18, నవంబర్ 2010, గురువారం

ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం

తెలంగాణ ఉద్యమం మరోసారి నిర్వీర్యం అయ్యే ప్రమాదం నెలకొంది.అగ్రకులం పేరిట కెసిఆర్  ను ప్రక్కన పెట్టె ప్రయత్నాలు ఉద్యమంపై ప్రభావం చుపనున్నాయి .ఈ కొన్ని రోజుల్లో తెలంగాణ ఉద్యమ తీరు తెన్నులలో పలు మార్పులు వచ్చాయి.కొత్త అంశాలు తెర పైకి వచ్చాయి.ఆరు దశబ్దాల తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వ పటిమ తోనే మహో జ్వలరుపం దాల్చింది.కేంద్రానికి కూడా రాష్ట్ర విబజన చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.విబజన కు అవసరమయ్యే ప్రాతిపాదికల గుర్తిమ్పునకై ప్రత్యేకంగా శ్రీకృష్ణ  కమిటీ ని కేంద్రం నియమించింది.డిసెంబర్ నెలాఖరు లోగ నివేదిక ఇచ్చేందుకు కమిటీ సిద్ధమయ్యింది.ఇక ఉద్యమం సఫలమయ్యే తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఓ వైపు కాంగ్రెస్ నాయకులు ఈ ఫలితాన్ని తమ ఖాతాలోకి హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలెట్టారు.మరో వైపు గద్దర్ తదితరులు కొత్తగా ఉద్యమ వేదికల్ని ఏర్పాటు చేసారు.పైగా కెసిఆర్ ను కులం పేరిట పక్కన పెట్టె ప్రయత్నాలు చేపట్టారు.


                     SOURCE:ANDHRA PRABHA

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి