తెలంగాణ అనే అంశం పైకి లేచిన ప్రతి సారి చాల మంది తెలంగాణ లేదా ఆంధ్ర కు గుడ్డిగా సపోర్ట్ చేస్తారు .1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది .మనకు జరిగిన అన్యాయాలు ఒక్కసారి చుడండి .
- తెలంగాణ లో 10 జిల్లాలు,ఆంధ్ర లో 9 జిల్లాలు మరియు రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయ్.ఇందులో తెలంగాణలోని 7 జిల్లాలు,ఆంధ్రలోని 3 జిల్లాలు,రాయలసీమలోని 1 జిల్లా వెనుక బడి ఉన్నాయ్ . అంటే దాదాపు 70% తెలంగాణ జిల్లాలు ,35% ఆంధ్ర జిల్లాలు మరియు 25% రాయలసీమ జిల్లాలు వెనక బడి ఉన్నాయ్.
- 45% రాష్ట్ర ఆదాయం తెలంగాణ నుంచి వస్తుండగా 28% మాత్రమే తెలంగాణకు కర్చు పెడుతున్నారు మిగితా ఆదాయాన్ని ఆంధ్ర మరియు రాయలసీమలో కర్చు పెడుతున్నారు.
- మాములుగా మనం కేనాల్స్ ద్వారా పంట సాగు చేస్తాం .ఆ కేనల్స్ ద్వారా సాగు అవుతున్నమన తెలంగాణ లోని భూమి ఒక్క గుంటూరు జిల్లా(ఆంధ్ర) లో సాగు అవుతున్న భూమి కన్నా తక్కువ అంటే నమ్మశక్యం కాదు.
- నాగార్జున సాగర్ డ్యాం నల్గొండ(తెలంగాణ) జిల్లా లో ఉంది .కాని దాని నుంచి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు మాత్రమే సాగు అవుతున్నవి .
- రెండు పెద్ద నదులు ఐనటువంటి కృష్ణా మరియు తుంగబధ్ర నదులు రాష్ట్రంలోకి మహబూబ్ నగర్ లో ప్రవేశిస్తున్నై కాని ఆ జిల్లా ఎప్పుడు కరువుతో అల్లలాడుతుంది .
- RDS ప్రాజెక్టూ మహబూబ్ నగర్ లో 85000 ఎకరాలు సాగు చేయడానికి నిర్మించగా రాయలసీమ నాయకులూ ఆ ప్రాజెక్టూ గేట్లను పేల్చేసి కర్నూల్-కడప ప్రాజెక్టూ కు తరలిస్తున్నారు.
- తెలంగాణ జిల్లాల్లో సంవత్సరానికి ఒక్క పంటనే పండించగాలుగుతున్నాం కాని ఆంధ్ర మరియు రాయలసీమలలో మాత్రం ఒక సంవత్సరానికి మూడేసి పంటలు పండిస్తున్నారు కారణం నీరు .
- 1986 లో తెర పైకి వచ్చిన 610 G.O ఇప్పటి వరకు అమలు కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు .మాములుగా 610G.O ఎక్కడి ప్రాంత ఉద్యోగాలు అక్కడి ప్రాంతం వాళ్ళు చేసుకోవాలని రూపొందించింది కాని ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు రావని చేసిన కుట్ర ఇది .భారతదేశ చరిత్రలో 25 సంవత్సరాలుగా అమలు కాని ఏకైక G.O 610 G.O.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి