తెలంగాణా ప్రాంతంలోని  ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటనను తెరాస కార్యకర్తలు అడ్డుకోవడంపై నాగం  జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకోసం అహరహం కృషి చేస్తున్న తమ నాయకుడినే  అడ్డగిస్తారా...? తాము తలచుకుంటే తరిమి తరిమి కొట్టగలమని నాగం అన్నారు. 
చంద్రబాబు  నాయుడిని అడ్డుకోవడంపై నాగం ఓ పత్రికా ప్రకటన సైతం విడుదల చేశారు.  తెలంగాణా దొంగలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేననీ, తెలుగుదేశం పార్టీ  తెలంగాణా ఏర్పాటుకు పూర్తిగా కట్టుబడి ఉన్నదని తెలిపారు. 
ఇదిలావుండగా  మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండల కేంద్రంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా  కొందరు యువకులు జై తెలంగాణ ప్లకార్డులతో స్వాగతం చెప్పారు. మధిరలోని  అంబేద్కర్ సెంటర్ వద్దకు చంద్రబాబు కాన్వాయ్ చేరుకోగానే తెలంగాణావాదులు  అడ్డుకున్నారు. చంద్రబాబు ‘జై తెలంగాణ’ అనేంత వరకూ తాము ముందుకు  కదలనివ్వబోమని పట్టుబట్టారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, టీడీపీ  కార్యకర్తలకు తోపులాట జరిగింది.
 

 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి