ఉద్యమతార నింగికెగసింది. తెలంగాణ రాష్ట్రసాధనే ధ్యేయంగా భావించిన సిద్ధాంతకర్త్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశ తీరకుండానే తుదిశ్వాసవిడిచాడు. క్రమశిక్షణకు అమిత ప్రాధాన్యత నిచ్చిన విద్యావేత్త దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఉద్యమ ఫలితాన్ని చూడకుండానే కన్నుమూశాడు. ఆర్థికవేత్తగా మూడుతరాలకు విద్యాబుద్ధులు అందించి, ఎన్నో ఉన్నతపదవులు అలరించి సమజాభి్థవృద్ధికి ఎన్నలేని సేవలందించిన అలుపెరగని సైనికుడు శాశ్వత విశ్రాంతి కోసం మూసిన కన్ను తెరవనన్నాడు. ప్రాంతీయ అసమానతలపై సమాజాన్ని అప్రమత్తం చేసిన ప్రొఫెసర్ నేటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, ఎగిసిపడుతున్న ఉద్యమకెరటాల తాకిడి, తడాఖా, దాని తుది ఫలితం చూడకుండానే పరలోకానికి పయనమయ్యాడు. ఉపాధ్యాయునిగా జీవనాన్ని ప్రారంభించి ప్రొఫెసర్‌గా ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆజన్మబ్రహ్మచారిగా, నాలుగున్నరకోట్ల తెలంగాణ ప్రజలకు పితామహుడిగా వెలుగొందాడు.
కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ జయశంకర్ (76) తన స్వగృహంలో దీర్ఘకాల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస వదిలాడు. ఆయనకు ముగ్గురు చెల్లెళ్ళు, అన్నాతమ్ముడు ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఇడి పూర్తిచేసిన ఆయన ఉపాధ్యాయవృత్తిని వరంగల్, ఆదిలాబాద్‌లో కొనసాగించాడు. బెనారస్, అలీగఢ్ యూనివర్శిటీలలో పి.జి పూర్తి చేసి 1975లో వరంగల్‌లోని చందాకాంతయ్య మెవెూరియల్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశాడు. ఆ కళాశాలను అభివృద్ధిచేసి, వన్నెతెచ్చిన వ్యక్తి జయశంకర్.
తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగానే 1952లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకించాడు. నాన్‌ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీసాంబార్ గోబ్యాక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అంతేకాదు 1954లో ఫజల్ అలీకమిషన్కు నివేదిక ఇచ్చాడు. 1969 సంవత్సరంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు ఆవశ్యకతపై అనేక పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో రాష్ట్రఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయన చేసిన ప్రసంగాలు యువతను ఉత్తేజపరిచాయి. ప్రాంతీయ అసమానతలపై అధ్యాయనం చేసిన ఆయన టిఆర్ఎస్ స్థాపనలో కీలకపాత్ర పోషించాడు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగి ప్రత్యేక రాష్ట్రసాధన ఆవశ్యకతను ప్రజలను వివరించాడు. తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పాటయ్యాక దానికి సిద్ధాంత కర్తగా ఉండడమేకాదు దాని వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర్‌కు కుడి ఎడమ భుజాలుగా పనిచేశాడు. క్లిష్ట సమయాలలో కెసిఆర్‌కు సలహాదారుగా, మార్గదర్శకుడిగా ఉండి ఉద్యమానికి కంచుకోటగా నిలిచాడు.
కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కృషి చేసిన వారిలో ప్రథముడు. ఆయన ప్రతిభాపాటవాలను గుర్తించిన అప్పటి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రోఫెసర్ వెంకట్రామయ్య 1981లో వర్శిటీ రిజిస్ట్రార్‌గా నియమించారు. 1991 వరకు జయశంకర్
రిజిస్ట్రార్‌గా పనిచేశాడు. ఆ తరువాత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (సీఫిల్) రిజిస్ట్రార్‌గా పదిసంవత్సరాలు పనిచేశాడు. ఉన్నతవిద్యలో బలీయమైన మార్పులు తేవడానికి కృషిచేసిన ప్రొఫెసర్ జయశంకర్‌కు తెలంగాణ ఎంతైనా రుణపడి ఉంటుంది.
కాకతీయవిశ్వవిద్యాలయం విసిగా ఎంతో పారదర్శకంగా నియమకాలు చేశారన్న కీర్తి ఆయనకు ఉంది. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన ఎలా చేయాలో వర్శిటీ అధికారులకు నేర్పించాడు. మంచి ఆర్థికవేత్తగా సంక్షిప్తంగా, సారవంతంగా ప్రసంగించే ప్రజ్ఞావంతునిగా పలువురిచేత జేజేలు అందుకున్నాడు. రాజకీయ, ఆర్థిక విషయాలలో పట్టుసాధించాడు. తెలంగాణ అభివృద్ధికి ఏయే వనరులు కావాలి వాటిని ఎలా సాధించాలి అన్న విషయాలను లోతుగా విశ్లేషించి చెప్పిన జయశంకర్ ఎన్నోసమావేశాలలో సామాన్య జనభాషలో వివరించి చెప్పాడు. ప్రజల్లోకి ఉద్యమాన్ని తెలంగాణ వాదాన్ని తీసుకెళ్ళాడు. 23 లక్షల జనంతో వరంగల్‌లో జరిగిన భారీబహిరంగసభలో జయశంకర్ సుదీర్ఘ ఉపన్యాసం ద్వారా తెలంగాణా కష్టాలు తెలియజెప్పాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వడంలో తాత్సరం ఎందుకు చేస్తున్నదీ వివరించాడు. కాళోజినారాయణరావుకు సమకాలీనుడు. తెలంగాణాకు, ముఖ్యంగా వరంగల్‌కు వెన్నెముకలా వ్యవహరించిన వాడు జయశంకర్.
courtesy:andhraprabha

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి