8, జులై 2011, శుక్రవారం

మందకృష్ణ కు మనవి

తెలంగాణ ఉద్యమానికి కులం లేదు, మతం లేదు. అలాగే ఉద్యమానికి అడ్డుపడే వారికి మానవత్వం లేదు:
------------------------------​------------------------------​------------------------------​----
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న ప్రతి సారి మంద కృష్ణ ఏదో ఒక డిమాండ్ తీసుకుని తెర (బుల్లి) ముందు వాలుతుంటాడు. ఈసారి ఎపిసోడ్ కి తెర వెనక సూత్రధారి జగన్ అని సాక్షత్ మంద కృష్ణ నే ఒప్పుకున్నాడు. (ఒక రోజు ముందు జగన్ ను కలిసిన సంగతి ని బహిరంగంగానే చెప్తున్నాడు). మంద కృష్ణపోరాడుతున్న వర్గీకరణ డిమాండ్ సహేతుకమైనదే అయినా సందర్భమే సరైనది కాదు. అనగారిణ వర్గాలకు రాజ్యాధికారం అందరు కోరుకునేదే అయినా దాన్ని తెలంగాణ ప్రజా ప్రతినిధులు చేయక చేయక రాజీనామా చేస్తే వాటికి మెలిక పెట్టడం సరి కాదు.

ఎవరు కలిసి రాని పదిహేనేళ్ళ క్రితం కాలంలోనే తన జాతిని ఏకం చేసిన మంద కృష్ణ కు తెలంగాణా వచ్చాక కూడా వర్గీకరణ మీద పోట్లాడటం పెద్ద విషయమేమీ కాదు. మంద కృష్ణ కు దోరలతో తగువులు ఉంటే తెలంగాణ వచ్చాక చూసుకోవాలి కానీ, ఇలాంటి సమయంలో తలనొప్పులు సృష్టింఛొద్దు అని  మనవి. మాట్లాడితే బాబాసాహెబ్ పేరేత్తే మంద కృష్ణ, ఆ అంబేద్కరుడి ఆశయం అయిన చిన్న రాష్ట్రాల స్పూర్తి ని తుంగలో తొక్కవద్దని నాలుగున్నర కోట్ల ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి