర్లు, గృహ సముదాయ ప్రాంతాలు ఏర్పాటు చేయడానికి నగరాభివృద్ధి బోర్డు మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. వరదలు నివారించడానికి, హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి మైసూరు రాజ్యానికి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ప్రముఖ ఇంజినీరు నిజాం ప్రభుత్వ సలహాదారుగానియమితులయ్యారు. వరదలు నివారించడానికి, మొత్తం నగరానికి మంచినీరు సరఫరా చేయడానికి 1917లో మూసీనదిపై ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ చెరువులను తవ్వించారు. 1928లో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మీటర్ గేజ్ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు.

1935లో మిగతా దేశంతో వైమానిక అనుసంధానం కలిగింది. మద్రాసు-కరాచీ విమానం హైదరాబాద్ సమీపంలోని హకీంపేట విమానాక్షిశయంలో దిగే ఏర్పాటు జరిగింది. 1932లో బస్సు సౌకర్యం ఏర్పడి 1936 నాటికి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు బస్సులు తిరగడం మొదలైంది. హైదరాబాద్, సికింవూదాబాద్‌ల అనుసంధానానికి బస్సు ఎంతో ఉపయోపడింది. హైదరాబాద్‌లా సికింవూదాబాద్‌ను తీర్చిదిద్దడానికి 1930లో కంటోన్మెంట్ అధికారులు టౌన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టును ఏర్పాటు చేశారు. జేమ్స్ స్ట్రీట్ (ఇప్పుడు ఎంజీ రోడ్డు)లో జనసామర్ధ్యం తగ్గించడానికి కింగ్స్ వే (రాష్ట్రపతి రోడ్) 1936లో ఏర్పాటైంది. రాష్ట్రంలో పరిక్షిశమలు పెట్టడానికి ఆరవ ఆసఫ్‌జా ప్రోత్సహించి వసతులు కల్పించారు. జౌళి పరిక్షిశమ అభివృద్ధి చెందింది. 1933లో వీఎస్‌టీ ఏర్పాటైంది. ఆజామాబాద్ అత్యంత పురాతన పారిక్షిశామికవాడగా గుర్తింపు పొందింది. నిజాం ప్రభుత్వం 1929లో కోటి రూపాయలతో ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్ ఏర్పాటు చేసింది.

ఇది క్రమేణా మూడు కోట్లకు పెరిగింది. దీంతో అనేక పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. 1920-21లో దివాన్ బహదూర్ రామ్‌గోపాల్ (డీబీఆర్) మిల్స్ మొదట సికింవూదాబాద్‌లోని ఎల్బీగూడలో ప్రారంభమైంది. అప్పట్లోనే బొక్కల దవాఖాన, ఛాతీ రోగాల వైద్యశాల, ఉస్మానియా ఆస్పవూతి, నీలోఫర్, ఫీవర్ హాస్పిటల్, ప్రసూతి ఆస్పత్రి వంటి వాటిని ఏర్పాటు చేశారు! ఇప్పటికీ నగరంలో అవి వైద్యపరంగా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి! ప్రస్తుతం నగరంలో 3500 కి.మీ.పొడవైన మురుగునీటి కాల్వల వ్యవస్థ ఉండగా.. అందులో 75 శాతం నిజాం కాలంలో నిర్మించినదే. తాను నిర్మించిన ఈ మహా నగరంలోకి చెరువులోకి చేపల్లా ప్రజలందరూ చేరి, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలని 400 ఏళ్ల క్రితం మొదటి నిజాం ఫర్మానా రాశాడు. చుట్టుపక్కల జిల్లా నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వివిధ వృత్తుల కోసమైతేనేమి.. పొట్టచేతబట్టుకుని వలస వచ్చినవారైతేనేమి.. వ్యాపారాల కోసంరాష్ట్రాలు దాటి వచ్చినవారైతేనేమి.. లక్షల మంది! లక్షల చేపలు! కానీ.. ఇప్పడా చేపలను సీమాంధ్ర పాలకులు వలేసి పట్టుకుని.. వండివార్చుకుంటున్నారు! తెలంగాణ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు.

సీమాంవూధుల పాలనలో పరిక్షిశమలు మూత
అద్భుతమైన నగరం.. సమైక్య రాష్ట్రంలో రూపురేఖలు కోల్పోయింది. హైదరాబాద్‌ను సమైక్య రాష్ట్రానికి రాజధానిని చేసిన తర్వాత.. నిజాం హయాంలోని అజంజాహి మిల్లు, సిర్పూర్ సిల్క్ మిల్లు, అంతగ్రాం స్పిన్నింగ్ మిల్లు, నిజాం షుగర్స్‌లాంటివి ఎన్నో మూతపడ్డాయి. అందరూ చెప్పే హైటెక్‌సిటీ, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్, మోటరోలా వంటి బహుళజాతి కంపెనీల పెట్టుబడి, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెట్టుబడి సీమాంవూధులది కాదని ఉద్యోగ సంఘల నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆంధ్ర నుంచి వచ్చి కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లాంటి చోట్ల కాలనీలు నిర్మించుకున్నారని, ఇదే సీమాంవూధులు హైదరాబాద్‌కు చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. సినీ పరిక్షిశమను హైదరాబాద్‌కు అనేక రాయితీల ద్వారా తరలించడంలోనూ లాభపడింది ఆంధ్రావాళ్లే. తెలంగాణ ఏర్పడితే ఎక్కడ తామ అక్రమ ఆస్తులను కోల్పోవలసి వస్తుందోనన్నది సీమాంవూధుల భయమని తెలంగాణవాదులు అంటున్నారు. అందుకే ప్రత్యేక తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా హైదరాబాద్‌ను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

ఆస్తులు కాపాడుకోవడానికే
హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న వేల ఎకరాల భూములను రైతల నుంచి నయానో, భయానో కాజేసిన సీమాంవూధులు తమ ఆస్తులను కోట్లకు పడగపూత్తించుకున్నారని అరోపణలు ఉన్నాయి. సెజ్‌లు, పరిక్షిశమల పేర పంటల భూములను కారుచౌకగా కాజేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. విద్యా రంగాన్ని సీమాంవూధులే గుప్పిట్లో పెట్టుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండే భూమి ధరలను అమాంతంగా పెంచేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని, వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు డబ్బాశ చూపి వ్యవసాయాన్ని నాశనం చేయడానికి కారకులయ్యారు. హైదరాబాద్ శివార్లను రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రాలుగా మార్చివేసి కూరగాయల సాగుకు రైతును దూరం చేశారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ట్రావెల్స్‌ను నెలకొల్పి ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టారు. హైదరాబాద్ చట్టుపక్కల భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్న సీమాంవూధులు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తమ ఉనికికే నష్టం వస్తుందనే భయంతో రాష్ట్ర ఏర్పాటుకి హైదరాబాద్‌తో ముడిపెడుతున్నారు.

అభివృద్ధి కాదు.. విధ్వంసం చేశారు
- రచయిత లోకేశ్వర్
సీమాంవూధలో తెలంగాణ విలీనమైన తర్వాత అభివృద్ధి జరగలేదని, విధ్వంసం జరిగిందని ప్రముఖ రచయిత లోకేశ్వర్ అన్నారు. ఇప్పుడు కేవలం హైదరాబాద్‌లో ఉన్న తమ ఆస్తులను రక్షించుకోవడానికే కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు తాపవూతయపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి రావచ్చు, పోవచ్చని, ఎవరి ఆస్తులకు ఢోకా లేదని సీమాంధ్ర నేతలకు సూచించారు.

ఎవరితో ఎవరు లాభపడ్డారు?
- లెక్కలు చూసుకుందాం
- సీమాంధ్ర నేతలకు వీక్షణం
ఎడిటర్ వేణుగోపాల్ సవాల్
తెలంగాణ ప్రాంతంతో సీమాంవూధులు కలిసున్నది కొంతకాలమేనని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తెలిపారు. హైదరాబాద్ ఏర్పడే నాటికి సీమాంవూధులు విజయనగర సామాజ్యంలో ఉన్నారని, ఆ తర్వాత బ్రిటీష్‌వారి ఆధీనంలోకి వెళ్లారన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిదన్నారు. అప్పట్లో వారికి జొన్న సంకటే దిక్కన్న సంగతి చరివూతలో రికార్డయిందని గుర్తుచేశారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి