7, ఆగస్టు 2010, శనివారం

సమైక్యాంధ్ర ఎందుకు?


సమైక్యంధ్ర ఎందుకు అని మీడియా సీమంధ్ర ప్రజలను అడిగినప్పుడు 80% ప్రజలు మాకు తెలియదు అన్నారు.కాని కొందరు రాజకీయ నాయకులూ హైదరాబాద్ లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకునేందుకు సమైక్యంధ్ర అనే కొత్త ఉద్యమం మొదలు పెట్టారు.కాని వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనం అందరం తెలుగు మాట్లాడుతున్నాం కనుక మనందరం ఒకే రాష్ట్రంలో ఉండాలి మరియు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే జరగదు అని అంటున్నారు. కాని నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది దేశంలోనే 18 వ అతిపెద్ద రాష్ట్రంగా ఏర్పడుతుంది .అంటే వాళ్ళ మతాల ప్రకారం ఇండియా లో 10 రాష్ట్రాలే అబివృద్ధి చెందాయా? అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళు అందరు ఒకే రాష్ట్రంలో ఉండాలంటే హింది మాట్లాడే వాళ్ళందరు ఒకే రాష్ట్రంలో ఉండాలి మరి ఎందుకు 5 రాష్ట్రాలు ఉన్నాయ్?అమెరికా దేశంలో అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు మరి 50 రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి